జర్నలిస్టులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలుచేస్తాం:మంత్రి పువ్వాడ
టీయూడబ్ల్యూజే (టిజేఎఫ్) అభినందన కార్యక్రమంలో స్పందించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
జర్నలిస్టులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలుచేస్తాం
★ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత నా భుజస్కంధాలపై ఉంది
★ టీయూడబ్ల్యూజే (టిజేఎఫ్) అభినందన కార్యక్రమంలో స్పందించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఖమ్మం ప్రతినిధి, జనవరి 24(విజయంన్యూస్):
ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంలో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ భారీ బహిరంగసభలో, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లక్షలాదిమంది ప్రజల సమక్షంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు నెల రోజుల్లో కేటాయిస్తామన్న భరోసాను నాతో పాటు ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీష్ రావుకు అప్పగించిన విషయాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తానని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టమైన హామీ ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తన భుజస్కంధాలపైనే ఉందన్నారు.
ఇది కూడా చదవండి: పేదలకు నాణ్యమైన వైద్యం అందించమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి
జనవరి 18న ఖమ్మంలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగసభలో సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు కేటాయించాలని ఇచ్చిన హామీని ఖమ్మం జర్నలిస్టుల పక్షాన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన కృషికి ఫలితంగా సోమవారం టీయూడబ్ల్యూజె(టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, ప్రధానకార్యదర్శి చిర్రా రవిల ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఖమ్మం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాత్రి జర్నలిస్టులు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతఙ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులను ఉద్దేశించి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఇచ్చిన అస్యూరెన్స్ ను తూచా తప్పకుండా పాటించేందుకు ఆర్ధిక శాఖామంత్రి హరీష్ రావు సహకారంతో ఇండ్ల స్థలాల కేటాయింపు పూర్తిచేస్తామన్నారు. గతంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) బహిరంగసభలో, ప్రెస్ అకాడెమీ ఛైర్మెన్ అల్లం నారాయణ సమక్షంలోనే ఇండ్ల స్థలాల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఇచ్చిన హామీని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపులో ప్రభుత్వ స్థలం చాలకపోతే ప్రైవేట్ స్థలం కొనుగోలు చేసైనా ఇండ్ల స్థలాల ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇంతహామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ కు మనం అందరం కృతజ్ఞతలు తెలపాలని మంత్రి సూచించారు. ఇప్పటికే జర్నలిస్టులకు అనువైన ప్రభుత్వ స్థలాన్ని చూడాలని ఉమ్మడి జిల్లా కలెక్టర్ లకు సూచించినట్లు మంత్రి తెలిపారు. ఇండ్ల స్థలాల కేటాయింపులో న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తలతో ప్రణాలికను తయారు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఇది కూడా చదవండి: మానవత్వం ఇమిడి ఉన్న కార్యక్రమం ‘కంటి వెలుగు’: మంత్రి
అదేవిధంగా ప్రెస్ క్లబ్ స్థల కేటాయింపుతో పాటుగా నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఖమ్మం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చిన తర్వాత మిగతా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు మార్గదర్శకాలు చేసి నియోజకవర్గాల వారిగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషిచేస్తానని తెలిపారు. అనంతరం టీయూడబ్ల్యూజె(టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ… రెండు దశాబ్దాలుగా జర్నలిస్టులు ఎదురు చూస్తున్న ఇండ్ల స్థలాల కోరిక.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహకారంతో నెరవేరుతున్నందుకు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు వి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి శెట్టి రజినీకాంత్, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, కోశాధికారి కొరకొప్పుల రాంబాబు, నగర అధ్యక్షులు బాలబత్తుల రాఘవ, కార్యదర్శి అమరవరపు కోటేశ్వరావు, టెంజూ నగర అధ్యక్షకార్యదర్శులు యలమందల జగదీష్, కరీష అశోక్ నాయకులు రాజేంద్రప్రసాద్, టి ఎస్ చక్రవర్తి, ఎస్కె జానీపాషా, యం.కోటేశ్వరరావు, బిక్కి గోపి, బోయిన కృష్ణ, పిన్ని సత్యనారాయణ, మోహన్, ఆర్ కె, జక్కుల వెంకటరమణ, బండి కుమార్, జి కుమార్, వెంపటి నాయుడు, యాదగిరి, వెంకటేశ్వర్లు, పానకాలరావు తదితరులు పాల్గొన్నారు.జర్నలిస్టులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలుచేస్తాం