Telugu News

ఖమ్మంలో గెలిచి చరిత్ర సృష్టించ బోతున్నాం: రాయల

** ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారుల పనితీరు బాలేదు

0

ఖమ్మంలో గెలిచి చరిత్ర సృష్టించ బోతున్నాం: రాయల
** ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారుల పనితీరు బాలేదు
** పోలీసులు వన్ సైడ్ గా వ్యవహరించారు
** మంత్రి, జడ్పీచైర్మన్, ఎమ్మెల్యే గంటల తరబడి పోలింగ్ కేంద్రాల్లో తిష్టవేసి ఓటర్లను బెదిరించారు
** ఫిర్యాదు చేద్దామంటే కలెక్టర్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు.
** అందుకే ఈసీకి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాం.
** తక్షణమే విచారణ చేపట్టండి.. సీసీ కెమరాలను పరిశీలించండి
** టీఆర్ఎస్ నేతలు తప్పు చేసినట్లు తేలితే ఎన్నికను రద్దు చేయండి
** విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, అభ్యర్థి రాయల నాగేశ్వరరావు ద్వజం
(ఖమ్మం ప్రతినిధి –విజయం న్యూస్)
ఖమ్మం స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి చరిత్ర సృష్టించబోతుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గప్రసాద్, కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనపై నమ్మకంతో ఏఐసీసీ, పీసీసీ, సీఎల్పీ సీటు ఇవ్వడం జరిగిందని, వారి నమ్మకానికి అనుగుణంగా కష్టపడి పనిచేశామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను గౌరవించి నిధులు ఇచ్చేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని భావించి, ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు వేశారని తెలిపారు.

వారందరికి పార్టీ తరుపునా, మావ్యక్తిగతంగా అందరికి ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 14న జరిగే కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని, చరిత్ర రాయబోతున్నామని తెలిపారు. గతంలో అనేక దఫాలుగా ఎన్నికలు జరిగాయి, యుద్దాలు, పోరాటాలు జరిగాయని, గెలుపు కోసం విస్రత్తంగా ప్రచారం చేసుకున్న రోజులున్నాయని, కానీ పోలింగ్ కు వచ్చే సరికి చాలా ప్రశాంతంగా పోలింగ్ జరిగేదని, అంత నిస్పక్షపాతంగా అధికారులు విధులు నిర్వహించేవారని అన్నారు. కానీ ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న అధికారులు ఎన్నికలకు వన్ సైడ్ గా పనిచేస్తున్నారని, టీఆర్ఎస్ నాయకులపై తల్లిప్రేమ చూపిస్తూ, కాంగ్రెస్ నాయకులపై చవితితల్లి ప్రేమను చూపిస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫోలింగ్ విషయంలో చాలా దారుణంగా అధికారులు వన్ సైడ్ గా వ్యవహరించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రిలీవర్ ఏజెంట్ ను కూడా లోపలకి రానివ్వకుండా రూల్స్ అంటూ పోలీసులు, అధికారులు హాడాహుడి చేశారని, కానీ టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజు గంటల కొద్ది పోలింగ్ బూత్ తిరుగుతూ కేంద్రంలోనే ప్రచారం చేస్తూ, ఓటర్లను బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు.

పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గంటల తరబడి కుర్చివేసుకుని పోలింగ్ కేంద్రంలో కుర్చోబెట్టారని, మూడు గంటల పాటు లింగాల కమల్ రాజుకు ఎందుకు పోలింగ్ బూత్ లో తిరుగుతున్నాడని ఖమ్మం నగర కమీషనర్ కు ఫిర్యాదు చేస్తే ఈజీగా తీసుకుంటున్నారని, ఇదే విషయాన్ని కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని పోన్ చేస్తే కనీసం పోన్ రిసీవ్ చేయలేదని తెలిపారు. లోపల ఉన్నవారిని బయటకు పంపించాలని మేము అడిగితే ఇష్టానుసారంగా అభ్యర్థిని అని చూడకుండా పోలీసులు బయటకు నెట్టేశారని, గట్టిగ అడిగిన నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారని అన్నారు. పోలీసులు, అధికారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేసినట్లు మీడియా వారికి కనిపించిందా..? అని ప్రశ్నించారు. పోలీసులు, అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు.

అధికారులు మా ఫిర్యాదును పరిగణంలోకి తీసుకుని విచారణ చేయాలని, తప్పు అని తెలితే వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలుస్తున్నామని తెలిపారు. అందుకు సహాకరించిన మీడియా మిత్రులందరికి కతజ్జతలు తెలిపారు. నగర కమిటీ అధ్యక్షుడు ఎం.డీ జావిద్ మాట్లాడుతూ ఖమ్మం నుంచి హైదరాబాద్ కు, హైదరాబాద్ నుంచి ఖమ్మంకు ఆర్టీసీ బస్సుల్లో ఓటర్లను తరలించారని, ఆ బస్సులకు రవాణా చార్జీలను ఎవరు చెల్లించకుండానే ఎలా ప్రభుత్వ బస్సులను వినియోగిస్తారని ప్రశ్నించారు. రవాణాశాఖమంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఈ విషయం తక్షణమే అధికారులు విచారణ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మొక్కా శేఖర్ గౌడ్, జిల్లా మహిళాకాంగ్రెస్ అధ్యక్షురాలు దొడ్డా సౌజన్య, కార్పోరేటర్ మహ్మద్ రఫీయాబేగం, జిల్లా నాయకులు మిక్కిలేని నరేంద్ర, పోటు లెనిన్, బుల్లెట్ బాబు తదితరులు పాల్గొన్నారు.

also read ;- యాసంగిలో 34.27 లక్షల ఎకరాలకు సాగునీరు..