Telugu News

పాలేరులో బీఆర్ఎస్ కు బిగ్ షాక్

తుమ్మల అనుచరుల ముకుమ్మడి రాజీనామా

0

పాలేరులో బీఆర్ఎస్ కు బిగ్ షాక్

== ఆయన బాటలోనే మేము సైతం అంటున్న తుమ్మల వర్గం

== తుమ్మల అనుచరుల ముకుమ్మడి రాజీనామా

== విలేకర్ల సమావేశంలో ప్రకటించిన బీఆర్ఎస్ నేతలు

== కాంగ్రెస్ లోకి  వెళ్తున్నట్లు ప్రకటించిన తుమ్మల అనుచరులు

(కూసుమంచి-విజయంన్యూస్)

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బాటలోనే మేమంతా పయనిస్తామని, ఆయన వెళ్లిన పార్టీలోకే మేమంతా వెళ్తామని ఆయన అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీకి ముకుమ్ముడి రాజీనామాలు చేశారు. పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులు అత్యవసరంగా సమావేశమై అందరు కలిసి ముకుమ్మడి రాజీనామాలు చేస్తూ ప్రకటించారు. ఖమ్మం రూరల్ మండలంలోని బారుగూడెం శ్రీసిటి లో తుమ్మల క్యాంఫ్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గ స్థాయిలోని తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు అత్యవసర సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ భవిష్యత్ పై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ముఖ్యనాయకులు సాధు రమేష్ రెడ్డి, జొన్నలగడ్డ రవికుమార్, బండి జగదీష్, రమేష్, మద్ది మల్లారెడ్డి మాట్లాడారు. రాష్ట్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివద్ది చేశారని తెలిపారు.

ఇది కూడా చదవండి: కందాళ ఇది నీకు తగదు: సీపీఐ

60ఏళ్లలో ఎప్పుడు జరగని అభివద్ది 3 ఏళ్లలో జరిగిందని,  2018 ఎన్నికల్లో ఓటమి చెందారని, ఈ సందర్భంలో కాంగ్రెస్ లో గెలిచిన కందాళ ఉపేందర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొచ్చి, తుమ్మల నాగేశ్వరరావును అనేక రకాలుగా అవమానించారని అన్నారు.  బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్లు ప్రకటించిన అనంతరం పాలేరు టిక్కెట్ ను ఆశించిన తుమ్మల నాగేశ్వరరావుకు సీఎం కేసీఆర్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో అసంత్రుప్తిని వ్యక్తం చేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆ తరువాత ఆ పార్టీకి రాజీనామా చేశారని, అనంతరం  ఏఐసీసీ అగ్రనేత రాహుల్, సోనియాగాంధీ, ఖర్గే ల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారని తెలిపారు.  దీంతో ఆయన అనుచరులు, అభిమానులు, కార్యకర్తలందరం ఆయన బాటలోనే పయనించామని తెలిపారు. అయితే తుమ్మల నాగేశ్వరరావు జాయిన్ అయ్యే రోజున మేమంతా కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉందని, కానీ సీడబ్ల్యూసీ సమావేశం, బహిరంగ సభ హాడాహుడి ఉండటం వల్ల పార్టీలో మేమంతా చేరలేకపోయామన్నారు. అప్పటి నుంచి  బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, ఇతర పార్టీలో చేరలేదన్నారు.  కాగా అతి త్వరలో తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాకు వస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఖమ్మం రాజకీయాల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనదైన ముద్ర వేశారు. కాంగ్రెస్‌ లో తుమ్మల చేరడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోతున్నాయని అన్నారు.

ఇది కూడా చదవండి: ‘పాలేరు’ నుంచి తుమ్మల పోటీ చేయాలి

పాలేరు నియోజకవర్గంలోని.. నేలకొండపల్లి, కూసుమంచి, తిర్మాలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాలకు చెందిన నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మాజీ. తాజా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబెర్స్, మాజీ పార్టీ మండలాధ్యక్షులు, మాజీ మార్కెట్ చైర్మన్లు బీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తూ ప్రకటించారు. తుమ్మలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీలో చేరతామంటూ స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం తుమ్మల వెంటే ఉంటామని మూకుమ్మడి ప్రకటించారు. పాలేరులో తుమ్మల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించారని, నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల బాగోగులు పట్టించుకుంటారని ఆనేతలు తెలిపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడిందన్నారు. రాబోయే రోజుల్లో పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగరేస్తామని అన్నారు. పార్టీకి కట్టుబడి  తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు పనిచేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో కొత్త, పాత అనే వర్గాలు వస్తాయని కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని, కచ్చితంగా రాబోయే రోజుల్లో మేమంతా కలిసి పనిచేసి కాంగ్రెస్ జెండాను మరోసారి వెగరేస్తామని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ గెలుపే నా ధ్యేయం…: రాయల