Telugu News

పొంగులేటి నిర్ణయమేంటి..? ఆయన మాటలో అంతర్యమేంటి..?

కార్యకర్తలను కాపాడుకోవడం కోసమేనా..? నిజంగా ప్లాన్-బీ ఉందా..?

0

పొంగులేటి నిర్ణయమేంటి..?

== ఆయన మాటలో అంతర్యమేంటి..?

== నిర్ణయం తీసుకున్నారా..? తీసుకోబోతున్నారా..?

== ప్రజలను ఒప్పించే ప్రయత్నమా..? మెప్పించే ప్రయత్నమా.?

== కార్యకర్తలను కాపాడుకోవడం కోసమేనా..? నిజంగా ప్లాన్-బీ ఉందా..?

== ఆత్మీయ సమ్మెళనం సక్సెస్ తో జోష్ లో పొంగులేటి..?

== అయోమయలో పొంగులేటి అనుచరులు

 (ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

పొంగులేటి నిర్ణయం తీసుకున్నారా..? తీసుకోబోతున్నారా..? పార్టీని వీడేందుకు ప్రయత్నం చేస్తున్నారా..? చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా..? ప్రజలను, అభిమానులను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారా..? మెప్పించే ప్రయత్నం చేస్తున్నారా..? రాజకీయ వేగం పెరుగుతున్న నేపథ్యంలో కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారా..? నిజంగా కాపాడుకునే పనిలో పడ్డారా..? పొంగులేటి ఆలోచనేంటి..? వ్యూహమేంటి..? దూకుడు పెంచుతున్నట్లే కనిపిస్తున్నారు..? అంతలోనే చల్లబడుతున్నారు..? జడ్ స్పీడ్ తప్పదని చెబుతూనే ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు..?

allso read- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు..

అవమానాలు భరించలేకపోతున్నామని అంటూనే అందరు సమన్వయం పాటించండి అంటూ పిలుపుస్తున్నారు..? అసలు పొంగులేటి వ్యూహమేంటి..? ఆయన ఏం చేయబోతున్నారు. పోరుబాటను వెంచుకుంటున్నారా..? ప్రభుత్వబాటలోనే పయనం కొనసాగిస్తున్నారా..?ఏం చేయబోతున్నారు..? ఇవే ప్రశ్నలు.. ఇది గోల.. ఎక్కడ చూసిన ఇదేరచ్చ.. రాష్ట్ర వ్యాప్తంగా పొంగులేటి నామస్మరణ.. ఆయన ఏం చేయబోతున్నాడనే ఎదురుచూపులు.. మీడియా మొత్తం ఆయన ఇంటిముందుకు కాపాల కాచిన పరిస్థితి.. చివరికి బాణం వదిలినట్లే వదిలి మళ్లీ సర్దుకున్నట్లుగానే కనిపిస్తోంది. ఫలితంగా దూరప్రాంతాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలు నైరాశ పడుతున్నప్పటికి అధినాయకుడు వ్యూహమేంటో ఎవరికి అర్థం కావడంలేదంటున్నారు.. చాలామంది తలలు బాదుకుంటన్నారు.. అసలు ఆయన దారేటో..? ఆయనేం తలుచుకుంటున్నారో..? ఆయన మదిలో ఏముందో.. విజయం తెలుగుదినపత్రిక ప్రత్యేక కథనం..మీ కోసం..

చల్లకు వచ్చి ముంత దాగినట్లు ఉంది మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి.. చాలా రోజుల తరువాత కుండబద్దలు కొట్టే ప్రయత్నం చేసిన.. మళ్లీ నాన్చుడు దోరణే కనిపించింది.. ఇక చాలు అంటూనే కొద్ది రోజులు తప్పదంటూ చల్లబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నూతన సంవత్సరం సందర్భంగా ఖమ్మంలోని తన నివాసంలో ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా జన సమీకరణ చేశారు. ఆయా నియోజకవర్గ బాధ్యులు సంపూర్ణ బాధ్యతలను చేపట్టి జనసమీకరణ చేసే పనిలో నిమగ్నమైయ్యారు. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమం సూపర్ సక్సెస్ అయ్యింది. వేలాధి మంది తరలివచ్చి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

allso reaad- బీఆర్ఎస్ లో విందు రాజకీయం..

