కేటీఆర్ నోరు జాగ్రత్త: సీఎల్పీ నేత భట్టి
== కాంగ్రెస్ పై విమ్మర్శలు చేసే హక్కు నీకు ఉందా..?
== కాంగ్రెస్ లేకపోతే నువ్వు, మీ అయ్య ఎక్కడేండేవారు..?
== తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ పార్టీ ఆవగింజంత
== మీ భాషా ప్రవర్తన ఇకనైనా మార్చుకొండి
== పదేళ్ల పరిపాలనలో బహుళ ప్రాజెక్టు ఒకటైన కట్టారా
== గృహ నిర్బంధం చేసి మైక్ ఉందని నోటికి వచ్చి మాట్లాడి వెళ్ళిపోతే ఎలా?
== అడిగితే కేసులు. ప్రశ్నిస్తే వేధింపులు. ఇదేనా మీ బంగారు పాలన?
== సంపద అంతా ఏం చేశారు? ఎటు పోయింది?
== మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
మైకు ఉంది కదా..? అని కాంగ్రెస్ పార్టీపై ఇష్టానుసారంగా మాట్లాడితే బాగుండదని, సహించేది లేదని, మంత్రి కేటీఆర్ తన నోరు జాగ్రత్త గా ఉంచుకోవాలని, జాగ్రత్తగా మాట్లాడాలని, లేకుంటే ప్రజలు తగిన విధంగా బుద్ది చెబుతారని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క సూచించారు. ఆదివారం ఖమ్మం నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ
ఇది కూడా చదవండి:-;ఓట్ల కోసం కేసీఆర్ ది దొంగ కపట నాటకం: భట్టి విక్రమార్క
కేటీఆర్… కాంగ్రెస్ పై అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని, మీ భాషా ప్రవర్తన ఇకనైనా మార్చుకోవాని హితవు పలికారు. కేటీఆర్… మీ కంటే మేము మీరు వాడే భాషను ఎక్కువగా ఉపయోగించగలం, మాట్లాడగలం, కానీ మా పార్టీ మాకు వింగిత జ్ఝానాన్ని నేర్పిందదని, సభ్యత సంస్కారం అడ్డు వస్తుందన్నారు. కేటీఆర్ చదువుకున్న వ్యక్తి, కొంచెం ప్రపంచ జ్ఞానం తెలిసిన వారు, సంస్కారయుక్తంగా మాట్లాడుతారని నిన్న ఖమ్మం వచ్చినప్పుడు ఆశించాం కానీ ఆయన భాష సంస్కార యుక్తంగా లేకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 150 సంవత్సరాలు నిండిన కాంగ్రెస్ పార్టీ కి వారంటీ లేదంటా..? ముసలి నక్క ఏం చేస్తుందని మాట్లాడతారా..? ఇదేనా మీ సంస్కతి, సంప్రధాయం అని ప్రశ్నించారు. కేటీఆర్ మాట్లాడంది ఏం భాష? అది ప్రజాప్రతినిధులు మాట్లాడే బాషేనా..? అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఖమ్మం వచ్చి మీటింగ్ పెట్టిన మీరు ప్రజలకు ఏం చేస్తారు? మీ విధానాలు ఏంటి? ఏం చేయబోతున్నారు? చెప్పాలి కదా..? ఎందుకు ప్రజలకు చెప్పలేకపోయారని ప్రశ్నించారు. అలాంటివి చెప్పకుండా అనవసర భాషను ప్రయోగించి సంస్కారం పోగొట్టుకున్నారని యద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి:- తెలంగాణలో రాబోయే ప్రభుత్వం మాదే: భట్టి విక్రమార్క
ఖమ్మం పర్యటన చేయడానికి మీకు భయం పట్టుకున్నది అందుకనే విపక్ష పార్టీల నాయకులను పోలీసు లతో ముందస్తు గృహనిర్బంధం చేయించి, నువ్వు ఒక్కడివే పోలీసుల మధ్యన పర్యటన చేయడం నీకు ఎంత భయం ఉందో ప్రజలందరికి కనిపించిందన్నారు.
== 50ఏళ్లు మీరు పరిపాలించుంటే..? : భట్టి
మీరు పాలనలో ఇన్నాళ్లు ఉండి ఉంటే నువ్వు ఖమ్మం రావడానికి ఎద్దుల బండిలో నెల రోజులు పట్టేదని విమ్మర్శించారు. పదేళ్లలో ఒక్క రోడ్డునైనా మీరు బాగు చేశారా? అని ప్రశ్నించారు. పదేళ్ల పరిపాలనలో బహుళ ప్రాజెక్టు ఒకటైన కట్టారా? ప్రజలకు పనికొచ్చే పరిశ్రమలు పెట్టారా? ఇరిగేషన్ ప్రాజెక్టు ఒకటైన పూర్తి చేశారా? త్రిబుల్ ఐటీ ఏర్పాటు చేశారా? సంపద అంతా ఏం చేశారు? ఎటు పోయింది..? అని సీఎల్పీ నేత భట్టి ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు వచ్చిన రోడ్డును అడిగితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిందో… ఏంటో చెప్పుద్దన్నారు.
== కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో..? విను..? : భట్టి
గుండు సూది ఉత్పత్తి చేయలేని దేశాన్ని చంద్రమండలానికి రాకెట్లు, శాటిలైట్స్ పంపించి స్థాయికి అభివృద్ధి
కాంగ్రెస్ పార్టీ అని సూచించారు.
ఇది కూడా చదవండి:- తుమ్మలతో భట్టి ఏం మాట్లాడారు..?
అమెరికాతో సైన్స్ లో పోటీపడి స్థాయికి దేశాన్ని అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. ప్రపంచం తో పోటీపడే విధంగా కంప్యూటర్ విప్లవం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అమెరికా అగ్రరాజ్యంలో ఉన్న ఐటీ కంపెనీలకు సీఈవోలుగా నేడు భారతీయులు ఉన్నారంటే దానికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ కొనియాడారు. తినడానికి తిండి దొరకని కరువు పరిస్థితుల నుంచి దేశంలో ఆకలి చావులు లేకుండా చేయడానికి హరిత విప్లవం తీసుకువచ్చి అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి ప్రపంచానికి ఆహార ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకువెళ్లింది కాంగ్రెస్ పార్టీ కదా..? అని ప్రశ్నించారు. శ్వేత విప్లవం, నీలి విప్లవం పంచవర్ష ప్రణాళికలు మిశ్రమ ఆర్థిక విధానాలు తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుం చేశారు. దేశ సంపద ప్రైవేటు వ్యక్తులకు వెళ్లకుండా కాపాడి, సంపద ప్రజలకు చెందే విధంగా చేసింది కాంగ్రెస్ పార్టీ అని సంతోషంగా చెప్పారు. దేశంలో భూ సంస్కరణలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, మీ లాంటి దొరలు భూములను గుప్పెట్లో పెట్టుకొని ప్రజలను పీడిస్తూ బాంచెన్ దొర అని పీడిస్తుంటే, అది కాదు సమాజానికి కావాల్సింది, దొరలు గుంజుకున్న భూములను పేదలకు పంచి భూములపై వాటా కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు. ఉత్పత్తి రంగాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లింది కాంగ్రెస్ పార్టీ బ్యాంకులను జాతీయ చేసి గొంగడి వేసుకున్న వారు సైతం బ్యాంకు మెట్ల ఎక్కి రుణాలు పొందే విధంగా చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా..? అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి:- కాంగ్రెస్ తుంగ పూస లాంటిది: పువ్వాళ్ల
20 సూత్రాలు తెచ్చి పేదల బతుకుల కావలసిన అవసరాలు తీర్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. ఈరోజు దేశం సుభిక్షంగా సైన్స్, టెక్నాలజీ విద్యా వ్యవస్థలు ఇరిగేషన్ ప్రాజెక్టులు త్రిబుల్ ఐటీ, సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందడానికి కాంగ్రెస్ వేసిన పునాదులు కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. మీలాగా నియంతృత్వంగా వ్యవహరించి ఉంటే రాజకీయంగా మీలాంటి వాళ్ళు ఈ దేశంలో పుట్టి ఉండే వారే కాదని స్పష్టం చేశారు. ప్రశ్నించే ప్రజలు ఉండాలి. ప్రజాస్వామ్యం ఉండాలి. అని కోరుకునేది కాంగ్రెస్ పార్టీ అని, ప్రశ్నించేవారిని కేసులు పెట్టాలి..