Telugu News

పేదల కోసమే సంక్షేమ పథకాలు: మంత్రి పువ్వాడ

117 మందికి రూ.1.17కోటట్లు, నేటి వరకు 8223 చెక్కులకు గాను రూ.77.30 కోట్లు పంపిణీ..

0

పేదల కోసమే సంక్షేమ పథకాలు: మంత్రి పువ్వాడ

== కల్యాణలక్ష్మి, షాదిముభారక్ చెక్కుల పంపిణీ..

== 117 మందికి రూ.1.17కోటట్లు, నేటి వరకు 8223 చెక్కులకు గాను రూ.77.30 కోట్లు పంపిణీ..

== లబ్ధిదారులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి పువ్వాడ.

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

పేదల శ్రేయస్సు కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వెల్లడించారు. ఖమ్మం వీడీవోస్‌ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో ఖమ్మం నియోజకవర్గం పరిధిలో మంజూరైన కల్యాణలక్ష్మి, షాది ముభారక్ పథకం ద్వారా మంజూరైన చెక్కులను మంత్రి శనివారం అందజేశారు.

ఇదికూడా చదవండి: పేదల ఆత్మ గౌరవం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పువ్వాడ

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల ద్వారా ఇప్పటి వరకు ఖమ్మం నియోజకవర్గంలోని ఖమ్మంలో 73, రఘునాధపాలెంలో 44 మొత్తం 117 చెక్కులు పంపిణీ చేశామని, నేటి వరకు 8223 చెక్కులకు గాను రూ.77.30 కోట్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల నిధులను సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం వెచ్చిస్తోందని తెలిపారు. ఇక రైతులకు 24 గంటల విద్యుత్, ఆసరా పెన్షన్లు, సాగు, త్రాగునీరు, పేద ఆడపడుచులకు కేసీఆర్‌ కిట్లు, ఆడపిల్ల జన్మిస్తే రూ.13 వేలు, మగ పిల్లవాడు జన్మిస్తే రూ.12 వేలు ప్రభుత్వం అందిస్తోందని మంత్రి వివరించారు. రైతులకు, విద్యార్థులకు, వ్యాపారస్తులకు కరెంటు కష్టాల నుండి తెలంగాణ రాష్ట్రంలో సీఎం కెసిఆర్ గారు తన పాలనతో విముక్తి కల్పించారని వారు తెలిపారు. ఖమ్మం నగరంలో ఏ దిక్కున చూసిన అభివృద్ది ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది అని, ఖమ్మం నగరాన్ని అభివృద్ది చేసుకున్నందుకు బీఆర్ఎస్ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రానున్న రోజుల్లో BRS ప్రభుత్వాన్ని గెలులిపించుకోవలని, కేసీఅర్ ని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరారు. అనంతరం లబ్ధిదారులకు మంత్రి పువ్వాడ స్వయంగా వడ్డించారు. అనంతరం వారి కుటుంబీకులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

ఇది కూడా చదవండి: క్రీడాల్లో తెలంగాణ ముందుండాలనేదే లక్ష్యం: మంత్రి పువ్వాడ