Telugu News

నిరుద్యోగ యువతకు నెలకు రూ.4000 నిరుద్యోగ భృతి ఇస్తాం: సంభాని

హథ్ సే హత్ జోడో యాత్రలో మాజీ మంత్రి సంభాని

0

నిరుద్యోగ యువతకు నెలకు రూ.4000 నిరుద్యోగ భృతి ఇస్తాం

== యువతను హక్కున చేర్చుకుంటాం

== హథ్ సే హత్ జోడో యాత్రలో మాజీ మంత్రి సంభాని

(సత్తుపల్లి-విజయంన్యూస్)

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే యువతను హక్కున చేర్చకుంటామని, నిరుద్యోగులకు ప్రతి నెల 4000 కచ్చితంగా అందిస్తామని మాజీమంత్రి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్ హామినిచ్చారు.

సత్తుపల్లి నియోజకవర్గంలో 46వ రోజు హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా ఈరోజు సత్తుపల్లి మండలంలోని తుంబూరు, తాళ్ళమడ గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టగా మాజీమంత్రి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ఇంటి ఇంటికి తిరుగుతూ..

ఇది కూడా చదవండి: అధర్మంపై సత్యమే గెలిచింది: సంభాని

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ది సాధ్యమని తెలుపుతూ రాహుల్ గాంధీ సందేశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై రూపొందించిన చార్జిషీట్‌ని ప్రజలకు అందిస్తూ ఈ క్రింది విధంగా మాట్లాడారు. యువత భవిత, అమరుల ఆశయ సాధనే కాంగ్రెస్ విధానం. తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులకు అండగా ఉండేందుకే యూత్ డిక్లరేషన్ రూపొందించామని తెలుపుతూ…..

👉మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ

👉మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ

👉ప్రతీ ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి, సెప్టెంబర్ 17 లోపు నియామకాల పూర్తి.

👉విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు యూత్ కమిషన్‌ను ఏర్పాటు చేసి,

రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయ కల్పన.

👉ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేట్ కంపెనీల్లో తెలంగాణ యువతకు 75% రిజర్వేషన్ కల్పన.

👉నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతీ నెలా రూ. 4000 నిరుద్యోగ భృతి చెల్లింపు.

👉ప్రత్యేక చట్టంతో టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో పునరుద్ధరణ.

👉18 ఏళ్లు పైబడిన బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు

👉ప్రతి జిల్లాలో అన్ని వసతులతో కూడిన ప్రపంచస్థాయి క్రీడా విశ్వవిద్యాలయాలు ఏర్పాటు.

ఇది కూడా చదవండి: దళితులను ఇంకెంత కాలం మోసం చేస్తారు ?: సంభాని

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివ వేణు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు బైరెడ్డి మనోహర్ రెడ్డి, సత్తుపల్లి పట్టణ అధ్యక్షులు కొర్రపాటి సాల్మన్ రాజు, స్టేట్ Sc Dpt కన్వీనర్ కొండూరు కిరణ్,  వేల్పుల ప్రసాద్, కృష్ణ, బాబూరావు, పుల్లయ్య, చిన్నబోయిన వెంకటేశ్వరరావు, తోట రాజేష్, హలావాత్ వెంకటేశ్వర్లు, శివశంకర్, దుబ్బాక చందు, పిన్నబోయిన వెంకటేశ్వరరావు, శేషగిరి, రామకృష్ణ, రవీంద్ర, నాగా రాము, కంటే శ్రీను, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.