Telugu News

బీఆర్ఎస్, బీజేపీ పాలకులు చేసిందేమిటీ..?: పువ్వాళ్ళ 

సత్తుపల్లి నియోజకవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ, రాయల నాగేశ్వరరావును

0

బీఆర్ఎస్, బీజేపీ పాలకులు చేసిందేమిటీ..?: పువ్వాళ్ళ 

== సత్తుపల్లి నియోజకవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ, రాయల నాగేశ్వరరావు

(సత్తుపల్లి -విజయం న్యూస్)

(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)

27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం, టీజెఎస్ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కు మొదటి ప్రాధ్యాన్యత ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్,సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కమిటీ కొ-ఆర్డినేటర్ రాయల నాగేశ్వరరావు కోరారు.సత్తుపల్లి శాసనసభ్యులు మట్ట రాగమయి అధ్యక్షతన సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశంలో డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తో కలిసి పాల్గొన్న రాయల నాగేశ్వరరావు మాట్లాడుతు వరంగల్,నల్గొండ,ఖమ్మం జిల్లాల కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టితో గెలిపించాలని పిలుపునిచ్చారు,కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో BRS నాయకులు లక్ష కోట్లు దోచుకున్నారు,మేడిగడ్డ లో రెండు పిల్లర్లు కుంగి పోయాయని ఆయన విమర్శించారు.ఈనాడు ఎమ్మెల్సీ ఓట్ల కోసం మళ్లీ మేడిగడ్డ గురించి హరీష్ రావు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.BRS నాయకులకు ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు…ఈ కార్యక్రమంలో నియోజకవర్గ,మండల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు,పట్టభద్రులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..