Telugu News

కరోనా పరిస్థితుల్లో రుణమాఫీ అమలు చేయలేకపోయాం: మంత్రి నిరంజన్ రెడ్డి

కరెంట్ 24గంటలిచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందా..?

0

కరోనా పరిస్థితుల్లో రుణమాఫీ అమలు చేయలేకపోయాం: మంత్రి నిరంజన్ రెడ్డి

== కరెంట్ 24గంటలిచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందా..?

== పొంగులేటి వ్యాఖ్యలు సరైంది కాదు

==  మధిర నియోజకవర్గంలో మాదాపురంలో రైతువేదికనుప్రారంభించిన మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

కరోనా పరిస్థితుల్లో రుణ మాఫీ అమలు చేయలేకపోయామని, కచ్చితంగా  వడ్డీతో సహా రుణ మాఫీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో ఉన్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ తలపెట్టిన ఏ కార్యక్రమం ఆపే ప్రసక్తే లేదని అన్నారు. ఖమ్మం జిల్లా, మధిర నియోజకవర్గంలో మాదాపురంలో రైతువేదికను మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ

ఇది కూడా చదవండి: 24గంటల కరెంట్ పై  చర్చకు సిద్ధమా:తాతా మదు

నిన్న మొన్న మా సోదరుడు పొంగులేటి ఏదేదో మాట్లాడుతున్నరంట…. కరెంటు ఎక్కడ అని ప్రశ్నిస్తూ ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉందని అన్నారు.  ముందు తెలంగాణ లో అమలౌతున్న పధకాల గురించి పొంగులేటికి తెలుసా అని ప్రశ్నించారు. కరెంట్ 24గంటలకు ఇస్తున్న రాష్ట్ర మేదో చెబుతారా..? అని ప్రశ్నించారు.  రానున్న రోజుల్లో ఇంతకంటే ఎక్కువ తెలంగాణ పధకాల ఔన్నత్యాన్ని చెప్పాల్సి వస్తుంది.. గుర్తు పెట్టుకోవాలని సూచించారు.  ఇంతకంటే ఘనంగా తెలంగాణ లో ఎవరు మంచిగా చేస్తారో, దమ్మున్న వారూ ముందుంకు రావాలని సవాల్ చేశారు.  ప్రజాక్షేత్రం లో ప్రజల మనస్సు గెలవాలి, మన్నన పొందాలే తప్ప మాటలు చెబితే కుదరదన్నారు.. కేవలం ప్రభుత్వాన్ని, ప్రజల పాలకులను తిడితే అధికారం రాదని, అది గ్రహించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయంలో ఆధునిక పద్దతులు పాటించాలని, భూసారం పెంచుకుంటే అధిక దిగుబడులు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజ్ తదితరులు హాజరైయ్యారు.

ఇది కూడా చదవండి: పార్కులకు గుమ్మం ‘ఖమ్మం’: మంత్రి పువ్వాడ