Telugu News

కార్మికులకు అండగా ఉంటాం: రఘురాంరెడ్డి*

ఖమ్మం లో మేడే కార్యక్రమాల్లో రఘురాం రెడ్డి

0

*కార్మికులకు అండగా ఉంటాం: రఘురాంరెడ్డి*

–  ఖమ్మం లో మేడే కార్యక్రమాల్లో
రఘురాం రెడ్డి

(ఖమ్మం-విజయం న్యూస్)

బతుకు దెరువు, కుటుంబ పోషణ కోసం చెమటోడ్చి శ్రమిస్తున్న కార్మికులoదరి కీ అండగా ఉంటామని కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘు రాం రెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం లో సీపీఐ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ, నగరంలోని గాంధీ చౌక్ లో ఐఎన్టీయాసీ జెండాల ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘురాo రెడ్డి మాట్లాడుతూ..రక్షణ చట్టాలు కచ్చితంగా అమలయ్యేలా, పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, సీనియర్ నాయకులు కొత్తా సీతారాములు, మద్దినేని స్వర్ణ కుమారి, ముదిరెడ్డీ నిరంజన్ రెడ్డి, ముస్తఫా, దీపక్ చౌదరి, కొప్పుల చంద్రశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు.