Telugu News

దేశీ మిర్చి ధరలో దూసుకుపోతోంది.

క్వింటా మిర్చి ధర.. తులం బంగారం ధరను దాటి దుమ్మురేపుతోంది.

0

దేశీ మిర్చి ధరలో దూసుకుపోతోంది.

—క్వింటా మిర్చి ధర.. తులం బంగారం ధరను దాటి దుమ్మురేపుతోంది.

—-రికార్డులు బ్రేక్ చేస్తూ అదరగొడుతోంది.

(వరంగల్‌ జిల్లా విజయం న్యూస్):-
వరంగల్‌ జిల్లాఎనుమాముల మార్కెట్‌ లో ఎర్ర బంగారం మిర్చి, తెల్ల బంగారం పత్తి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దేశీయ మిర్చి రకం క్వింటాల్‌ ధర రికార్డు స్థాయిలో 55 వేల 551 పలికింది. ములుగు జిల్లాకు చెందిన రైతు రాజేశ్వరరావు గతవారం తెచ్చిన మిర్చికి అత్యధికంగా 52వేల ధర పలకగా.. ఇవాళ(సోమవారం) రైతు కిషన్‌రావు తెచ్చిన మిర్చి 55,551 రికార్డు ధర పలికింది. మిర్చికి అధిక ధర రావడంతో పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

also read :-పెద్దపులి బారినపడి మృతిచెందిన జీవాల యజమానులకు నష్ట పరిహారం అందజేత…..

తామర పురుగు కారణంగా దిగుబడి తగ్గిందని అయితే ధర ఎక్కువ పలకడం కాస్త ఊరట కలిగిందంటున్నారు రైతులు. నిత్యం నష్టాలపాలయ్యే మిర్చి రైతులకు రికార్డు స్థాయిలో పలుకుతున్న ధరలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఇంత ధర గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాపారులు చెబుతున్నారు. గత నెల 3న తొలిసారి క్వింటాల్ దేశీయ మిర్చి ధర 32 వేలు పలకగా.. ఇవాళ 55,551 పలకడం గమనార్హం. మరో వైపు క్వింటాల్‌ పత్తి ధర 12,110 పలికింది.