Telugu News

ఆటో కార్మికులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే రాందాస్

ఐఎన్ టీయూసీ ఆత్మీయ సమ్మేళనంలో రఘురాం రెడ్డి

0

ఆటో కార్మికులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే రాందాస్*

== ఐఎన్ టీయూసీ ఆత్మీయ సమ్మేళనంలో రఘురాం రెడ్డి

(ఖమ్మం-విజయం న్యూస్):

ఆటో కార్మికులందరికీ ప్రభుత్వం తరఫున అండగా నిలుస్తామని కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. ఆదివారం ఎస్ఆర్ కన్వెన్షన్ లో సంఘం ఆత్మీయ సమ్మేళనానికి హాజరై ప్రసంగించారు. రాయితీలు అందేలా చూస్తామని, సంక్షేమ పథకాలు వర్తింప చేస్తామని తెలిపారు. అందరూ తమ గ్రామాల్లో కాంగ్రెస్ తరఫున విస్తృత ప్రచారం చేయాలని, భారీ మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని కోరారు. ఎన్నికలు ముగిశాక.. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్ళు మంజూరు చేయిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నగర అధ్యక్షులు మహమ్మద్ జావేద్, సీనియర్ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, మాజీ కార్పొరేటర్ దీపక్ చౌదరి, ఐఎన్ టీయుసీ జిల్లా అధ్యక్షులు కొత్తా సీతారాములు, నగర అధ్యక్షులు నరాల నరేష్, వివిధ అడ్డాల నుంచి ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.