వలస కార్మికులకు అండగా ఉంటాం: ఎండీ.జావిద్
(ఖమ్మం-విజయం న్యూస్);-
ఖమ్మం నగరంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వలస కార్మికులు ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావీద్ ని ఈదుల్ ఫిత్ర్హ్ పురస్కరించుకొని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని ఉద్దేశించి మహమ్మద్ జావీద్ మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులను పట్టించుకోలేదని, చాలామంది వలస కార్మికుల మృతికి కారణమయ్యారని గుర్తు చేశారు, రాబోవు కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వలస కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలియజేశారు,
also read :-తల్లిదండ్రులు పెళ్లి చేయకుండా ఆలస్యం చేస్తున్నారని పోలీసులకు మరుగుజ్జు యువకుడి ఫిర్యాదు
ఖమ్మం నగరంలో పనిచేసే కార్మికులకు ఏ సమయంలో ఎటువంటి అవసరం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు, అనంతరం వారితో అల్పాహారం స్వీకరించారు,ఈ సమయంలో కరోనా మహమ్మారి ఉన్న సమయంలో లాక్ డౌన్ లో ఖమ్మంలో ఎంతోమంది వలసకార్మికులకు నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావిద్ బియ్యం, నిత్యవసర సరుకులు, కూరగాయలు, ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారని గుర్తు చేసుకున్నారు, ఈ కార్యక్రమంలో వారి వెంట , నగర కాంగ్రెస్ నాయకులు ముజాహిద్, ఏలూరు రవి తదితరులు పాల్గొన్నారు.