Telugu News

వైరా ఎమ్మెల్యే కు తప్పిన ప్రమాదం

★★బైక్ ను ఢికొట్టిన ఎమ్మెల్యే కారు.. ఇద్దరికి గాయాలు

0

వైరా ఎమ్మెల్యే కు తప్పిన ప్రమాదం

★★ మోటార్ సైకిల్ ని ఢికొట్టిన ఎమ్మెల్యే కారు

★★ ఇద్దరికి తీవ్ర గాయాలు… ఆస్పత్రికి తరలింపు

వైరా‌, ఆగస్టు 2(విజయంన్యూస్)

వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే లావూడ్యా రాములు నాయక్  ప్రమాదం తప్పింది. ఖమ్మం నుంచి కారేపల్లి వెళ్తున్న ఎమ్మెల్యే రాములు నాయక్ మార్గం మధ్యలోని రఘునాథపాలెం లో  కారు ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే రాములు కారు,  ఓ బైక్  ఢీ కొట్టింది. దీంతో మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కారు ఆపి గాయపడిన క్షతగాత్రుడి వద్దకు వెళ్ళిన ఎమ్మెల్యే చికిత్స నిమిత్తం తక్షణమే 108వాహనం ద్వారా ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే కారు ముందుబాగం ద్వంసమైనప్పటికి ఎమ్మెల్యేకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆయన సురక్షితంగా బయటపడ్డారు. అయితే మోటర్ సైకిల్ పై ప్రయాణించే వారు తీవ్రంగా గాయపడ్డారు. ఒక వ్యక్తికి రెండు కాళ్లు విరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అతివేగం వల్లనే ఇదంతా జరిగిందని స్థానికులు అనుకుంటున్నారు.

ఇది కూడా చదవండి:- ములుగు జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్య