Telugu News

ముత్యాలగూడెంలో ఏం జరుగుతోంది..?

దాడి చేసిందేవ్వరు..?గాయాలైందేవ్వరికి..? కేసులేవ్వరిపై నమోదైయ్యాయి..?

0

ముత్యాలగూడెంలో ఏం జరుగుతోంది..?

== పండుగ ఎవరిది..? పంచాయతీ ఎవరిది..?

== దాడి చేసిందేవ్వరు..?గాయాలైందేవ్వరికి..? కేసులేవ్వరిపై నమోదైయ్యాయి..?

== పూనుకున్న రాజకీయం.. పొంచిఉన్నప్రమాదం

==  బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారిన సీను

== పరస్పర ప్రెస్ మీట్లతో నియోజకవర్గానికి పాకిన రాజకీయ సమరం

== అధికార పార్టీ బెదిరింపులు చేస్తున్నట్లు ఆరోపిస్తున్న గ్రామస్థులు

== పోలీసులు అర్థరాత్రులు ఇండ్లలోకి వచ్చి మహిళలపై దురుచుప్రవర్తన చేస్తున్నారంటున్న బాధితులు

== భయపడుతున్న జనాలు అంటూ మీడియాలో ముమ్మర కథనాలు..

== తప్పుడు వార్తలంటున్న పోలీసులు, అధికార పార్టీ నాయకులు

== బెదిరింపులకు పాల్పడితే దేనికైనా సిద్దంగా ఉన్నామంటున్న జనం

== ముత్యాలగూడెంలో ముదురుతున్న పంచాయతీ

(కూసుమంచి-విజయంన్యూస్)

allso read- ఖమ్మం నగరం రాష్ట్రానికే ఆదర్శం..మంత్రి పువ్వాడ.*

ఒక కుల పండుగ కాస్త.. ఘర్షణ పండుగ గా మారింది.. కుల పండుగ కాస్త.. రాజకీయ పండుగ మారింది.. రాజీలేని రణరంగంగా మారింది..  గ్రామ పండుగ కాస్త కానిస్టెన్సీ పంచాయతీగా మారింది.. అది కాస్త పోలీసులకు, పొలిటికల్ కు చుట్టుకుంది.. పోలీసులు పై గ్రామస్థులు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తుంటే, పొలిటికల్ లీడర్లు పంచాయతీని పరమాంద శిష్యుల వలే పక్కదారి పట్టించి పైటింగ్ కు సిద్దమవుతున్నారు.. ఫలితంగా పల్లెటూరు ప్రజలు భయాందోళనలో బతుకుతున్నారు.. నిత్యం పోలీసుల బూట్ల చప్పుడ్లతో అర్థరాత్రి అలజడులు మోగుతుంటే.. బిక్కుబిక్కుమంటూ ప్రజలు భయాందోళన చెందుతున్నారు..? రాజకీయాలకు రంగులు ఉండబోవేమో కానీ.. ఆ రంగు మాయలో పడిన ఈ కుల దైవ పండుగ కుటుంబాల నడుమ చిచ్చుపెట్టే పరిస్థితికి చేరింది.. అన్న ఫిర్యాదు..తమ్ముడు జైలుకు పోయిన పరిస్థితి దాపరించింది.. అసలు ముత్యాలగూడెంలో ఏం జరుగుతోంది.. ఎందుకు ఇంత రాదాంతం.. చిన్న పండుగను చిలికిచిలికి గాలివానలా చేసిందేవ్వరు..? పల్లె ప్రజలను భయపెడుతున్నదేవ్వరు..? పూర్తి వివరాల్లోకి వెళ్తే

ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలంలోని ముత్యాలగూడెం గ్రామంలో గౌడ కులస్తులు తమ కుల దైవమైన కంఠమహేశ్వరస్వామి దేవాలయ నిర్మాణం కార్యక్రమం జరుగుతోంది.. ఈ క్రమంలో గౌడ కులానికి చెందిన సర్పంచ్ బొల్లికొండ శ్రీనివాస్, ఎంపీటీసీ భర్త ఉడుగు వెంకటేశ్వర్లు నడుమ అభిప్రాయబేదాలు వచ్చాయి. కులస్తుల మధ్య జరగాల్సిన ఈ కార్యక్రమంలో ఇతర కులస్తులు, ఇతర గ్రామాల హస్తం పడింది.. దీంతో ఇద్దరి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో అభిప్రాయబేదాలు వచ్చాయి.. గొడవ షూరు అయ్యింది.. దీంతో రెండు వర్గాలుగా విడిపోయిన గౌడ కులస్తులు  రెండు పార్టీలుగా విడిపోయారు.. ఒక గ్రామంలో రెండు కాటమయ్య ఆలయాల నిర్మాణానికి పూనుకున్నారు. శంకుస్థాపనలు, నిర్మాణ పనులు అంతా పూర్తైయ్యాయి.. అప్పటికే టెన్షన్ వాతావరణం నేలకొన్న తరుణంలో కూసుమంచి పోలీసులు కొంత జాగ్రత్త చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రెండు దేవాలయాల ప్రారంభం ఒకే రోజు రావడంతో ముత్యాలగూడెంలో ఘర్షణ వాతావరణం నివ్వురుగప్పిన నిప్పుగా మారింది. దీంతో కొంత మంది నాయకులు పోలీసులకు సమాచారం అందించారు. ముత్యాలగూడెంలో గొడవలు అయ్యే అవకాశం ఉందని తెల్చి చెప్పారు.

allso read- *ఖమ్మం పత్తి మార్కెట్ లో అగ్నిప్రమాదం..*

ఈ క్రమంలో పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే కొంత గొడవ వాతావరణం తగ్గేదేమో..? కానీ పోలీసులు ఈ స్థాయిలో గొడవ జరుగుతుందని ఊహించకపోవడంతో తప్పులో కాలేసినట్లైంది. ఆలయ ప్రారంభం అనంతరం బోనాల జాతర కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రాయల నాగేశ్వరరావు హాజరు కాగా పూజలు చేసుకుని తిరిగి వెళ్లిపోయారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతామధు, జడ్పీటీసీ, ఎంపీపీ, ముఖ్యనాయకులు భారీ ర్యాలీగా ప్రచారరథాలతో గ్రామంలోకి వచ్చారు. అప్పటికే సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగే బోనాల జాతర ర్యాలీకి, బీఆర్ఎస్ పార్టీ ర్యాలీ ఒక్కసారిగా ఎదురైదురుగా కలుసుకున్నారు. దీంతో పరస్పర వాధనలు, నినాదాలు చేయడంతో చిన్న పంచాయతీ కాస్త పెద్ద పంచాయతీగా మారింది. ఏవరో ఒక వ్యక్తి కారుపైపై రాయి విసరడంతో ఎమ్మెల్యే కందాళ కన్వాయ్ లోని ఓ కారు అద్దాలు పగిలాయి. దీంతో ముత్యాలగూడెంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారిపోయింది. ఒకరిపై ఒకరు దూసుకొస్తున్న తరుణంలో పోలీసులు అప్రమత్తమై అందర్ని దూరంగా పంపించారు. గొడవ తగ్గిందనుకున్నారు..కానీ

== అర్థరాత్రి హైడ్రామ

అర్థరాత్రి సమయంలో ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి, సీఐ జితేందర్ రెడ్డి, ఎస్ఐ రమేష్ తో పాటు సిబ్బంది కలిసి ముత్యాలగూడెంలో పర్యటించి కాంగ్రెస్ పార్టీ నాయకుడు మంకెన వాసును అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన మొండికేయడంతో ఏసీపీ, వాసు ఇద్దరు పరస్పరం గుంజుకోవడం వల్ల కిందపడిపోయారు. దీంతో వాసుకు చేయ్యి విరింది. దీంతో అసలు గొడవ షూరు అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరు పెద్ద సంఖ్యలో వాసు ఇంటికి చేరుకుని అరెస్టు చేయకుండా అడ్డుకున్నారు.

allso read- ఖమ్మంలో 1000 కి.మీ భట్టి పాదయాత్ర సంబురం

అనంతరం ఉదయం మంకెన వాసు తన వీడియో క్లిప్పింగ్ లను గ్రూపులలోకి పంపించడంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గప్రసాద్, పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు, మండల పార్టీ నాయకులు దైర్యం చెప్పేందుకు వెళ్లారు. అక్కడే విలేకర్ల సమావేశం నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడటంతో రియాక్ట్ అయిన కాంగ్రెస్ నాయకులు వారు తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. అంతా అయిపోయిందనుకుంటున్న సమయంలో పోలీసులు కొత్త పంచాయతీకి తెరలేపారు.

== 11 మందిపై కేసులు నమోదు

ఎమ్మెల్యే కాన్వాయ్ పై దాడి చేసిన విషయంలో 11 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిపై పోలీసులు విధుల పట్ల అడ్డం వచ్చిన కేసులతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే  ఎవరిపై అయితే కేసులు నమోదైయ్యాయో వారందర్ని అదుపులోకి తీసుకునేందుకు ముత్యాలగూడెంలో జల్లెడ పట్టే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే అప్రమత్తమైన వారు ముత్యాలగూడెం నుంచి పరారైయ్యారు. వారి కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ అర్థరాత్రి ఇండ్లలో దూరి మహిళలను బెదిరిస్తున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. పోలీసులు మప్టిలో వచ్చి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, పోలీసులు సెల్ పోన్లను తీసుకుంటున్నారని, ఇవ్వకపోతే బెదరిస్తున్నారని, మాట్లాడితే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఒకానోక దశలో ముత్యాలగూడెం మహిళలు పోలీసులను ఒక ఆట అడేసుకున్నట్లే కనిపిస్తుంది.

allso read- అరుణ వర్ణమైన కొత్తగూడెం

ఆ స్థాయిలో తీవ్రంగా ఆరోపణలు చేశారు. చిన్న పిల్లలను సైతం బెదిరింపులకు గురి చేస్తున్నారని, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ మేము మొండిగా, దైర్యంగా వాళ్ల కోసం ఎదురుచూస్తూ ఉండిపోతున్నామని తెలిపారు.

== పండుగ ఎవరిది..? పంచాయతీ ఎవరిది..?

ముత్యాలగూడెం గ్రామంలో జరుగుతున్న పరిస్థితులను చూస్తే జిల్లా ప్రజలు, మీడియావారు అశ్ఛర్యపోతున్నారు. ఇంత చిన్న పంచాయతీ కాస్తా ఎందుకు ఇంత రచ్చగా మారిందనేది ఎవరికి అర్థంకావడం లేదు. ఇందులో ఓవర్ యాక్షన్ చేసింది పోలీసులా..? పార్టీ నాయకులా..? ప్రజలా..? ఎందుకు ఇంత దూరం తీసుకోచ్చారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వారి ప్రశ్నలకు సమాధానం లేకపోయింది. ఒక కుల పండుగలో ఇతర కుల నాయకులు పూసుకోవడం, వారి మద్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేయడంతోనే ఈ పంచాయతీ ఇంత ముదురడానికి ప్రధాన కారణమని అంటున్నారు. రెండు వర్గాల పక్కన కొందరు సీనియర్ నాయకులు చేరడం, సలహాలు ఇవ్వడంతో ఈ పంచాయతీకి ఆజ్యం పోసిందని పలువురు చెబుతున్నారు. గొటితో పోయేదాని గొడ్డలిదాక తీసుకొచ్చిన విషయంలో ఏసీపీ పాత్ర ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏసీపీ సార్ అక్కడికి రావడం వల్లనే ఈ పంచాయతీ షూరు అయ్యింది. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏసీపీ పై ప్రైవేట్ కేసు వేసినట్లుగా తెలుస్తుంది. ఎది ఏమైనప్పటికి ముత్యాలగూడెంలో సాధాహరణ పరిస్థితులు తీసుకరావడం మంచిదని పలువురు గ్రామస్తులు చెబుతున్నారు.  పోలీసులు కూడా మారాలని కోరుతున్నారు. మరీ పోలీసులు, అధికార పార్టీ నాయకులు మారతారా..? ముత్యాలగూడెం గ్రామంలో పంచాయతీ సద్దుమనిగేనా..? వేచి చూడాల్సిందే..?