Telugu News

ఎమ్మెల్యే వనమా రాజీనామా చేయాలి : సీఎల్పీ భట్టి విక్రమార్క..

ఆవేదన తో ప్రెస్ మీట్ పెడ్తున్నాం

0

ఎమ్మెల్యే వనమా రాజీనామా చేయాలి : సీఎల్పీ భట్టి విక్రమార్క..
ఆవేదన తో ప్రెస్ మీట్ పెడ్తున్నాం
రాష్ట్రంలో పోలీస్ శాఖ ఉందా? లేదా..?
నాలుగు రోజులు రాఘవను అరెస్టు చేయకపోవడం సిగ్గుచేటు
 పోలీసులు అధికార పార్టీ నేతలకు కొమ్ముకాస్తున్నరు
 విలేకర్ల సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
(హైదరాబాద్-విజయంన్యూస్);-
కొత్తగూడెం పాల్వంచ లో రాఘవ అరాచకాలకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న రామకృష్ణ కుటుంబం ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ రాఘవ తండ్రి, పాల్వంచ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వెంటనే రాజీనామా చేసి, తన కొడుకును పోలీసులకు అప్పగించాలి.
రాఘవ అరాచకాలకు తాళలేక రామకృష్ణ కుటుంబం పెట్రోల్ పోసుకొని సజీవ దహనానికి పాల్పడి నాలుగు రోజులు అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు.

తెలంగాణ పోలీస్ వ్యవస్థ భేషుగ్గా పనిచేస్తుందని ప్రకటిస్తున్న ప్రభుత్వానికి పరారీలో ఉన్న రాఘవను అరెస్టు చేయడానికి 4 రోజులు ఎందుకు పడుతుంది.
నాలుగు రోజులు అవుతుంది రాఘవులు అరెస్ట్ చేయకపోవడం వెనుక ప్రభుత్వమే అతని కాపాడుతున్నదన్న అనుమానాలు కలుగుతున్నాయి.
టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగూడెంలో రాఘవ అరాచకాలు పెరిగిపోయాయి. రాఘవ అరాచకాలకు పోలీసులు అడ్డుకట్ట వేసి ఉంటే రామకృష్ణ కుటుంబం బతికి ఉండేది.

పోలీసులు అధికారులు ఎమ్మెల్యే తనయుడు రాఘవకు తొత్తులుగా ఉండటం వలనే న్యాయం జరగదని భావించిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.

also read :-పాతపాల్వంచలో మరో విషాదం.. రామకృష్ణ చిన్న కూతురు మృతి
కొత్తగూడెం పాల్వంచలో రాఘవ అరాచకాలపై ఇప్పటికి ఏడు కేసులు ఉన్నాయి. వీటి పై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం చూపిన పక్షపాత ధోరణి వల్ల రామకృష్ణ కుటుంబం బలైంది
రామకృష్ణ సెల్ఫీ వీడియో చూసి రాష్ట్ర ప్రజలు చలించిపోయారు .
కొత్తగూడెంలో ఇలాంటి కేసులు 7 నమోదైనాయి. వారంతా వనమా రాఘవ పేరు రాశారు. అయినా పోలీస్ శాఖ చర్యలు తీసుకో లేదు.
రాష్ట్రంలో పోలీస్ శాఖ ఉందా? లేదా..?
ఘటన జరిగి నాలుగు రోజులు అవుతున్న రాఘవను ఎందుకు అరెస్టు చేయలేదు
రెవెన్యూ, పోలీస్ వ్యవస్థ మొత్తం ప్రజలకు సేవచేయడం మరిచాయి. తన పని తాను చేయడం మరిచిన పోలీస్ వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం పోయింది .
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు, టిఆర్ఎస్ ప్రభుత్వానికి సెకండ్ క్యాడర్ గా వ్యవహరిస్తూ రాష్ట్రంలో ప్రతిపక్షాలు పోరాటం చేయకుండా అడ్డుకుంటున్నారు.

రామకృష్ణ మూడో పాప చనిపోయే ముందు.. ఆ పాప ను కాపాడాలని ఘటనా స్థలానికి వెళ్లి సర్కార్ ను కోరాను. ఎయిర్ అంబులెన్సు పంపాలని సీఎస్ ను, కలెక్టర్ ను అడిగితె స్పందించలేదు.
ఘటన జరిగిన తర్వాత కూడా రాఘవ అనుచరుల అరాచకాలతో కొత్తగూడెం ప్రజలు భయం భయంతో బతుకుతున్నారు.
రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలపై
డిజిపి, హోం సెక్రటరీలను పిలిపించి సీఎం కేసీఆర్ సమీక్ష చేసుకోవాలి

also read :-తొలగించిన విగ్రహాలను వాటి స్థానంలో వెంటనే పునః ప్రతిష్టించాలి.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం సీఎం కేసీఆర్ అఖిలపక్ష సమావేశం పెట్టాలి
ఘటన జరిగి నాలుగు రోజులు అవుతున్నా ప్రభుత్వం స్పందించకుండా రాఘవను అరెస్టు చేయకుండా కేసు నుంచి తప్పించేందుకు చేస్తున్న కుట్రలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది.
24 గంటల్లోగా రాఘవను అరెస్టు చేయకుంటే
రాష్ట్ర బంద్ కు కూడా కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇస్తుంది.
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన రాఘవ ను అరెస్టు చేయకుండా పరోక్షంగా కాపాడేందుకు సహకరిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం పైన గవర్నర్కి ,మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం.
కొత్తగూడెం పాల్వంచ ఘటనపై ప్రభుత్వం స్పందించకుంటే…. తెలంగాణలో క్షీణిస్తున్న శాంతిభద్రతలను పరిరక్షించాలని కేంద్ర హోం శాఖ మంత్రిని కలుస్తాం. న్యాయపరంగా పోరాటాన్ని ఉధృతం చేస్తాం.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్య్రాల తో అన్ని వర్గాల ప్రజలు గౌరవంగా బతకాలని.
రాష్ట్రంలో టిఆర్ఎస్ అరాచక పాలన సాగిస్తూంటే చూస్తూ ఊరుకోం.
విలేకర్ల సమవేశంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మధుయాష్కిగౌడ్, సంభాని చంద్రశేఖర్, బలరాం నాయక్, పద్మారావు తదితరులు పాల్గొన్నారు.