Telugu News

పొలవరం ముంపు గ్రామాల సంగతేంటి..?

ఊరికించారు..ఊసురమనిపించారు..

0

ముంపు గ్రామాల సంగతేంటి..?

== ఊరికించారు..ఊసురమనిపించారు..

== వెనక్కి తెచ్చుకోవడం అటకెక్కినట్లేనా..?

== ఐదుగ్రామాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం

== పోలవరం ఎత్తు తగ్గించడంలో కెసిఆర్ వెనకడుగు

== పోలవరంతో ఆంధ్రకు వనగూరి అవకాశం ఏమైనా ఉందా..?

== ఆందోళన చేయడంలో వేచి చూస్తున్న పార్టీలు

== ఐదు గ్రామాలు రాకతో తెలంగాణకు మేలు అంటున్న విశ్లేషకులు

గోదావరి ఉపోగ్రహరూపం దాల్సించింది.. వరదలు బీభత్సవం సృష్టించాయి…. ప్రజలు భయానిక వాతావరణం నడుమ ఆ నలుపది రోజులు జీవనం సాగించారు.. అయినప్పటికి అస్తినష్టం జరిగింది కానీ.. ప్రాణనష్టం లేదు.. ఆ విషయంలో ప్రభుత్వం సక్సెస్ అయ్యింది.. గోదావరి కట్ట కాపాడింది..జనం సంతోషంలో ఉన్న సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆ గ్రామ పంచాయతీల అంశం తెరపైకి తెచ్చింది.. మా ఊళ్లు మాకిచ్చేయండి అని ప్రశ్నించింది.. ఏపీ ప్రభుత్వంపై చిర్రుబుర్రులాడింది.. ఐదుగ్రామాలిచ్చే వరకు వదిలేది లేదని సీఎంతో సహా రాష్ట్ర మంత్రివర్గం తెల్చేసింది..

ఇది కూడా చదవండి: మహిళ బిల్లు సంగతేంటి..?

ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల నడుమ కొత్త పంచాయతీ ఏర్పడింది.. ప్రభుత్వాల నడుమ వార్ నడిచింది..  ఆ చర్చ సుమారు రెండు నెలలు సాగింది.. ఆ తరువాత తూస్.. సడిసప్పిడి లేదు.. ఆ ఐదు గ్రామాల గురించి మాట్లాడిన నాథుడే కరువైయ్యారు.. అటు ఏపీ ప్రభుత్వం.. ఇటు తెలంగాణ ప్రభుత్వం ఆ ఐదుగ్రామాల గురించి ఊసేత్తడం లేదు.. కనీసం ప్రతిపక్షం స్పందించడం లేదు.. భద్రాచలం ఎమ్మెల్యే మినహా ఎవరు మాట్లాడిన పాపానపోలేదు.. మరి కొద్ది నెలల్లోనే ఎన్నికలు వస్తున్న సందర్భంలో ఆ ఐదు గ్రామాలపై ‘విజయం’ ప్రతినిధి అందించే ప్రత్యేక కథనం

(తమ్మిశెట్టి, ఇల్లెందు-విజయంన్యూస్)

గోదావరి ప్రతి సంవత్సరం జూలై ఆగస్టులో ఉగ్రరూపం దాల్చే ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నది.. ప్రతి ఏడాది లాగా వరదలు వచ్చినప్పటికి గత ఏడాది జులైలో భయంకరమైన వరదలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే .1986 తరహా గోదావరి ఉప్పొంగింది. ఎప్పుడు లేనంతగా 71.56 అడుగులకు గోదావరి ఉగ్రరూపం చూశాము.. తద్వారా వందలాధి గ్రామాలు నీటమునిగాయి.. వేలాధి ఇండ్లు నీటమట్టమైయ్యాయి.. అస్తినష్టం జరిగింది.. అయితే ప్రభుత్వ ముందుచూపు, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముందుచూపు, అక్కడే ఉండి పర్యవేక్షణ చేయడం  వల్ల  ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు..

ఇది కూడా చదవండి: ఇక జగన్‌కు విశాఖ ఉక్కు సెగ

కానీ ఈ సమయంలో యావత్తు తెలంగాణ వణికిపోయింది. వరదలు ఊళ్లను ముంచేస్తాయా..? ప్రజలకు ప్రాణనష్టం ఉంటుందని భయపడ్డారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఆంధ్రలో కలిసిన ఐదు గ్రామ పంచాయతీల ప్రజలు గజగజవణికిపోయారు.. ఆ ఐదు గ్రామాలను వరద ముంచేత్తింది.. ఇండ్లన్ని ఈతకొట్టాయంటే నమ్మాల్సిందే.. ప్రజలు సురక్షితప్రాంతాలకు తరలివెళ్లిపోవడం వల్ల పెద్దగా నష్టం జరగలేదు. కానీ ఆ ఐదు గ్రామ పంచాయతీల ప్రజలు మాత్రం క్షణంక్షణం ప్రాణం అన్నట్లుగా ఆ నెల రోజులు వణికిపోయారు.

