Telugu News

ఖమ్మం ప్రెస్ క్లబ్ లో విచిత్ర పాలిటిక్స్

గణతంత్ర వేడుక రోజున రెండు యూనియన్ల జెండా అవిష్కరణ

0

ఖమ్మం ప్రెస్ క్లబ్ లో విచిత్ర పాలిటిక్స్

== గణతంత్ర వేడుక రోజున రెండు యూనియన్ల జెండా అవిష్కరణ

== సోషల్ మీడియాలో బహిరంగ ఆరోపణలు

== ఐక్యం చేయాలని కోరుతున్న మిగతా జర్నలిస్టులు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

యూనియన్లు చాలా ఉండోచ్చు.. వాటికి కమిటీలు ఉండోచ్చు.. అందులో తప్పులేదు.. కానీ ప్రెస్ క్లబ్ అనేది అందరిది.. జిల్లా కేంద్రంలో పనిచేసే ప్రతి ఒక్క జర్నలిస్టుల స్వంతం.. ముఖ్యంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కార వేదిక, ఐక్య వేదిక, అందరి కుటుంబ వేదిక ప్రెస్ క్లబ్.. అందరు సోదరిభావంతో నడిపించే వేదిక. ఈ వేదిక నుంచి ప్రెస్ మీట్లు, ప్రెస్ సమావేశాలు నడుస్తుంటాయి.. వివిధ సంస్థల సమావేశాలను నిర్వహించుకునే వేదిక అది. ముఖ్యంగా జర్నలిస్టులు పోర్త్ ఎస్టేట్ గా పిలుస్తుంటారు.. సమాజంలో రాజ్యంగ పరిరక్షణలో నాల్గొవ స్థంబంగా జర్నలిస్టులను పిలుస్తుంటారు.. సమాజానికి న్యాయ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ ఎంత అవసరమో, జర్నలిజం అనే వ్యవస్థ కూడా అంతే అవసరం. అందుకే పోర్త్ ఎస్టెట్ అంటారు.

ఇది కూడా చదవండి: ఖమ్మంలో ‘ప్రెస్ క్లబ్’ లొల్లి షూరు

 అలాంటి నాల్గొవ స్థంబంలో, అందరి ఐక్య కుటుంబ నివాసం స్థలంలో విచిత్ర పాలిటిక్స్ ఎక్కువైయ్యాయి. దేశం గర్వించదగ్గ రాజ్యంగ నిర్మాణ రోజున, గణతంత్ర దినోత్సవం రోజున ఖమ్మం నడికేంద్రంలో ఉండే జర్నలిస్టుల మధ్య వర్గపోరు రోజురోజుకు మరింత ఎక్కువ అవుతోంది. ఎన్నో ఏళ్ల జర్నలిజం ఫీల్డ్ లో ఏనాడు ప్రెస్ క్లబ్ కు తాళం వేయని, వేయకూడని రోజులను చూసిన తరుణంలో గత కొద్ది రోజుల క్రితం వర్గపోరు ఫలితంగా ప్రెస్ క్లబ్ కు తాళాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో జర్నలిస్టుల్లో వ్యతిరేకత రావడంతో రెండు ప్రధాన యూనియన్ల బాధ్యులు చర్చించి ఒక్కటై  తాళాలు తీసిన పరిస్థితి వచ్చింది. అంతా పర్వాలేదు అనుకుంటుండగానే మరో సమస్య వచ్చిపడింది.. పద్మశ్రీ అవార్డు గ్రహిత, చెట్టు ప్రేమికుడు వనజీవి రామయ్యను ఓ యూనియన్ వారు జెండా అవిష్కరణకు పిలవడంతో మొదలైంది మరోసారి వర్గపోరు. తమకు ప్రమేయం లేకుండా ఓ యూనియన్ వారు ఎలా పిలుస్తారని భావించిన మరో యూనియన్ నాయకులు ప్రెస్ క్లబ్ వద్ద కచ్చితంగా జర్నలిస్ట్ మాత్రమే జెండాను అవిష్కరించాలని పట్టుబట్టారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో పంచాయతీ మరింత ముదిరింది.. జర్నలిజం విలువలను పక్కన పెట్టిన కొందరు జర్నలిస్టులు వ్యక్తిగత దూషణలకు, వ్యగ్యస్ర్తాలు సందించే విషయంలో ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పోస్టులు పెట్టారు.సమస్యను సద్దుపరచాల్సిన సీనియర్ జర్నలిస్టులు నిమ్మకుండిపోయారు. దీంతో యూనియన్ల మధ్య ప్రెస్ క్లబ్ వార్ గా మారిపోయింది. గణతంత్ర దినోత్సవం రోజున ప్రెస్ క్లబ్ ముంగిట రెండు యూనియన్ల నాయకులు వేరువేరుగా జెండా అవిష్కరణ చేశారు. ఇంత జరుగుతుంటే మరో యూనియన్ వారు ఊకుంటారా..

