Telugu News

ఖమ్మంలో పదికి పది సీట్లు గెలుస్తాం: మంత్రి హరీష్

ఖమ్మం ప్రజలందరు కేసీఆర్ పై కరుణ చూపాలి

0

ఖమ్మంలో పదికి పది సీట్లు గెలుస్తాం: మంత్రి హరీష్

== ఖమ్మం ప్రజలందరు కేసీఆర్ పై కరుణ చూపాలి

== విలేకర్ల సమావేశంలో మంత్రి తన్నీరు హరీష్ రావు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

రాబోయే రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు కచ్చితంగా గెలుస్తామని, ప్రజలందరు సీఎం కేసీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించేందుకు సిద్దంగా ఉన్నారని రాష్ట్ర వైద్య,ఆరోగ్య, అర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జోస్యం చెప్పారు. ఖమ్మం నగరంలో పర్యటించిన ఆయన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సీఎం కేసీఆర్ ఏది కావాలంటే అది అందిస్తున్నారని, భక్తరామదాసు లాంటి ప్రాజెక్టు, క్రిష్ణ,గోదావరిలను కలిపే సీతారామప్రాజెక్టులను మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు. సీఎం కి ఖమ్మం పై ప్రత్యేక ప్రేమ. నాడు ఉద్యమ సమయంలో ప్రజలు గుండెకు హత్తుకున్నారు. అందుకే ఖమ్మం కరువు తొలగించాలని సీఎం కోరిక అని అన్నారు. ఖమ్మం జిల్లా అభివద్ది విషయంలో కూడా ఏం కావాలని మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడిగిన వెంటనే మంజూరు చేస్తున్నారని, అంతటి ప్రేమ ఖమ్మం జిల్లా ప్రజలపై సీఎం కేసీఆర్ కు ఉందన్నారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ఖేల్ ఖతం దుకాణ్ బంద్: మంత్రి హరీష్

ఖమ్మం ప్రజలు కూడా అలాంటి ప్రేమను చూపించాలని, 10కి పది స్థానాలను రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని, తద్వారా ఖమ్మం జిల్లా మరింత అభివద్ది చెందుతుందన్నారు. సీతారామ ప్రాజెక్టు పనులు చివరి దశలో ఉన్నాయని, సీతారామ పూర్తి అయితే కరువు అనే పదం ఖమ్మం డిక్షనరీలో ఉండబోదని స్పష్టం చేశారు. వచ్చే వానాకాలం నాటికి కృష్ణా లో నీళ్ళు ఉన్న లేకున్నా గోదావరి జలాలు వస్తాయని, రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నారు. ఈసారి క్రిష్ణా ప్రాజెక్టులలో నీటి సౌలభ్యం లేదని, తద్వారా నాగార్జున సాగర్ ఆయకట్టులో పంటలు సాగు చేయలేకపోయారని, బోర్ల కిందా రైతులు అరకొరగా పంటలను సాగు చేశారే తప్ప పూర్తి స్థాయిలో పంటలను సాగు చేయలేకపోయారని అన్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతం ఏపీలో క్రాప్ హాలిడే ప్రకటించారని తెలిపారు. అదే సీతారామప్రాజెక్టును పూర్తి చేసుకుంటే పాలేరు జలాశయం ద్వారా ఉమ్మడి జిల్లాకు సాగునీటిని అందించుకోవచ్చన్నారు.  ఈ కార్యక్రమంలో   ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర రెడ్డి, తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మొచ్చా నాగేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు, బానోతు హరిప్రియనాయక్,  మదన్ లాల్, బాలసాని లక్ష్మినారాయణ, మేయర్ పూనకొల్లు నీరజ,  జెడ్పి చైర్మన్ లింగాల కమలరాజ్, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. మాలతి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రత్న కుమారి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: అభివృద్ధి లో తెలంగాణ నెం 1: మంత్రి హరీష్