== పోలవరం వల్ల ఎవరికి ప్రయోజనం..?

   పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాల్సిందే రీ డిజైన్ చేయకుండా ప్రాజెక్ట్ నిర్మిస్తే చాలా అనర్ధాలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. భద్రాచలం ముప్పుకు గురి అవకాశాలు లేకపోలేదు శ్రీరాముని పాదాలు తాకే ప్రమాదం ఉంది. ఈ పరిణామం పట్ల తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లో అస్త్ర శాస్త్రాలు సంధించిన దాఖలాలు లేవు. మరో విషయం ఏమిటంటే పోలవరం నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. పార్లమెంట్లో పోరాడుతున్న తెలంగాణ ఎంపీలకు సోయలేదు. వనగూరే. నిజానికి పోలవరం వల్ల ప్రయోజనాలు తక్కువ. ప్రయోజనాల కంటే ప్రమాదం ఎక్కువ అని విశ్లేషకులు భావిస్తున్నారు. సీమాంధ్ర పాలకులు అక్కడ ప్రజలకు అరిచేతులు వైకుంఠం చూపిస్తున్నారు. పోలవరం వల్ల లాభాలు ఉన్నాయని సాగుతాగినికి కొదవ ఉండదంటూ చెబుతున్నారు. ఇది అవాస్తవం. చరిత్రను పరిశీలిస్తే భారీ ప్రవాహం మధ్య ప్రవహించే నదిపై ఎక్కడ ప్రాజెక్టు కట్టిన దాఖలు లేవు నూతన సాంకేత పరిజ్ఞానంతో ముందుకు సాగుతున్న అగ్రదేశాల సైతం అందుకు ఎనకాడుతున్నాయి ఎవరు చేయని సాహసం పోలవరంపై చేయడం పట్ల జలాన్నిపూణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

== పోలవరం వల్ల ఆదివాసీల జీవనానికి ప్రమాదం.??

పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరిగిన నష్టం అనేది ఈ ప్రాజెక్టు నిర్మిస్తే ఆదివాసీల జీవనానికి జీవితానికి జరిగిన నష్టం అంతా ఇంత కాదు. తెలంగాణలో 773 ఆదివాసి గ్రామాలు జల సమాధి అవుతున్నాయి. రెండు లక్షల మంది ఆదివాసీలు నిరాశ్రయులు కానున్నారు.

ఇదికూడా చదవండి: బీఆర్ఎస్ సమావేశం ముఖ్యాంశాలు ఇవే

ఇతర ప్రాంతానికి వలస వెళ్లే పరిస్థితి ఏర్పడింది.  ఇతర ప్రాంతాలకు వెళ్తే స్వేచ్ఛ స్వతంత్రాన్ని కోల్పోనున్నారు. అది చట్ట వ్యతిరేకం కేంద్రం చెప్పినట్టు తెలంగాణ పోరాటం ఎక్కడ చేసిన దాఖలాలు లేవు. జాతీయ గిరిజన విధానంలో 50వేల మంది గిరిజనులు నిర్వాసిలే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గ్రామ సభలు నిర్వహించాల్సి  ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు దానిపై చర్చించలేదు. పీసా చట్టం కింద గ్రామ సభ నిర్వహించిన దాఖలు లేవు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఒక లక్ష పదివేల 567 ఎకరాలు ప్రాజెక్టు కింద కోల్పోవాల్సి వస్తుంది. 30 వేల ఎకరాలు కోల్పోవాల్సి వస్తుంది. ఆదివాసి కుటుంబాలు గుట్టలు దిగి మైదానం  ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది. కుటుంబాలు గుట్టలు దిగి వలస వెళ్లాల్సి వస్తుంది. మూడు లక్షల మంది ఆదివాసీలు తమ జీవన ఉపాధి కోల్పోవాల్సి ఉంటుంది. 2013 సెక్షన్ 3 ప్రకారం 139 గ్రామాలను సీమాంధ్రలో కలపాలని  నాటి ప్రభుత్వం భావించింది. ఈ నిర్ణయం సరికాదు. ఆ తర్వాత అడవి ప్రాంతం ప్రమాదం ఉన్న మరో 56గ్రామాలు కలిపి 195 గ్రామాలు ఆంధ్రలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ముంపు గ్రామాలు భద్రాచలం మండలంలోని భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహాయించి 117 గ్రామాలు ఆంధ్రలో కలిపారు. కూనవరం లోని 65 గ్రామాలు, చింతూరులోని 108 గ్రామాలు, విఆర్ పురం లోని 73 గ్రామాలు, వేలేరుపాడు మండలంలోని 65 గ్రామాలు, కుక్కునూరు గ్రామంలోని 59 గ్రామాలు, బూర్గంపాడు మండలంలోని 37 గ్రామాలను కేంద్రం ఆంధ్రాలో విలీనం చేసింది మొత్తంగా 524 గ్రామాలు 2920 విస్తీర్ణం ఆంధ్ర కోల్పోవాల్సి వచ్చింది. వేలమంది నిర్వాసితులయ్యే ప్రాజెక్టు పిసా 170 యాక్ట్ చట్టాల ప్రకారం గ్రామసభలు నిర్వహించాల్సి ఉంటుంది. ఐదో షెడ్యూల్లో పిసా 170 చట్టాలను అమలు చేయాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా జరిగేదంతా జరుగుతుంటే తెలంగాణ ప్రభుత్వం ఏమి చేయకపోవడం దుర్మార్గమైన చర్య.

