Telugu News

ప్రభుత్వ పాఠశాలలో కార్పోరేట్ విద్యనందిస్తాం: మంత్రి

పల్లె దవఖానాలతో ప్రజలకు మెరుగైన వైద్యం

0

ప్రభుత్వ పాఠశాలలో కార్పోరేట్ విద్యనందిస్తాం: మంత్రి

== మనఊరు-మనబడి పథకం వల్ల పాఠశాలలు అభివద్ది చెందుతున్నాయి

== పల్లె దవఖానాలతో ప్రజలకు మెరుగైన వైద్యం

== ప్రొద్దుటూరులో పల్లెదవఖానాను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

చింతకాని/ఖమ్మం, మార్చి20(విజయంన్యూస్)
మధిర నియోజకవర్గం చింతకాని మండలం ప్రొద్దుటురు గ్రామంలో రూ.16 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన పల్లె దవాఖనాను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌తో కలిసి సోమవారం సాయంత్రం ప్రారంభించారు.   ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యాధునిక వైద్య పరికరాలను, అన్ని వైద్య సేవలకు సంబంధించిన వైద్యులను  అందుబాటులోకి తెచ్చిందన్నారు.  నిరంతరం వైద్య సేవలందించడం జరుగుతుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

ఇది కూడా చదవండి: ఖమ్మం మార్కెట్ లో మిర్చికి రికార్డ్ ధర
అనంతరం ‘‘మన ఊరు-మన బడి’’ కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో రూ.13 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులు త్రాగునీరు, ప్రహరీ గోడ, టాయిలెట్స్‌, విద్యుత్‌ పనులు, మేజర్‌  మైనర్‌ తదితర అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు.  ఈ సందర్భంగా  పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను  ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మౌళిక వసతుల కల్పనతో పాటు విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడం జరిగిదన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా 26,065 ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, నమోదు, హజరుతో పాటు వారు తమ పాఠశాల విద్యను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు వసతులు కల్పిస్తున్నామన్నారు.  ప్రతి పేదవారు ఉన్నత విద్యను ఉచింతగా అభ్యసించి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి పేర్కొన్నారు.  దశల వారీగా డిజిటల్‌ విద్యా విదానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యాసన సమార్ద్యాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తుందని, ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకే తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థపై అత్యధికంగా నిధులు వెచ్చించిందన్నారు.

ఇది కూడా చదవండి : రవాణా శాఖకు పెరిగిన ఆదాయం..

దీనిలో భాగంగా ‘‘మన ఊరు` మనబడి/మన బస్తీ`మనబడి పథకాన్ని తీసుకొచ్చి అమలు చేస్తుందన్నారు.  జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ మాట్లాడుతూ ప్రొద్దుటూరు గ్రామంలో వైద్యం, విద్యకు సంబంధించిన రెండు కార్యక్రమాలు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు.  ప్రొద్దుటూరు గ్రామం పల్లె దవాఖనాలో వైద్య పరకరాలు ఏర్పాటు చేసి మంచి వైద్యం  అందించడం జరుగుతుందన్నారు.  ఎలాంటి వ్యాధులకైనా గ్రామంలోనే వైద్య చికిత్సనందించేందుకు ఎం.బి.బి.ఎస్‌ డాక్టర్ను నియమించడం జరిగిందన్నారు.  ప్రజలు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగపర్చుకొని ఆరోగ్యంపట్ల శ్రద్ధ కనబరాల్చని తెలిపారు.
అదేవిధంగా మన ఊరు`మన బడి కార్యక్రమంలో భాగంగా మౌళిక వసతులు కల్పించడం జరిగిందన్నారు.  పిల్లలకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించినప్పుడు చదువుపై శ్రద్ధ పెరుగుతుందని మంచి సీటింగ్‌ సౌకర్యం కల్పించినప్పుడు రోజు స్కూలుకు రావాలనే ఆలోచన వస్తుందని విద్యార్థుల్లో పోటీ తత్వం పెరుగుతుందనిన్నారు.  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో విద్యాభోదనను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు.   తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతిరోజు పాఠశాలకు పంపించాలన్నారు.
అంతకు ముందు  మధిర నియోజకవర్గం చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో నూతనంగా నిర్మించిన 1000 టన్నుల సామర్థ్యం గల ప్రాథమిక సహకార పరపతి సంఘం  గోడౌన్‌ను జెడ్పి చైర్మన్‌ లింగాల కమల్‌ రాజ్‌, డిసిసిబి చైర్మన్‌ కూరాకుల నాగభూషణంతో కలిసి మంత్రి ప్రారంభించారు

ఇది కూడా చదవండి: శ్రీరామ నవమి ఏర్పాట్లపై మంత్రి పువ్వాడ సమీక్ష..

కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమలరాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, డి.సి.సి.బి చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, డి.సి.ఎం.ఎస్‌ చైర్మన్‌ రాయల శేషగిరిరావు, జడ్పీటి.సి కిషోర్‌, ఎం.పి.పి పూర్ణయ్య, జిల్లా విద్యా శాఖ అధికారి సోమశేఖర శర్మ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా॥మాలతి, జిల్లా సహకార శాఖ అధికారి విజయకుమారి, తహశీల్దారు మంగిలాల్‌, ఎం.పి.డి.ఓ శ్రీనివాసరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.