Telugu News

మున్నేరు వరదబాధితులకు అండగా ఉంటాం: మంత్రి కేటీఆర్

రూ.1000 కోట్లతో ఇరువైపుల కాంక్రీట్ గోడ నిర్మాణం

0

మున్నేరు వరదబాధితులకు అండగా ఉంటాం: మంత్రి కేటీఆర్
== మున్నేరు పై కాంక్రీట్ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేటీఆర్
== రూ.1000 కోట్లతో ఇరువైపుల కాంక్రీట్ గోడ నిర్మాణం
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఖమ్మం నగరంలోని మున్నేరు ముంపు బాధితులకు తెలంగాణ ప్రభుత్వం కచ్చితంగా అండగా ఉంటుందని, ముంపు బాధితలకు శాశ్వత పరిష్కారం కోసమే కాంక్రీట్ గోడను నిర్మాణం చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలోని మున్నేరుకు ఇరువైపు కాంక్రీట్ కరకట్ట నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.1000 కోట్లను విడుదల చేయగా, ఆ నిర్మాణ పనులకు శనివారం రాష్ట్ర మంత్రులు కే.టి.రామారావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఖమ్మం మున్నేరు సమీపంలోని వైకుంఠధామం వద్ద ఏర్పాటు చేసిన ఫైలాన్ ను మంత్రి కేటీఆర్ అవిష్కరించారు.

ఇది కూడా చదవండి: వారంటీ లేని కాంగ్రెస్ ను తరమికొట్టాలే: కేటీఆర్

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రతి ఏడాది వరదలు వచ్చినప్పుడల్లా మున్నేరు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారందర్ని కాపాడుకోవడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి ఏఢాది బిక్కుబిక్కుమంటూ జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ మున్నేరు బాధితులకు అండగా ఉండాలని నిర్ణయించారని తెలిపారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరిక మేరకు మున్నేరు నదికి శాశ్వత పరిష్కారం కావాలనే ఆలోచనతో పొల్లేపల్లి నుంచి ప్రకాష్ నగర్ వరకు మున్నేరుకు ఇరువైపుల కాంక్రీట్ గోడను నిర్మాణానికి అంగీకరించారని, అందుకు గాను రూ.1000 కోట్లను సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేస్తూ కేబినెట్ లో కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. ఆ గోడ నిర్మాణం వల్ల మున్నేరు ప్రజలందరికి శాశ్వత పరిష్కారం దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి,ఎంపీలు నామా నాగేశ్వరరావు,వద్ధిరాజు రవిచంద్ర,పార్థసారధి రెడ్డి,ఎమ్మెల్సీ తాత మధుసూదన్,మేయర్ పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: మాకు రాముడైన, కృష్ణుడైన ఎన్టీఆర్ : కేటీఆర్