Telugu News

మంచి నీటి సమస్య రాకుండా పర్యవేక్షిస్తా…!

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు..

0

మంచి నీటి సమస్య రాకుండా పర్యవేక్షిస్తా…!

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు..

విజయం దిన పత్రిక కథనంతో కదిలిన యంత్రాంగం

(మహబూబాబాద్- విజయం న్యూస్)

మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో మంచినీటి సమస్య రాకుండా పర్యవేక్షిస్తానని మిషన్ భగీరథ డిఈ స్వామి అన్నారు.విజయం దినపత్రికలో దాహం.. దాహం.. మండల కేంద్రంలో మంచినీటి కొరత తీర్చరా..? అంటూ వచ్చిన కథనానికి మిషన్ భగీరథ డిఈ స్వామి ఆధ్వర్యంలో మిషన్ భగీరథ విజిలెన్స్ అధికారులు హుటాహుటిన మండల కేంద్రంలో పర్యటించారు. మండల కేంద్రం లోని మంచి నీరు అందని బజారులో మిషన్ భగీరథ నల్లాల ను పరిశీలించారు. మండల కేంద్రంలోని ఓరి ట్యాంక్ లోని నీటి శాతం నీటిని లను పరిశీలించారు. గ్రామపంచాయతీ బజారులోని మహిళలు మాకు గత వారం రోజుల నుండి మంచి నీళ్లు రావడం లేదని మిషన్ భగీరథ అధికారిని అడుగగా మిషన్ భగీరథ సంబంధిత అధికారులను పిలిచి మండల కేంద్రంలోని ఒకటో వార్డు ఏడవ వార్డు బజారులకు మంచి నీరు ఎందుకు రాలేదని నిలదీశారు. సంబంధిత అధికారులు ఓవర్ ట్యాంక్ నింపి వెంటనే చిన్న గుడూరు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ బజారులో మంచి నీటి సరఫరచ చేశారు.

also read ;-వరంగల్ డిక్లరేషన్ పై రైతులకు అవగాహన కల్పించాలి

ఈ సందర్భంగా మిషన్ భగీరథ డీఈ స్వామి మాట్లాడుతూ మిషన్ భగీరథ మంచినీరు కొన్ని బజార్లకు రావడం లేదని మా దృష్టికి ఎవరు తీసుకు రాలేదని మీడియాలో వచ్చిన కథనాలను చూసి స్పందించి వచ్చి పరిశీలిస్తున్నామని అన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది అయిన వాటర్ మ్యాన్ కు తన మొబైల్ నెంబర్ ఇచ్చి మంచినీటి అంతరాయం ఏర్పడినప్పుడు నాకు స్వయంగా ఫోన్ చేసి తెలపాలని సూచించారు. వేసవి కాలం కావడంతో కొంత మేరకు అంతరాయాలు కలుగుతాయని అయినప్పటికీ మండల కేంద్రానికి ప్రతిరోజు మంచినీటి సరఫరా చేపిస్తానని అన్నారు. అనంతరం మిషన్ భగీరథ సిబ్బందితో ఇకనుంచి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇకనుండి ఇలాంటి సమస్య రాకుండా చూసుకుంటానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.ఆయన వెంట చిన్న గుడూరు సర్పంచ్ కొమ్ము మల్లయ్య,గ్రామస్థులు రవి, గ్రామ పంచాయితీ సిబ్బంది, మిషన్ భగీరథ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.