Telugu News

పొంగులేటి పై చేస్తున్న విషప్రచారాన్ని ఖండిస్తున్నాం: పిడమర్తి రవి

0

పొంగులేటి పై చేస్తున్న విషప్రచారాన్ని ఖండిస్తున్నాం: పిడమర్తి రవి
* *ప్రజాదరణను ఓర్వలేకనే ఈ పసలేని ఆరోపణలు
* *ప్రజాక్షేత్రంలో వచ్చి మాట్లాడాలని సూచన
*సీనియర్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా.పిడమర్తి.రవి. వక్కలగడ్డ.చంద్రశేఖర్*

(రిపోర్టర్ -పెండ్ర అంజయ్య)

====================
తెలంగాణ ప్రజాబందువు, అందరివాడు పొంగులేటి శ్రీనాన్న పై ఇటీవల కొందరు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారు. శ్రీనన్న అంటేనే కుల,మతాల రహితంగా అందరినీ ఆదరించి,కుటుంబంలో ఒక సభ్యునిగా గౌరవించే వ్యక్తి అని అన్నారు.ఆయనకు వస్తున్న ప్రజాదరణను ఓర్వలేని కొందరు కోవర్టులు,తల్లిపాలు తాగి, రొమ్ముగుద్దె చిల్లర నాయకులు, ఫేక్ పేర్లతో, కొన్ని కులాలపేర్లు పెట్టి, శ్రీనన్నను అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారు.

ఇది కూడా చదవండి:- పాలేరు ప్రజల రుణం తీర్చుకుంటా: మంత్రి పొంగులేటి 

ఆయన ఎటువంటివారు,ఆయన వ్యక్తిత్వం తెలిసినవారందరికీ తెలుసునని అన్నారు.అన్నా అంటే నేను ఉన్నాను అని పలికే మహోన్నతమైన,ఆపదలో ఆపద్భాందవుడుగా ఉన్న వ్యక్తిపై నీచపు ఆరోపణలు మానుకోవాలని తెలిపినారు. శ్రీనన్న పై జరుగుతున్న విషప్రచారాన్ని ఖండిస్తూ, దమ్ము, ధైర్యం ఉంటే, పబ్లిక్ గా వచ్చి వారు చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని,నోరును అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.వారిపై లీగల్ గా చర్యలు తీసుకొనే విధంగా వచ్చే వరకు తెచ్చుకోవద్దని,ఇటువంటి ఆరోపణలు పుణారావృతం కాకుండా సూచుకోవాలని వారిని కోరారు.