Telugu News

**విజయవంతంగా ముగిసిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర

వరంగల్ ప్రతినిధి విజయం

0

***విజయవంతంగా ముగిసిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర.

***(వరంగల్ ప్రతినిధి విజయం):-

-శనివారం రోజు శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు వన ప్రవేశం చేరినప్పటికీ ఆదివారం నాడు కూడ లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు.-ఆదివారం నాడు దాదాపు పది లక్షల మంది భక్తులు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను సందర్శించారు..-శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను దాదాపు ఒక కోటి 45 లక్షల మంది భక్తులు దర్శించారు.శనివారం నాడు జాతర ముగిసినప్పటికీ భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు, సిబ్బంది ఆదివారం నాడు కూడ జాతర విధులు నిర్వహించారు.జాతర పిదప మేడారంలో, సమీప గ్రామాలలో అంటువ్యాధులు ప్రబలకుండా శానిటేషన్, పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.ములుగు జిల్లా మేడారం గ్రామంలో నాలుగు రోజులపాటు నిర్వహించిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర శనివారం విజయవంతంగా ముగిసింది.

also read :-ముగిసిన మేడారం మహాజాతర.. వనప్రవేశం చేసిన గిరి‘జన’దేవతలు

శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు శనివారం నాడు వన ప్రవేశం చేసినప్పటికీ ఆదివారం నాడు పెద్ద ఎత్తున భక్తులు జాతరకు వచ్చారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం సాయంత్రం తెలిపారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిన్నటి వరకు ఒక కోటి 35 లక్షల మంది భక్తులు సందర్శించి అమ్మవార్ల దర్శనం చేసుకోగా, ఈరోజు (ఆదివారం) సాయంత్రం వరకు దాదాపు 10 లక్షల మందికి పైగా భక్తులు మేడారం జాతర సందర్శించి పూజలు చేశారని మంత్రి తెలిపారు.
జాతరకు పెద్ద ఎత్తున వస్తున్న భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ఆదివారం నాడు కూడా భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందని ఆయన తెలిపారు. జాతర విధుల నిర్వహణకు నియమించిన అధికారులు, సిబ్బంది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం నాడు విధుల్లో ఉండి భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. మేడారం జాతరలో అమ్మవార్ల దర్శనం చేసుకున్న భక్తులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పాటు చేసిన బస్సులో వారి వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నామని మంత్రి తెలిపారు. జాతరలో శాంతి భద్రత పరిరక్షణకు పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. దీనికి తోడుగా వాహనాలు సాఫీగా ప్రయాణం చేయడానికి పోలీస్ శాఖ ద్వారా చర్యలు చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు.

also read :-***నిత్యశ్రీ ని అభినందించిన మంత్రి పువ్వాడ..
మేడారం లో జరిగిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర అనంతరం మేడారం గ్రామంలో, సమీప గ్రామాలలో ఏ విధమైన అంటువ్యాధులు ప్రబలకుండా పటిష్టమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని మంత్రి దయాకర్ రావు తెలిపారు. అందులో భాగంగా ఈ నెలాఖరు వరకు మేడారం గ్రామంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మేడారం, సమీప గ్రామాలలో ఇంటింటికి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వెళ్లి ఆయా గ్రామాల ప్రజల ఆరోగ్యాలపై సర్వే నిర్వహించి అవసరమైనవారికి ఉచితంగా చికిత్స అందజేస్తారని, మందులను పంపిణి చేస్తారని ఆయన తెలిపారు. దీనికి తోడుగా మేడారం, సమీప గ్రామాలలో పశువులకు వ్యాధులు ప్రబలకుండా ఉచిత పశు వైద్య శిబిరాలను పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా జాతరలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను, ప్లాస్టిక్ ను వెంటనే తొలగిస్తున్నామని తెలిపారు. దీనికి తోడుగా మేడారం జాతరలో, సమీప గ్రామాలలో అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్ ను స్ప్రే చేస్తామని ఆయన తెలిపారు.

అందులో భాగంగా మేడారం, ఊరట్టమ్, కొత్తూరు, జంపన్న వాగు, కన్నేపల్లి, నార్లపూర్, రెడ్డి పురం, చింతల్ క్రాస్, చిలకల గుట్ట తదితర ప్రాంతాలలో వ్యర్ధ పదార్ధాలను పారిశుద్ధ కార్మికులు తొలగిస్తున్నారని మంత్రి చెప్పారు. వారం రోజుల పాటు పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయిస్తామని ఆయన చెప్పారు. దీనికి తోడుగా దోమల వ్యాప్తిని అరికట్టడానికి ఫాగింగ్ చేయిస్తున్నామని ఆయన తెలిపారు.
మేడారం జాతర లోని శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు గద్దెల ప్రాంగణం లో బెల్లం, ఇతర వ్యర్థ పదార్థాలను తొలగించిన పిదప అగ్నిమాపక శాఖ వారు ఫైర్ ఇంజన్ ద్వారా నీటిని స్ప్రే చేసి శుభ్రపరుస్తారని మంత్రి చెప్పారు.

also read :-తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. తునాతునకలైన మృతదేహాలు

జాతర ప్రారంభానికి రెండు నెలల ముందు జాతర ఏర్పాట్లను మేడారంలో సమీక్షించి, పరిశీలించి భక్తులకు సౌకర్యాల కల్పనకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. జాతర జరిగిన నాలుగు రోజులు మేడారంలో బస చేసి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను స్వయంగా పరిశీలించి భక్తులు సంతృప్తిగా ఉండేందుకు తీసుకొనవలసిన చర్యలపై ములుగు జిల్లా కలెక్టర్ కు, ఎస్పీకి, జిల్లా స్థాయి అధికారులకు, సిబ్బందికి, విధుల్లో ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేసి అన్నీతానై విజయవంతంగా జాతర నిర్వహించారు.జాతర అనంతరం మేడారంలో, సమీప గ్రామాలలో నివసించే భక్తులకు భవిష్యత్తులో ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలు మంత్రి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నారు.