== ఐదు గ్రామ పంచాయతీల సంగతేంటి..?

భద్రాచలానికి ఆనుకొని ఉన్న ఐదు గ్రామాలు రెండు రాష్ట్రాల మధ్య సతమతమవుతున్నాయి. ఇటీవల వచ్చిన వరదలు ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఐదు గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉంది.. ఇప్పుడు కాకపోయిన ఏదో ఒక వరదల ప్రభావానికి రాబోయే రోజుల్లో ఆ ఐదు గ్రామ పంచాయతీలు మునిగిపోవాల్సిందే.. అందుకే ఆ గ్రామాలను కాపాడుకోవాలంటే గోదావరి అనకట్ట పెంచాలి.. పోలవరం ఆయకట్టు తగ్గించాల్సి ఉంది.. తద్వారా ఆ ఐదు గ్రామాలు జీవం పోసుకునే అవకాశం ఉంది. ఆదే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి చెప్పింది.. ఆ ఐదు గ్రామ పంచాయతీలను మాకు అప్పగించండి అని కోరింది. పోలవరం ఎత్తు తగ్గించాలని వాధించింది. దీంతో ఇరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమ్మర్శలు చేసుకున్నారు. ఐదు గ్రామ పంచాయతీలను వదలమంటే.. భద్రాచలాన్ని వదిలేయండి మీ వల్ల కాదంటూ సవాల్ చేసిన పరిస్థితి ఆంద్రమంత్రులకు ఏర్పడింది.. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాధించినప్పటికి ఫలితం లేకపోయింది.

ఇదికూడా చదవండి: బీఆర్ఎస్ పాలనలోనే మ‌హిళ‌ల‌కు మ‌హ‌ర్ద‌శ‌.: మంత్రి పువ్వాడ

ఆంధ్ర,తెలంగాణ మధ్య ఆ ఐదు గ్రామ పంచాయతీ ప్రజలు నలిగిపోతున్నారు. వరదల సమయంలో రెండు రాష్ట్రాల మంత్రులు మాటలు తూటాలు పేల్చుకున్నారు. వరదలు వెనక్కి తగ్గేసరికి వాళ్లు వెనక్కి తగ్గారు. అప్పటి వరకు ఎగిసిపడిన తెలంగాణ మంత్రుల మాటలతూటాలు..నిప్పుపై నీళ్లు చల్లితే చల్లారినట్లుగా తూస్ మన్నారు.. ఆగస్టు వరకు పోరాటం చేసిన తెలంగాణ మంత్రులు, సెప్టెంబర్ నుంచి ఆ ఊసే మర్చిపోయారు. పక్క రాష్ట్రం కూడా ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో పోలవరం ముంపు గ్రామాల సంగతి, పోలవరం ఎత్తు సంగతి వదిలేశారు.. నీటిలో బుడగలుగా మంత్రుల మాటలు మారిపోయాయి. ఫలితంగా ఐదుగ్రామ పంచాయతీల ప్రజల గోస మళ్లీ మొదటికి వచ్చింది..  తెలంగాణలో కలిస్తే అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయని ఆ గ్రామ గ్రామాల ప్రజలు ఆలోచించినప్పటికి  తెలంగాణ ప్రభుత్వం వారికి చేసింది ఏమీ లేదు. కేసిఆర్ అక్కడి వరకి వచ్చి వరదల సమయంలో ప్రారంభించడం. తప్ప ఐదు గ్రామాల కోసం పోరాడి దాఖలు లేవు. కనీసం ఎంపీలు ఐదు గ్రామాల కోసం పోరాడిన అంశాలు లేవు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కొట్లాడి ఐదు గ్రామాల ప్రజలను తెలంగాణలో విలీనం చేసేందుకు తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఎంతయిందని ఎంతైనా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. లేకపోతే ప్రజా పోరాటం ద్వారా ఉద్యమాలతో పయనించేందుకు సిద్ధమవుతున్నారు.