ప్రతి గింజను కొనుగోలు చేస్తాం
విలేకర్ల సమావేశంలో స్పష్టం చేసిన సీఎం కేసీఆర్
(హైదరాబాద్ –విజయంన్యూస్);-
తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ మంచి శుభవార్త చెప్పారు.. యాసంగిలో వరి పంట సాగు చేయోద్దని చెప్పిన సీఎం కేసీఆర్ ప్రస్తుతం రైతులు సాగు చేసిన వరి ధాన్యంను ప్రతి గింజను కొనుగోలు చేస్తామని హామినిచ్చారు. మంగళవారం కేబినెట్ సమావేశం నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు.
also read :-ప్రాణహిత పుష్కరఘాట్ ను పరిశీలించిన కలెక్టర్
యాసంగి పంట కొనుగోలు చేసే విషయంలో కేంద్రప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తోందని, ధర్నాలు చేసిన, పోరుబాట పట్టిన, ఢిల్లీలో కొట్లాడిన కేంద్రప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతులంటే కేంద్రానికి చిన్నచూపని అన్నారు. అందుకే తెలంగాణ రైతులను కాపాడుకోవాలనే ఆలోచనతో యాసంగిలో సాగు చేసిన వరిధాన్యంను ప్రతి గింజను కొనాలని కేబినేట్ తీర్మాణం చేసిందని ప్రకటించారు. ఎవరూ తక్కువ ధరలకే ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన అవసరం లేదని, రెండు రోజుల్లో ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు. రూ.1960 చొప్పున మద్దతు ధరతో ప్రతి గింజను కొనుగోలు చేస్తుందన్నారు. దిక్కుమాలని కేంద్రప్రభుత్వం హ్యాండ్ ఇచ్చినంత మాత్రానా మేము ఊరుకోమని, తెలంగాణ రైతులను టీఆర్ఎస్ ప్రభుత్వం వదులుకోలేదని అన్నారు.