Telugu News

అభివృద్ధిలో మాకు మేమే చాటి: మంత్రి పువ్వాడ

ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి రూ.1350 కోట్ల నిధులు మంజూరు

0

అభివృద్ధిలో మాకు మేమే చాటి: మంత్రి పువ్వాడ

== ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి రూ.1350 కోట్ల నిధులు మంజూరు

== అభివృద్ధి  పనుల శంకుస్థాపనకు మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి పర్యటన

== మంత్రి కేటీఆర్ పర్యటనను జయప్రదం చేయండి

== విలేకర్ల సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

 ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పథంలో దూసుకపోతుందని, అభివృద్ధి లో మాకు మేమే చాటి అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఖమ్మం మంత్రి క్యాంఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎనలేని అభివృద్ధి సాధించిందన్నారు. గత 60ఏళ్లలోఆనాటి పాలకులు చేసిందేమి లేదని, గడిచిన 10ఏళ్లలో ఎవరు చేయలేని విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలను అభివృద్ధి చేసి చూపించామన్నారు. ఇప్పటికే వేలాధి కోట్ల రూపాయలను మంజూరు చేయగా, ఆ పనులకు సీఎం కేసీఆర్, మంత్రులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారని అన్నారు. మరోసారి రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కె.తారాకరామరావు, రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  నాలుగు నియోజకవర్గాలలో ఖమ్మం, వైరా, భద్రాచలం, సత్తుపల్లి లో మంత్రులు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నుట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఖమ్మంలో నేడు ముగ్గురు మంత్రులు పర్యటన

హైదరాబాద్ నుంచి ఉదయం 8గంటలకు హెలికాఫ్టర్ లో నేరుగా గుబ్బగుర్తి కి మంత్రులు చేరుకుంటారని, గుబ్బగుర్తిలో ఆయిల్ ఫామ్ ప్యాక్టరీ ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం ఖమ్మంలో 1350కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని తెలిపారు. లకారంలో ఎన్ టిఆర్ పార్క్, అమృత్ పథకం కింద అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ కి శంకుస్థాపన చేస్తారని, త్రీ టౌన్ పరిధిలోని గోళ్లపాడు ఛానల్ మీద ఏర్పాటు చేసిన పది పార్క్ లు అన్నింటిని కలిపి ప్రారంభోత్సవం చేస్తారని తెలిపారు. లకారం చెరువు వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం

మున్నేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ను  తీగల బ్రిడ్జికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. విడిఓస్ కాలనీ లో వెజ్ అండ్ నాన్ వేజ్ మార్కెట్ ప్రారంభోత్సవం చేస్తారని, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ వద్ద  ఖమ్మం ప్రగతి నివేదిన సభ ఉంటుందని, ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఖమ్మం,కార్పొరేషన్ పరిధిలో చేసిన పట్టణ ప్రగతి డాక్యుమెంటరీ  ప్రదర్శనను తిలకిస్తారని తెలిపారు. అనంతరం భద్రాచలంకు హెలికాప్టర్ లో బయలుదేరి, గోదావరి కరకట్టకు 38కోట్లతో నిధులు మంజూరు కూనవరం రోడ్డు లో శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అంబేద్కర్ సెంటర్ లో సెంట్రల్ లైటింగ్ ప్రారంభించిన అంతనరం అక్కడ ఏర్పాటు చేసిన  మీడియా సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. మధ్యాహ్నం 2.30గంటలకు సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు.

ఇది కూడా చదవండి: నేడు ఖమ్మంకు ‘తారకరామారావు’

అనంతరం బహిరంగసభ ఉంటుందన్నారు. అక్కడ నుంచి సాయంత్రం 4.45గంటలకు హెలికాప్టర్ లో తిరిగి హైదరాబాద్ వెళ్తారని తెలిపారు. ప్రతి సంవత్సరం కేటిఆర్ వందల కోట్లు నిధులు తీసుకుని వచ్చారు,వస్తున్నారని తెలిపారు. అభివృద్ధి కి నిధులు ఇచ్చారు… అండదండలు ఇచ్చారని, అందుకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో అభివృద్ధి సాధ్యమైందా.! ఆలోచన చేయాలని ప్రజలను వేడుకున్నారు. అసెంబ్లీ వేదికగా ఖమ్మం అభివృద్ధి ని అభినందించారు… ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు వచ్చి అభివృద్ధి ని చూసి వెళ్లారని ఆరోపించారు.  కేసీఆర్, కేటీఆర్ ఖమ్మం అభివృద్ధి పై చాలా ప్రకటనలు చేశారు,ఇతర జిల్లాల ప్రజా ప్రతినిధులకు కూడా  తెలిపారు చూసి రండి అని.. అది ఖమ్మం జిల్లా చరిత్రను తిరగరాసిందన్నారు. అంతటి అభివద్ది చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాని ప్రజలు ఆశీర్వదించాలని, నేడు జరిగే మంత్రుల పర్యటకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు.