Telugu News

కాంగ్రెస్ ను వెంటాడి.. వేటాడుతాం: నామా

హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం అయ్యింది

0

కాంగ్రెస్ ను వెంటాడి.. వేటాడుతాం: నామా

== హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం అయ్యింది

== హామీలు అమలైయ్యే వరకు కాంగ్రెస్ ను వదలం

==  విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు,

== హాజరైనా పార్టీ జిల్లా అధ్యక్షుడు , ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర

(ఖమ్మం ప్రతినిధి – విజయం న్యూస్)

ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడి, వేటాడతామని బీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నామ మాట్లాడారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని, పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉండి, మద్దతుగా నిలుస్తామని చెప్పారు.

ఇది కూడా చదవండి:- కార్యకర్తలకు అండగా ఉంటా : నామ నాగేశ్వరరావు

ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని, ప్రజలు కాంగ్రెస్ మోసాన్ని గ్రహించారని, ఈ ఎన్నికల్లో పొరపాటును సరిదిద్దుకుని, తనను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్ బస్సు యాత్రను జయప్రదం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హత్య, దాడుల సంస్కృతిని పార్టీ జిల్లా అధ్యక్షుడు , ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖండించారు. నామ నాగేశ్వరరావు గెలవబోతున్నారన్న సంగతి తెలిసి దైవర్ట్ రాజకీయాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఎవరెన్ని చేసినా నామ గెలువును అడ్డుకోలేరని చెప్పారు. ఇంకా విలేకరుల సమావేశంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,పార్టీ ఖమ్మం నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, నాయకులు వీరన్న, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:- పార్లమెంట్ లో ప్రజా గొంతుకనై ప్రశ్నిస్తా : నామ