Telugu News

ఇల్లందులో మున్సిపాలిటీలో ఏం జరుగుతోంది..?

మా ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి సరితానే.

0

డివి గద్దె దిగాల్సిందే!

== మా ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి సరితానే.

== సానుకూలంగా 16 మంది అసంతృప్తి కౌన్సిలర్లు.

== దమ్మలపాటి రాజీనామా చేస్తే క్యాంపు నుంచి బయటికి వస్తాం.

== ఎమ్మెల్యే హరిప్రియకు మీ వ్యతిరేకం కాదు

== కేవలం మునిసిపల్ చైర్మన్ మా టార్గెట్.

== పార్టీకి మేము కట్టుబడి ఉన్నాం  స్పష్టం చేసిన కౌన్సిలర్లు

== ఫలించని మంత్రి,  ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ప్రయోగాలు.

ఇల్లెందు మున్సిపల్ పోరు రసవత్తరంగా మారింది.. చైర్మన్ కు, కౌన్సిలర్లకు మధ్య నెలల తరబడి రగులుతున్న వర్గపోరు ఇప్పుడు బుసలకొడుతుంది.. మొన్నటి వరకు ఇల్లెందుకే పరిమితమైన వారి పంచాయతీ, ఇప్పుడు బహిర్గతమైంది.. కలెక్టరేట్ కు చేరింది.. అది కాస్త చినికి చినికి గాలివానగా మారింది.. రాష్ట్ర వ్యాప్తమైంది…సర్కార్ వర్సెస్ ఇల్లెందు మున్సిపాలిటీగా మారింది.. ఏడాది పాటు చైర్మన్ పై అవిశ్వాసానికి ప్రయత్నిస్తున్న కౌన్సిలర్లు సమయం చూసి మరోసారి అవిశ్వాసం ప్రక్రీయ తెరపైకి తీసుకొచ్చారు. కలెక్టరేట్ ను ముట్టడించి, అనుకున్నది సాధించారు.. అయితే మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెడితే చైర్మన్ ఎవరు..?  విజయం ప్రతినిధి అందించే ప్రత్యేక కథనం ఇది.

(తమ్మిశెట్టి, ఇల్లెందు-విజయంన్యూస్)

ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు గద్దె దిగాల్సిందేనని మూకుముడిగా కౌన్సిలర్ స్పష్టం చేస్తున్నారు. ఆయన చైర్మన్గా కొనసాగే అవకాశం లేదని గత మూడేళ్లలో ఆయన పరిపాలన విఫలమైందని స్పష్టం చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీకి మేము అనుకూలమేనని కేవలం డివికే వ్యతిరేకమని ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇల్లెందు మున్సిపాలిటీ లో ఏం జరుగుతోంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ఇది కూడా చదవండి: నేడు ఇల్లందుకు రేవంత్ రెడ్డి పాదయాత్ర

ఇల్లెందు మున్సిపాలిటీ గతంలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 24 వార్డులు ఉండగా, అందులో 19 మంది బిఆర్ఎస్  పార్టీకి చెందిన కౌన్సిలర్లు గెలిచారు. అనంతరం దమ్మలపాటి వెంకటేశ్వరరావును చైర్మన్ గా ఎన్నుకున్న అనంతరం  గత మూడు సంవత్సరాలుగా ఆయన చక్రం తిప్పాడు. మంత్రి పువ్వాడ, ఎమ్మెల్సీ తాత మధు,ఎమ్మెల్యే హరిప్రియ హరి సింగ్ నాయకుల కనుసన్నల్లో పరిపాలన జరిగింది. కింది స్థాయి కౌన్సిలర్లను ఏమాత్రం పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటినుంచి వారి నడుమ పోరు  మొదలైంది. పలుమార్లు ఇల్లెందు మున్సిపాలిటీ పరిస్థితి, చైర్మన్ పనితీరుపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి దృష్టికి కౌన్సిలర్ తీసుకెళ్లారు. అయినప్పటికి వారు పట్టించుకోకపోవడంతో విఫలమైయ్యారు.  ఈ నేపథ్యంలో బలమైన నిర్ణయం తీసుకున్న ఎక్కువ మంది కౌన్సిలర్లు అవిశ్వాసంకు మొగ్గు చూపించారు. ముందుగా మున్సిపల్ కార్యాలయం అధికారులకు అవిశ్వాస పత్రాన్ని అందించేందుకు ప్రయత్నించిన కౌన్సిలర్లు, ఆ ప్రయత్నం విఫలం కావడంతో కొత్తగూడెంలోని  కలెక్టర్ కు అవిశ్వాస వినతి పత్రం ఇచ్చి మున్సిపల్ చైర్మన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాకుండా అసంతృప్తి కౌన్సిలర్ అంతా క్యాంపుకు తరలిపోయారు. డివి గద్దె దిగాల్సిందేనని కౌన్సిల్ స్పష్టం చేస్తున్నారు. అప్పటివరకు ఇల్లందులో  అడుగు పెట్టమని పునరుద్గాటిస్తున్నారు.

