Telugu News

పాలేరు జలాశయం నుంచి నీటి విడుదల

తాగునీటి కోసం మున్నేరు కు నీటి విడుదల చేసిన అధికారులు

0

పాలేరు జలాశయం నుంచి నీటి విడుదల

== తాగునీటి కోసం మున్నేరు కు నీటి విడుదల చేసిన అధికారులు

(కూసుమంచి -విజయం న్యూస్)

ఎండల తీవ్రత పెరుగుతుంది.. రోజురోజు 40డిగ్రిలకు పైగా ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో జలాశయాల్లో, చెరువుల్లో నీళ్ళు ఇంకిపోతున్నాయి. దీంతో తాగునీటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని ముందుగానే అంచనా వేసిన ఐబీ అధికారులు తాగునీటి కోసం పాలేరు జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు.

ఇది కూడా చదవండి:- రాజ్యాంగాన్ని రక్షించేది కాంగ్రెస్ మాత్రమే: రాహుల్ గాంధీ

ఖమ్మం నగరంలోని ప్రజలకు ఈ వేసవిలో తాగునీటి అవసరాల తీర్చే నిమిత్తం పాలేరు జలాశయం నుంచి ఐబీ అధికారులు మున్నేరుకు సాగర్ జలాలను విడుదల చేశారు. పాలేరు జలాశయం నుంచి ఎడమ కాల్వ ద్వారా 500 క్యూసెక్కుల నీటిని 24 గంటల పాటు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పాలేరు జలాశయంలో 23 అడుగుల గరిష్ట నీటి మట్టానికి ప్రస్తుతం 15.1 0 అడుగుల మేర నీరు నిల్వ ఉంది.