Telugu News

కాటికాపరులు మంత్రి పువ్వాడను అడిగిందేంటీ..?

సానుకూలంగా స్పందించిన మంత్రి

0

కాటికాపరులు మంత్రి పువ్వాడను అడిగిందేంటీ..?
సానుకూలంగా స్పందించిన మంత్రి
(ఖమ్మం –విజయంన్యూస్)
కాటికాపరి జాంబవంతుడు సొసైటీ ఆధ్వర్యంలో హిందూ స్మశాన వాటిక కాల్వ ఒడ్డు (మున్నేరు)లో నిత్యం శవాలను కాల్చడం,పూడ్చడం చేస్తున్న మా కాటికాపారులకు ప్రభుత్వం షరతులు లేకుండా అర్హులుగా గుర్తించి డబల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ ఖమ్మంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

వినతిపత్రం అందజేసిన అనంతరం సొసైటీ ప్రధాన కార్యదర్శి చెరుకుపల్లి బాలు మాట్లాడుతూ కులవృత్తి వంశపారంపర్యంగా శవాలను కాల్చడం,పూడ్చడం చేస్తున్నాం.కరోనా విపత్కర పరిస్థితుల్లో కరోనాతో మరణించిన శవాలకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాల్చడం,పూడ్చడం చేశాం.అలాంటి మేము ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లు లేక అద్దె ఇండ్లలో నివాసిస్తున్నామని అన్నారు. శవాలను కాల్చే మాకు ఇంటి యజమానులు అద్దెకు ఇండ్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని తెలిపారు. మా సమస్యలను దృష్టిలో ఉచుకొని ఎలాంటి విచారణ లేకుండా ప్రత్యేక కోటలో ఇండ్లు మంజూరు చేయాలని కోరారు.

also read;- ఓటర్ల తీర్పు ఎటు.. షూరు అయిన పోలింగ్