Telugu News

వాళ్లేం పాపం చేశామ్ సార్..?

** జిల్లాలో 26 మంది కార్యదర్శుల ఆవుట్ ** రోడ్డున పడ్డా జేపీఎస్ లు ** ఉద్యోగ అవకాశం కల్పించాలని ధర్నాలు..వినతులు

0

వాళ్లేం పాపం చేశామ్ సార్..?

** జిల్లాలో 26 మంది జూనియర్ పంచాయతీ  కార్యదర్శుల ఆవుట్

** రోడ్డున పడ్డా జేపీఎస్ లు

** ఉద్యోగ అవకాశం కల్పించాలని ధర్నాలు..వినతులు

(ఖమ్మం – విజయం న్యూస్)

జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం వచ్చిందని సంబరుపడ్డారు.. మా వోడు కుటుంబానికి అసరగా ఉంటాడని తల్లిదండ్రులు భావించారు.. వీధుల్లో చేరి ఏడాదిన్నరపాటు బాధ్యతగా పనిచేశారు.. ఎక్కడ చిన్న మార్కు లేకుండా ప్రభుత్వం చెప్పిన పనులు చేశారు.. కష్టమైనా ఇబ్బందులు వచ్చిన పనిచేశారు.. ఉద్యోగం కాదా..? ఏదో ఒక రెగ్యూలర్ కాదా..? అని ఆశపడ్డారు.. కానీ వారి ఆశ నిరాశైంది.. సంబురపడుతున్న దశలోనే సంబురం నీరుగారిపోయింది.. ప్రభుత్వం మానవత్వం లేకుండా ఉద్యోగులను టెర్మినెట్ చేసింది. మేమేం పాపం చేశాం సారూ.. మమ్మల్ని ఎందుకు తొలగించినట్లు… మాబాధను, గోడును అలకించండి సార్..? మాకు మరో అవకాశం కల్పించండి అంటూ ఉద్యోగులు వేడుకుంటున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వం 2018లో ఔవుట్ సోర్సింగ్ ద్వారా జూనియర్ పంచాయతీలను నియామకం జరిగింది. పరీక్ష్ ద్వారా మెరిట్ లిస్టును ఆధారంగా చేసుకుని ఉద్యోగులుగా నియిమించింది. అందులో కొంత మందికి ముందుగా అవకాశం కల్పించిన ప్రభుత్వం ఆ తరువాత ఏడాదిన్నర అనంతరం మరికొంత మందిని ఉద్యోగంలోకి తీసుకింది. కాగా గత ఏఢాదిన్నర క్రితం ఖమ్మం జిల్లాలో మొత్తం 26 మంది పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం నియమించింది. కానీ 317 జీవో, జోనల్ బదిలీ లో భాగంగా గ్రేడ్ 1,2,3,4 పంచాయతి కార్యదర్శులు స్థాన చలనం అయ్యి వివిధ జిల్లాల లో పోస్టింగ్ తీసుకోవడం ఔట్ సోర్సింగ్ జూనియర్ పంచాయతి కార్యదర్శుల పాలిట శాపంగా మారి,ది. సుమారు 26 మంది కార్యదర్శుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రెగ్యూలర్ పంచాయతీ కార్యదర్శులు జిల్లాకు రావడంతో ఆవుట్ సోర్సింగ్ కార్యదర్శులపై వేటు పడింది. తమను వీధుల్లోకి తీసుకోవాలని బాధితులు కలెక్టర్ వి.పి.గౌతమ్ ను కలిసి వినతి చేశారు. అలాగే డీపీవో కార్యాలయం వద్ద ధర్నా చేశారు. వినతి పత్రాలను అందజేశారు. అయినప్పటికి ఫలితం లేకపోయింది. కార్యదర్శులను పట్టించుకునే వారే కరువైయ్యారు. ఇక ఉద్యోగసంఘాల నాయకులు ఈ విషయంపై స్పందించడం లేదు. కనీసం వారి పట్ల సానుకూల ప్రకటన చేయలేదు. మానవత్వంగా కూడా మాట్లాడలేదు. ఇదేందని ఉద్యోగ సంఘాల నాయకులను అడగ్గా, వారిని విధుల్లోకి తీసుకునే ముందే వారితో ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. ఇక ఉన్నతాధికారులు మా చేతిలో ఏమి లేదని చేతులెత్తే పరిస్థితి ఏర్పడింది.

ALSO READ :- ఘనంగా గోశాలలో విజయం దినపత్రిక ప్రారంభోత్సవం..,..

** జీవో 317తోనే వారికి ఎసరు..

ఇప్పటి వరకు వారు ప్రభుత్వ ఉద్యోగులు.. పంచాయతీ పాలక కార్యదర్శులు.. పంచాయతీ పరిపాలనలో కీలక పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు వారు సామాన్య ప్రజల్లో ఒకరైయ్యారు. వారి పాలిటీ 317 జీవో శాపంగా మారింది. వారి ఉద్యోగాలకు ఎసరు వచ్చింది. 317 జీవోతో పాటు జోనల్ వ్యవస్థ అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు ఎసరు పెట్టింది. జోన్లు మారడంతో ఇతర జిల్లాల నుంచి 74 మంది రెగ్యూలర్ పంచాయతీ కార్యదర్శులు జిల్లాకు వచ్చారు. ఫలితంగా అవుట్ సోర్సింగ్ వారిని తొలగించక తప్పడం లేదు.

** కుటుంబాల్లో ఆందోళన

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం తరువాత ఆ కుటుంబాల్లో సంతోషం నెలకొంది. ఇంత వరకు ఖర్చు చేసి చదివించినందుకు ఫలితం లభించింది అని అనుకున్నారు. కానీ 317 జీవో, జోనల్ వ్యవస్థ వారి పాలిట శాపంగా మారింది. వారి కుటుంబాల్లో ఎడుపుమిగిల్చింది. సంక్రాంతి పర్వదినాన్ని కూడా సంతోషంగా జరుపుకోకుండా చేసింది. జాబ్ వచ్చిన ఆనందం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. అలాగే పంచాయతీ కార్యదర్శులకు చాలా మందికి ఈ మధ్య పెళ్లిళ్లు నిశ్ఛయమైయ్యాయి. పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్నామని మగపెళ్లివారు, ఉద్యోగం పొందాడని ఆడపెళ్లివారు భావించారు. ఇప్పుడు ఆ రెండు కుటుంబాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. జీవో 317 ఎంత పని చేసింది..

** చాలా నమ్మకంగా పనిచేశాం: నాగరాజు , షేక్ ఇమామ్ వల్లి, తల్లంపాడు పంచాయతీ కార్యదర్శి.

పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం వచ్చినందుకు మా కుటుంబం చాలా సంతోషించారు.ఏడాదిన్నరలోనే ఆ సంతోషం అవిరైంది. ఎంతో కష్టపడి చదివి, ఉద్యోగం సంపాధించిన సంతోషం మూన్నాళ్ల ముచ్చటైంది. ఉద్యోగం చేయాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.

** తొలగించడం సరికాదు : రాయలాల నాగరాజు, వనవరం కిష్టాపురం పంచాయతీ కార్యదర్శి

2018 సంవత్సరంలో పరీక్షలు రాసిన అనంతరం మమ్మల్ని జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా నియమించారు. ఎంతో కష్టపడి పనులు చేశాం. పంచాయతీలో ప్రభుత్వం చెప్పిన అన్ని పనులు చేశాము. ఎక్కడ మాకు చిన్న మచ్చలేదు. రాత్రి 12 గంటల వరకు కూడా పనిచేశాము.. కానీ ప్రభుత్వం మమ్మల్ని నిర్థాక్ష్యణంగా తొలగించడం సరైంది కాదు.

ALSO READ :-పల్లెల్లో సందడే సందడి

** మాకు ఒక్క అవకాశం కల్పించాలి : పొరల్ల నాగరాజు, చిన్నమల్లెల గ్రామ పంచాయతీ కార్యదర్శి

పంచాయతీ కార్యదర్శులుగా ఏడాదిన్నర పాటు పనిచేశాము.. ఎంతో నేర్చుకున్నము.. ప్రభుత్వ ఉద్యోగులంగా బందువులు, చుట్టాలు, స్నేహితులకు, గ్రామస్థులకు చెప్పాము. మా కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగం తొలిగిస్తే మేము ఎలా ప్రజల్లో తిరగాలి. ప్రజలకు ఏమని చెప్పాలో అర్థం కావడం లేదు. మేమేం తప్పు చేశాము. సార్.. మా పై దయ చూపించండి. ఎదో ఒక పోస్టింగ్ కల్పించండి..