ఆరు గ్యారంటీలతోనే అందరికీ సంక్షేమ పాలన: పొంగులేటి
– గడపగడపకు కాంగ్రెస్లో పొంగులేటి ప్రసాద్ రెడ్డి
– కూసుమంచి మండలంలో విస్తృత పర్యటన
(కూసుమంచి-విజయం న్యూస్)
బోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ లతోనే ప్రజలందరికీ సంక్షేమ పాలన అందుతుందని కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి అన్నారు.
గడపగడపకు కాంగ్రెస్ లో భాగంగా పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొoగులేటి శ్రీనివాస్ రెడ్డికి భారీ మెజారిటీని ఆకాంక్షిస్తూ.. బుధవారం రాత్రి పూరియా తండా, సంధ్యా తండా, లాల్ సింగ్ తండాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. శీతలా మాతకు, ముత్యాలమ్మకు పూజలు చేశారు.
ఇది కూడా చదవండి:- సంక్షేమాన్ని మరిచిన ఈ సర్కారును సాగనంపుదాం: పొంగులేటి
అనంతరం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హులందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తామని తెలిపారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమని అన్నారు. పొoగులేటి శీనన్న మీ అందరి వాడిలా పరిపాలన అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు, బజ్జూరి వెంకటరెడ్డి, నాయకులు జొన్నలగడ్డ రవి, హఫీజుద్దీన్, రామిరెడ్డి, ఎస్టీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ బిక్షపతి రాథోడ్, భూక్యా బాలాజీ, ఉప సర్పంచ్ ఉపేందర్, మంచా నాయక్, బానోత్ వినోద, బోడ వీరూ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి:- తుమ్మల అసక్తికర వ్యాఖ్యలు..ఏమన్నారంటే..?