ఇది కూడా చదవండి: 24గంటల్లో న్యాయం చేయాలి..లేకుంటే స్టేషన్ కు వస్తా: పొంగులేటి

వారు అత్యవసర సమావేశం నిర్వహించి ప్రెస్ క్లబ్ కు మరో కమిటీ వేశారు. దీంతో ఒక్క ప్రెస్ క్లబ్ కు మూడు కమిటీలు ఏర్పాటైయ్యాయి. అతి కొద్ది రోజుల్లోనే మరో యూనియన్ కూడా మరో కమిటీ ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఇలా ఎన్నికమిటీలు ఒక ప్రెస్ క్లబ్ కు ఏర్పాడతాయో  అర్థం కావడం లేదని జిల్లా కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులు అడుగుతున్నారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని, ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తామని, నెల రోజుల్లోనే సమస్య పరిష్కారం అవుతుందని, ఒక వైపు సీఎం కేసీఆర్  బీఆర్ఎస్ పార్టీ అవిర్భవ సభ సాక్షిగా ప్రకటన చేశారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా మాటిస్తున్నారు. నెల రోజుల్లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చి మాట నిలబెట్టుకుంటానని అంటన్నారు. అంతే కాకుండా జర్నలిస్టు భవన నిర్మాణం కోసం రూ.40లక్షలను కూడా మంజూరు చేశారు.  ఈ సమయంలో జర్నలిస్టులందరు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. జూనియర్లు కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే  సీనియర్లు వారిని సమన్వయ పరిచి జర్నలిస్టులందర్ని ఒక గొడుగు కిందకు తీసుకరావాలని న్యూట్రల్ గా ఉన్న జర్నలిస్టులు కోరుతున్నారు. 25ఏళ్లుగా ఇళ్ల స్థలాల పై యుద్దం చేసుకుంటూ వచ్చి తీరా ముద్ద కడుపులోకి పోయే ముందు జర్నలిస్టుల మధ్య కోట్లాట ఎందుకో అర్థం కావడం లేదు. నోటికాడి ముద్దను నేలపాలు చేయకుండా అందరు కొంత సమన్వయం పాటించి జర్నలిస్టులందర్ని ఐక్యం చేసే బాధ్యత ప్రముఖంగా ఉన్న కొందరు సీనియర్లు బాధ్యత తీసుకోవాలని పలువురు జర్నలిస్టులు కోరుతున్నారు. ఈ వార్త రాసిన మిత్రుడిపై కోపం పెంచుకోకుండా ఆలోచించి, అవగాహణతో  రాజకీయ నాయకుల వద్ద, ప్రజల వద్ద పలచన కాకుండా అందరు ఒక గొడుగు, జర్నలిస్టు చెట్టు నీడకిందకు వస్తారని కోరుతున్నారు. చూద్దాం యూనియన్ల బాధ్యలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..?

ఇది కూడా చదవండి : పార్కులకు గుమ్మం ‘ఖమ్మం’: మంత్రి పువ్వాడ