2023 కు స్వాగతం..సుస్వాగతం
== ప్రజలందరు శుభాకాంక్షలు
== సుబీక్షంగా ఉండేందుకు దేవదేవుళ్లు ఆశీర్వదించాలని ప్రార్థనలు
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
2022 సంవత్సరాన్ని పూర్తి చేసుకున్న ప్రజలందరు 2023నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతున్నారు. గతేడాది కరోనా నుంచి బయటపడిన పూర్తి స్వేచ్ఛ పొందిన తెలంగాణ ప్రజలందరు కొంత కష్టనష్టాలతో, సుఖసంతోషాలతో జీవించారు. గడిచిన రెండేళ్ల పాటు కరోనా ప్రభావం వల్ల వ్యాపారాలు లేక, దుకాణాలు తెరవక, కూలీ పనులు లేక, వ్యవసాయమే దిక్కుగా మారి దిక్కుతోచని స్థితిలో ఇంటికే పరిమితమై అంక్షల జీవితంలోకి నెట్టబడిన ప్రజలందరు 2022 సంవత్సరంలో కొంత ఊరట లభించింది. కరోనా ప్రభావం పెద్దగా చూపించకపోయినప్పటికి గడిచిన సంవత్సరాల ఫలితంగా ప్రజలు కొంత అర్థిక స్థితిగతుల్లో మార్పులు రావడం జరిగింది.ఆ ప్రభావ ఫలితంగా 2022 సంవత్సరం ఒడుదుడుకుల నడుమ జీవన గమనం షూరు అయ్యి, కొంత సంతోష జీవనంవైపు పరుగులు తీస్తూ ఏడాదిని ముగించింది. ప్రజలు కూడా ఏడాది చివరిలో పంటలు చేతికందడంతో సంతోష జీవితాన్ని గడుపుతున్నారు. మిర్చితోటలు, పత్తి పంట కొంత దెబ్బతీసినప్పటికి వరి పంటను సాగు చేసిన రైతులకు మేలు జరిగిందని చెబుతున్నారు. తద్వారా 2022 సంవత్సరం రైతులకు అటు నష్టం చేయకుండా, ఇటు పూర్తిగా లాభం చేయకుండా కష్టసుఖాలతో గడిచిపోయిందనే చెప్పాలి. అయితే పాత జ్జాపకాలను మరిచిపోతు కొంగోత్త జీవితానికి ముందుకు అడుగులేస్తూ సుఖవంతమైన జీవన సంగ్రామంలోకి తీసుకెళ్లే నూతన సంవత్సరం ప్రజల జీవితాల్లోకి రానే వచ్చింది. పాతజ్జాపకాలను తుడిచిపెట్టుకపోయే, కొత్త సంవత్సరంన కోటి ఆశలతో జీవిస్తున్న ప్రజలందరికి సంతోషాన్ని సమకూర్చాలని, సుఖసంతోషాలతో జీవితాలను గడిచే విధంగా దేవదేవుళ్లు ఆశీర్వదించాలని ప్రజలు కోరుతున్నారు.
== ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ యువత సందడి చేశారు. నూతన ఏడాదిని పురష్కరించుకుని యువత డిసెంబర్ 31న సాయంత్రం 6గంటల నుంచి 12గంటలకు వరకు నూతన సంవత్సర సంబురాలు చేసుకున్నారు. అలాగే చిన్నపెద్ద తారతమ్యం లేకుండా ప్రజలందరు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతు పండుగను జరుపుకున్నారు. రాత్రి 12గంటల వరకు నిద్రపోకుండా అలాగే ఉంటే కుటుంబ మొత్తం కలిసి కెక్ కట్ చేసుకుంటూ సందడి చేశారు. మహిళలు, యువతులు ఇండ్ల వద్ద ముగ్గులతో సందడి చేశారు. యువకులు కేరింతలు కొడుతూ, మోటర్ సైకిళ్లపై రయ్ రయ్ మంటూ షికార్లు చేస్తూ హ్యాఫీ న్యూఇయర్ అంటూ సందడి చేశారు.
== పోలీసుల అంక్షలు
నూతన సంవత్సరం సందర్భంగా యువతి, యువకులు మద్యం సేవించి రోడ్లపైకి వచ్చి కేరింతలు కొడుతూ ప్రమాదాలు చేసే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఎక్కడిక్కడ అంక్షలను విధించారు. ప్రధాన రహదారులతో పాటు నగరంలో, పట్టణాల్లో ప్రధాన రహదారుల్లో అంక్షలు విధించారు. వాహనాలకు వేగనియంత్రణ పెట్టారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్న యువకులకు బ్రీత్ ఎనిలేజన్ పెట్టి జరిమానలు విధించారు. అలాగే పోలీసులు రాత్రంతా బందోబస్తు నిర్వహించారు.