జైళ్లో పెట్టాలని కొరుకునేది బీఆర్ఎస్ పార్టీ అన్నారు. అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని పోలీసులను బానిసలుగా చేసుకుని ప్రశ్నించే గొంతుకులను అణిచివేయాలనుకునే సంస్క్రతి మీది కాదా అని ప్రశ్నించారు. ప్రజలు ఇచ్చే వినతులను చదివి సమాధానం చెప్పే ధైర్యం ఉండాలి, అది కాంగ్రెస్ నాయకులకు మాకు ఉంది.. మీకు ఎందుకు ఉండటం లేదని ప్రశ్నించారు. ప్రజల నుంచి వినతులు తీసుకునే ధైర్యమే లేకపోతే ఎలా కేటీఆర్..? అంటూ సూటిగా ప్రశ్నించారు. గృహ నిర్బంధం చేసి మైక్ ఉందని నోటికి వచ్చి మాట్లాడి వెళ్ళిపోతే ఎలా..? నోరు ఉంది కదా..?అని ఇష్టానుసారంగా మాట్లాడితే సమాజం ఊరుకోదన్నారు. పోలీసులు, మిగతా ప్రభుత్వ వ్యవస్థలు ప్రజల ధన మాణా ప్రాణాలు కాపాడటానికి ఉండాలే తప్ప మీకు రక్షణ ఇవ్వడానికి కాదని ప్రశ్నించారు. మీరు చేసిన తప్పిదాల వల్ల ప్రజలు ఆగ్రహం నుంచి తప్పించుకోవడానికి పోలీసులను అడ్డుగా పెట్టుకోవడం మీకు మంచిగా అనిపిస్తుందా..? అని ఎద్దేవా చేశారు. ఈ పది సంవత్సరాల పాలనలో వ్యవస్థలు కూల్చారు.
ఇది కూడా చదవండి:- నిర్భందాలతో ఎంతమందిని ఆపగలరు: పువ్వాళ్ల
సంస్థలను నాశనం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రజల ఆస్తులను అప్పనంగా అమ్మేస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న వేలాది ఎకరాలు అమ్ముతున్నారు. అడిగితే కేసులు. ప్రశ్నిస్తే వేధింపులు. ఇదేనా మీ బంగారు పాలన?అని మంత్రి కేటీఆర్ ను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కేటీఆర్ ఇకనైనా మీ భాష మార్చుకోండి, అడ్డగోలుగా మాట్లాడితే సహించేది
లేదు, మీ భాష మీ ప్రవర్తన ను ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హితవుపలికారు.
తెలంగాణలోని 80 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు భయపడిపోయి వారంటీ లేదంటున్న కేటీఆర్, బిఆర్ఎస్ పాలకులకే రాష్ట్రంలో ఇక వారంటీ లేకుండా ప్రజలు చేస్తారని జోస్యం చెప్పారు. దళితులకు మూడెకరాలు, దళిత ముఖ్యమంత్రి, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో వారంటీ లేకుండా ప్రజలు చేయబోతున్నారని స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీలు ప్రకటించడానికి ముందే మేధో సంపత్తి కలిగిన కాంగ్రెస్ నాయకత్వం సమిష్టిగా కూర్చొని బడ్జెట్ పై లెక్కలు వేసి లోతైన అధ్యయనం చేసిన తర్వాతనే అమలుకు సాధ్యం కాబట్టే ఆరు గ్యారెంటీలు ప్రకటించామన్నారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు ప్రజలకు చెందడానికి ఇష్టపడని బిఆర్ఎస్ పాలకులు కుట్రతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం తెచ్చుకున్నదే ప్రజలు బాగుపడాలని, అందుకే ప్రజల సంపద ప్రజలకు చెందడానికి ఈ ఆరు గ్యారంటీలు ప్రకటిస్తే మీకు కలుగుతున్న బాధ ఏంటో సూటిగా చెప్పండని ప్రశ్నించారు. ఎన్ని మీటింగ్లు పెట్టిన పోలీసులతో ఎంత నిర్బంధం చేసిన ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపిస్తారని అన్నారు. బిఆర్ఎస్ పాలకుల బెదిరింపులకు ప్రజలు భయపడరని అన్నారు. గొర్రెల వద్ద తోడేళ్ళను కాపలా పెట్టినట్టు అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నామని, తెలంగాణ ప్రజలు కేటీఆర్ కు గొర్రెలు, మేకల్లా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చేసిన యోధులు, తెలివైన ప్రజలను గొర్రెలు మేకలతో పోల్చిన మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు లకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ పార్టీ ఆవగింజంత. దేశంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ అని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ తో కాంగ్రెస్ ను పోల్చితే ఎట్లా? ఏ రాష్ట్ర అవసరాలు ఆ రాష్ట్రానికి ఉంటాయి. అక్కడి ప్రజల అవసరాలకు అనుగుణంగానే పరిపాలన చేయాలని, బిఆర్ఎస్ ఎమ్మెల్యేల హెడ్ క్వార్టర్ హైదరాబాద్ ప్రగతి భవనే కదా! అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను వారి ఎమ్మెల్యేలు ప్రకటిస్తున్నారా..? లేక వారి సొంతంగా నియోజకవర్గ కేంద్రాలలో నిర్ణయాలు తీసుకొని ప్రకటిస్తున్నారా..? ఈ మాత్రం అవగాహన లేకుండా విమర్శలు చేయడం విచారకరమన్నారు. గత ఎన్నికల అప్పుడు వివిధ రాష్ట్రాలకు డబ్బులు పంపించిన చరిత్ర మీకు ఉంది కాంగ్రెస్ కు ఆ చరిత్ర తెలియదన్నారు. కాంగ్రెస్ వ్యక్తుల చుట్టూ తిరుగదు. సిద్ధాంతం, పార్టీ, చుట్టూ తిరుగుతుందన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, ప్రకటించిన ఆరు గ్యారెంటీలను చూసి ఓట్లు వేస్తారు.
ఇది కూడా చదవండి:- జమిలి ఎన్నికలు లేనట్లే..?
ఎవరో ముఖ్యమంత్రి అవుతారని ఓట్లు వేయరు. ప్రజలను అపహస్యం చేసే పని కాంగ్రెస్ ఎప్పటికీ చేయదు, చేవెళ్ల డిక్లరేషన్ లో తమ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే దళిత కుటుంబాలకు 15 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం బడ్జెట్లో 30% నిధులను దళిత, గిరిజనులకే కేటాయించి ఖర్చు పెడితే మేము ప్రకటించిన వాటికి నిధుల సమస్యనే ఉండదన్నారు. ప్రతి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పది మందికి పైగా ఆశావాహులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొత్త, పాత కలయిక, పార్టీకి లాయల్టీ, సామాజిక న్యాయం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ స్క్రీనింగ్ కమిటీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ లోతైన చర్చ చేసిన తర్వాత అభ్యర్థులను ఎంపిక చేస్తుంది అధిష్టానం త్వరలో ప్రకటిస్తారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం భావజాలం నమ్మి సేవ చేసిన వారిని ఎవరిని పార్టీ వదులుకోదు. వారిని గౌరవిస్తాం. సముచిత స్థానం కల్పిస్తాం. దేశంలో మతతత్వ బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కూటమిలో ఉన్న వామపక్షాలతో రాష్ట్రంలో ఎన్నికల పొత్తుల గురించి చర్చలు జరుగుతున్నాయి. బావ సారూప్యత కలిగిన పార్టీలు కాంగ్రెస్తో కలిసి వచ్చే పార్టీలతో కచ్చితంగా పొత్తులు పెట్టుకుంటామన్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలోకి వెళ్లకుండా ఉండటానికి సీఎం కేసీఆర్ ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించారు కానీ కాంగ్రెస్కు అలాంటి సమస్య లేదు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే అభ్యర్థుల ఎంపిక కసరత్తు చేస్తున్నది. ఈ ప్రెస్ మీట్ లో జిల్లా కాంగ్రెస్ కమిటి అద్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, నగర కాంగ్రెస్ కమిటి అద్యక్షులు పిసిసి సభ్యులు మహ్మద్ జావేద్, పి సి సి సభ్యులు రాయల నాగేశ్వరరావు, పుచ్చకాయల వీరభద్రం, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బాలాజి నాయక్,జిల్లా కిసాన్ కాంగ్రెస్, మైనారిటీ అద్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్, సయ్యద్ హుస్సేన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు చోటా బాబా, మద్ది వీరారెడ్డి పాల్గొన్నారు.