– కొండపల్లి సరితను సమర్ధిస్తున్న కౌన్సిలర్లు?                                                  ఇదికూడా చదవండి:  భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న బిజెపి:భట్టి

ఆది నుంచి చైర్ పర్సన్ రేస్ లో ఉన్న కొండపల్లి సరితను మెజార్టీ కౌన్సిలర్లు సమర్ధిస్తున్నారు. గత కొంతకాలంగా ఆమెనే చైర్ పర్సన్ గా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ పార్టీ హైకమాండ్ స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు డివికి అనుకూలంగా సహకరించారు. ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది కౌన్సిలర్ లు అంతా ఏకమయ్యారు. దీవిని గద్దె దింపాల్సిన డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో దేనికైనా సిద్ధమేనని ప్రకటిస్తున్నారు.

– మేము ఎమ్మెల్యేకి వ్యతిరేకం కాదు?

మేము ఎమ్మెల్యేకి బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకం కాదని కౌన్సిలర్లు చెబుతున్నారు. కేవలం మున్సిపల్ చైర్మన్ మా టార్గెట్ అని స్పష్టం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మా అవసరాలు పార్టీకి ఎమ్మెల్యేకి అవసరం ఉంటే సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. లేనిపక్షంలో సస్పెండ్ చేసిన తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు. కౌసర్లంతా మెజారిటీగా నిర్ణయం తీసుకున్నామని మంత్రి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే నివారించడానికి తగ్గేది లేదన్నారు. కలిసి మాట్లాడదామని సమస్య పరిష్కరిద్దామని ఎమ్మెల్యే పలుమార్లు మాట్లాడిన ఇదే స్పష్టం చేశామని చెబుతున్నారు.

– పట్టు కోల్పోతున్న బిఆర్ఎస్ పార్టీ?                                           ఇదికూడా చదవండి:  కార్పొరేట్ కు దీటుగా సర్కార్ స్కూళ్ల అభివృద్ధి:మంత్రి

పట్టు కోల్పోతున్న టిఆర్ఎస్ పార్టీ నానాటికి ఉనికి కోల్పోతున్నది రాజకీయ విశ్లేషకులు అంచనా.ప్రస్తుత జరిగిన పరిణామాలతో మరింత దిగజారిపోయింది.అధికార పార్టీ ఉండి కౌన్సిలర్లు సముదాయించడంలో విఫలమైందనే చెప్పాలి.ఓ పక్క ప్రత్యర్థి వర్గం బలోపేతం అవుతున్న తరుణంలో ఇలాంటి సంఘటన జరగడం పార్టీకి గొడ్డెల పెట్టు.

– మమ్మల్ని టార్గెట్ చేస్తే ఊహించని చేస్తేపరిణామాలు?

– మమ్మల్ని టార్గెట్ చేసి డిపార్ట్మెంట్ లతో ఒత్తిడి చేపిస్తే ఊహించిన పరిణామాలు జరుగుతాయని పలువురు కౌన్సిలర్లు హెచ్చరించారు .ఈ మేరకు విజయం ప్రతినిధితో మాట్లాడారు. మేము బి ఆర్ఎస్ నాయకులు మేనని పార్టీ కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తున్నారు.మాకు వ్యక్తిని మార్చమని చెప్పాం.అంతేకానీ పార్టీకి ఎప్పుడు వ్యతిరేకం కాదు.పార్టీలో సింబల్ మీద గెలిచిన వాళ్ళం ఒక వ్యక్తి కోసం ఇంత మందిని పోగొట్టుకుంటే అవసరమైతే దేనికైనా సిద్ధమేనని పలువురు కౌన్సిలర్ లు స్పష్టం చేశారు.

– డివి అసలు మాకొద్దు: జెకె శీను కౌన్సిలర్

మున్సిపల్ చైర్మన్ గా దమ్మలపాటి వెంకటేశ్వరరావు మాకు అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు విజయం ప్రతినిధితో జెకె శ్రీను మాట్లాడారు. చైర్మన్గా టీవీ వద్దని పదేపదే కొన్ని నెలల నుండి ఎమ్మెల్యే   చెప్పుకుంటా వచ్చామన్నారు. అయినప్పటికీ మంత్రి అండదండలు, ఎమ్మెల్సీ తాత మధు,ఎమ్మెల్యే తనకున్నారంటూ ఏకపక్ష నేరాలు తీసుకుంటూ వస్తున్నారన్నారు.ఇక ఆయనకు ఎంత మాత్రం చైర్మన్గా కొనసాగే అర్హత లేదని స్పష్టం చేశారు.ఎన్ని ఒత్తులు ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆయన గద్దె దిగాల్సిందని పేర్కొన్నారు.లేని పక్షంలో దేనికైనా  ఎనకాడబోమని ప్రకటించారు.బిఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉన్నామని పార్టీ పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు.ఎనకాడబోమని ప్రకటించారు.బిఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉన్నామని పార్టీ పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు.