Telugu News

వారం రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు సంబరాలు : మంత్రి కేటీఆర్

== రైతు ఖాతాల్లోకి 50 వేల కోట్ల రూపాయలు చేరనున్న సందర్భంగా ఈ సంబరాలు

0

వారం రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు సంబరాలు : మంత్రి కేటీఆర్
== రైతు ఖాతాల్లోకి 50 వేల కోట్ల రూపాయలు చేరనున్న సందర్భంగా ఈ సంబరాలు
== జనవరి 3 నుంచి 10 తేదీ వరకు రైతుబంధు సంబరాలు
== ప్రభుత్వం ప్రకటించిన కోవిడ్ నిబంధనలు, పరిమితులకు అనుగుణంగా చేయాలి
== టిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు టెలికాన్ఫరెన్స్
(హైదరాబాద్ –విజయంన్యూస్):-

వారం రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా రైతు బంధు సంబరాలు చేయాలని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖమంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కె.తారకరామారావు రాష్ట్ర టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర రైతుల ఖాతాల్లోకి రూ.50 వేల కోట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం అందించనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్, రైతుబంధు అధ్యక్షులు, డిసియంయస్ చైర్మన్ ల తో జరిగిన ఈ టెలీ కాన్ఫరెన్స్ లో మంత్రి కే. తారకరామారావు రైతుబంధు సంబరాల పై దిశానిర్దేశం చేశారు. మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ కి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్-

70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఏనాడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గానీ, ప్రధానమంత్రి కాని చరిత్రలో ఎన్నడూ ఆలోచించని స్థాయిలో.. తెలంగాణ రైతుల గురించి కేసీఆర్ గారు ఆలోచించి తీసుకున్న గొప్ప కార్యక్రమం రైతుబంధు.
== ఈ కార్యక్రమం ప్రారంభమైనాటి నుంచి ఈ నెల 10 నాటికి 50 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి చేరబోతున్నాయి.
== రైతు బందు కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి రైతుల్లో ఎనలేని సంతోషంగా ఉన్నది… రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఒక గొప్ప ఊతంగా మారింది.

also read :-ప్రమాదవశాత్తు బైకు దగ్ధం.

== ఇలా 50 వేల కోట్ల రూపాయలు రైతులకు ఖాతాల్లోకి చేరిన సందర్భం దేశ చరిత్రలో ఎన్నడూ లేదు. ఇది అద్భుతమైన సందర్భం. ఇలాంటి చారిత్రక సందర్భాన్ని మనమంతా సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఉన్నది.
== దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి చేయలేనంత గొప్ప కార్యక్రమాలను వ్యవసాయ రంగం కోసం రైతన్నల కోసం మన నాయకుడు కేసీఆర్ చేశారు.
== ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాలేశ్వరం నుంచి చిన్న సాగునీటి వనరులయిన చెరువుల బలోపేతం వరకు… రైతుబంధు, రైతు బీమా నుంచి రైతు వేదికల వరకు ఎవరు కనివిని ఎరుగని గొప్ప కార్యక్రమాలను కెసిఆర్ చేశారు
== ఇలాంటి నేపథ్యంలో రైతు బంధు కార్యక్రమం ద్వారా 50 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి చేరనున్న సందర్భాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసేందుకు మనమంతా ముందుకు కదలాలి… జనవరి మూడో తేదీ నుంచి 10వ తేదీ వరకు వారం రోజుల పాటు రైతు బంధు సంబరాలు నిర్వహించాలి
== తాజాగా ప్రభుత్వం కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో విధించిన పరిమితులను గుర్తుంచుకొని ఈ రైతుబంధు సంబరాలు నిర్వహించాలి
== శాసన సభ్యులు ఈ సంబరాల విషయంలో ముందుండి నియోజకవర్గ పార్టీ శ్రేణులు అందరినీ కలుపుకొని ముందుకు పోవాలి
== రైతుబంధు సంబరాల్లో భాగంగా కింది కార్యక్రమాలను నిర్వహించవచ్చు. దీంతో పాటు స్థానికంగా ఎవరికైనా మరిన్ని మంచి ఆలోచనలు వస్తే వాటిని కూడా ఈ సంబరాల్లో భాగంగా నిర్వహించవచ్చు
== రానున్న సంక్రాంతి సందర్భంగా ప్రతి ఇంటి ముందు రైతుబంధు సంబంధిత ముగ్గులను వేసేలా… మహిళా లోకాన్ని కలుపుకొని పోయేలా కార్యక్రమాలు నిర్వహించాలి.

also read :-♦️ దారి తప్పిన జింక పిల్లను అటవీ అధికారులకు అప్పగించిన మందమర్రి పోలీసులు

== విద్యార్థుల్లో రైతుబంధుపైన ఉపన్యాస, వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలి
== ఈ రెండు కార్యక్రమాలు చేపడుతే మహిళా లోకం తో పాటు భవిష్యత్ తరానికి కూడా రైతుబంధు గురించిన మరింత అవగాహన కలుగుతుంది
== ప్రతి గ్రామంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు ఊరేగింపులతో మొదలుపెట్టి రాష్ట్రంలో ఉన్న రెండు వేల ఆరు వందల కుపైగా రైతు వేదికల వద్ద పండగ వాతావరణంలో జనవరి 10వ తేదీన ఘనంగా ముగింపు సంబరాలు చేయాలి
== 3 తేదీ 10 వరకు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఈ సంబరాలను వినూత్నంగా చేయాలి…
== తాము నిర్వహించే ఈ సంబరాలకు స్థానికంగా ఉన్న పత్రికలు, స్థానిక టీవీ ఛానల్, సామాజిక మాధ్యమాల్లో సరైన ప్రచారం వచ్చేలా సమన్వయం చేసుకోవాలి
== ఆయా నియోజకవర్గాల్లో రైతులకు అందిన నిధుల వివరాలతో పాటు ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేయాలి
== స్థానిక ప్రజలు అందరికీ చేరేలా శాసనసభ్యులు సవివరమైన ఒక లేఖను రాస్తే బాగుంటుందని సూచన చేసిన కేటీఆర్