Telugu News

మీ వెన్నంటి ఉంటాం..: పొంగులేటి 

కొత్తగూడెం లో ఆత్మీయ సమావేశం రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

0
మీ వెన్నంటి ఉంటాం..: పొంగులేటి 
-కొత్తగూడెం లో ఆత్మీయ సమావేశం రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
– బీఆర్ఎస్ నుంచి పలువురు కాంగ్రెస్ లో చేరిక
(కొత్తగూడెం-విజయం న్యూస్):
ప్రజలందరికీ వెన్నంటి ఉంటామని, అండగా నిలుస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం కొత్తగూడెంలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి సమక్షంలో వివిధ పార్టీల నుంచి పలువురు కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ..
మీకు ఏ కష్టం వచ్చినా.. నేనుంటా అని అన్నారు. బీజేపీ, దాని బీ పార్టీ అయిన బీఆర్ఎస్ లు రెండూ కలిసి డ్రామా ఆడుతున్నాయని తెలిపారు. అందులో భాగంగానే నామాను గెలిపిస్తే.. కేంద్రంలో మంత్రి పదవి లభిస్తుంది అని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ అక్రమంగా సంపాదించిన డబ్బులను పక్క రాష్ట్రాల్లో  జాతీయ పార్టీ పేరుతో ముట్టజెప్పాడని తెలిపారు.బీజేపీ తో లోపాయకారి ఒప్పందం ఏంటో ప్రజలకు చెప్పాలనీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వస్తే నీళ్లు, కరెంట్ ఉండవు అంటున్న కేసీఆర్ ..మీ సర్కార్ ఉన్నప్పుడు.. జలాలను ఎందుకు వృధా చేశావని, పక్క రాష్ట్రానికి ఎందుకు పంపావని ప్రశ్నించారు. పాత, కొత్త నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి కొత్తగూడెం నియోజకవర్గంలో భారీ మెజారిటీ సాధించేలా చూడాలని కోరారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం తమ ప్రాణాలను అర్పించార నీ, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలంటే  హస్తం గుర్తుకు  ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
*బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో  చేరిన వారిలో..:*
జలగం వర్గం ఊకంటి గోపాలరావు, వీరబాబు తన అనుచరులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.