అధికారుల కనుసన్నల్లో అక్రమ ఇసుక మాఫియా
—-సంబంధిత అధికారులకు కూతవేటు దూరంలో గుట్టలుగా ఇసుక డంపులు
—-గుట్టను తలపిస్తున్న ఇసుక డంపులు
(నర్సింహులపేట/విజయం న్యూస్):-
నర్సింహులపేట మండల కేంద్రంలో కొమ్ముల వంచ, జయపురం, కౌసల్యాదేవి పల్లి, రామన్నగూడెం గ్రామాల శివారులోని ఆకేరు వాగులో ఎలాంటి పర్మిషన్ లు కూపన్ లు లేకుండా విచ్చలవిడిగా రాత్రి పగలు తేడాలేకుండా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది
సంబంధిత అధికారులు ఇసుక అక్రమ రవాణా పై పండుగ పూట సైతం రాత్రుళ్లు పహరా కాస్తున్నామని, ఇసుక రీచులలో ట్రెంచ్ లు కొట్టించామని, పేపర్లో కనిపిస్తు చేతివాటం చూపిస్తున్నారని, కొన్ని గ్రామాల ఇసుక రీచులలో ట్రెంచ్ లు కొట్టించి
also read :-ఉమ్మడి మండలo లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృత పర్యటన…..
కొన్ని గ్రామాల ఇసుక రీచ్ లలో ట్రెంచ్ లు కొట్టించకపోవడం గల మతలబు ఏమిటి అని గ్రామస్థులు, రైతులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారుకొమ్ములవంచ, బొజ్జన్నపేట, కౌసల్యాదేవి పల్లి గ్రామాల శివారులోని ఆకేరు వాగులో ఇసుక రీచ్ కనపడటం లేవా ?
ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమ ఇసుక రవాణా పై దృష్టి పెట్టి ఉక్కు పాదం మోపాలని కోరుతున్నారు