బుకేలు ఇస్తూ, కేక్ లను కట్ చేశారు. వచ్చిన ప్రతి ఒక్కర్ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అప్యాయతగా పిలిచి పలకరించి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపి, స్వీట్ తినిపించారు. ఒకానోక దశలో అభిమానుల తాకిడికి పొంగులేటి భరించలేకపోయారు. ఇంటి నుంచి అభిమానులతో బయటకు వచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అంతటి జనసందోహంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసం నిండిపోయింది. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆనందంతో తప్పిబ్బుబ్బిపోయినట్లే కనిపించింది.

== హాట్ హాట్ గా పొంగులేటి వ్యాఖ్యలు

నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా జరిగిన ఆత్మీయ సమ్మెళన కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేసిన హాట్ హాట్ వ్యాఖ్యల పట్ల తీవ్ర చర్చాంశనీయమైంది. ఎక్కడ చూసిన ఆయన చేసిన వ్యాఖ్యలు గురించే మాట్లాడుతున్నారు. ఆయన తెలిసి అన్నాడా..? లేదా వచ్చిన జనంను చూసి సంతోషంతో అన్నారా..? తెలియదు కానీ.. రాజకీయంలోనే హాట్ టాఫిక్ గా మారిపోయారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో పెద్ద దుమారమే లేపుతుందనే చెప్పాలి.. అది ఎలా సాధ్యమవుతుందో..? ఆయన ఆలోచనేంటో తెలియదు కానీ.. ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్ర చర్చకు దారితీసింది.. పొంగులేటి చేసిన వ్యాఖ్యలను రాజకీయ విశ్లేషకులకు కూడా అందని విధంగా ఆయన ప్రకటన చేశారు. అది ఎలా సాధ్యమని రాజకీయ విశ్లేషకులే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలేంటి..?

== సంచలన వ్యాఖ్యలు చేసిన పొంగులేటి

నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కొన్న సంచలన ప్రకటనలు చేశారు. మనమంతా ఐక్యంగా ఉన్నాం.. మనం ఏ తప్పు చేయలేదు.. అయినప్పటికి ఇబ్బందులు పెట్టారు.. అవమానాలు చేస్తున్నారు.. అయిన భరించాము.. ఇక మనకు అవసరం లేదు.. భరించాల్సిన అవసరం అంతకంటే ఎక్కువ లేదు..

allso read- తుమ్మల కోసం కదిళన జనం

కొద్ది రోజులు ఓపికతో ఉండండి.. అన్నింటికి నేనే సమాధానం చెబుతా అని పొంగులేటి బహిరంగ వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా మరో హాట్ హాట్ ప్రకటన చేసి అటు రాజకీయ నాయకులకు, ఇటు జర్పలిస్టులకు, మరో వైపు అభిమానులకు పనికల్పించాడు. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తున్నాని ప్రకటించారు. సీటు గురించి చర్చించకుండా, సీఎం కేసీఆర్ పేరు ప్రకటించకుండా ఆయనే స్వయంగా తన సీటును ప్రకటించుకున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేను పోటీ చేస్తున్నానని, అంతే కాకుండా నాతో పాటు నా పక్కనే ఉన్న ముఖ్య నాయకులందరు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అధికార పార్టీలో పెద్ద దుమారమే లేపుతుందనే చెప్పాలి.

== ఎలా సాధ్యం

తాను దూర సందులేదు.. మెడకేమో డోలా రమణమ్మ అన్నట్లుగా ఉంది పొంగులేటి పరిస్థితి. తాను పోటీ చేసేందుకు స్థానమే లేదు.. పైగా ఆయన అనుచరులు కూడా పోటీ చేస్తారని ప్రకటించిన  అసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారాన్ని లేపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 8 స్థానాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కల్గిన మధిర, భద్రాచలంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగిలిన 8 స్థానాల్లో మూడు జనరల్ స్థానాలైనప్పటికి అందరు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. పొంగులేటికి కొత్తగూడెం మినహా ఎక్కడ ఖాళీ లేదు. కొత్తగూడెంలో కూడా వనమా వెంకటేశ్వరరావు ప్రస్తుతం ఎమ్మెల్యే పనిచేస్తున్నారు.

allso read- రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలిః పొంగులేటి

ఆయనపై, ఆయన కుమారుడిపై ఆరోపణలు ఉన్నప్పటికి సీటుపై పట్టు సాధించే అవకాశం ఉంది.. అలాగే ఇప్పటికే ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు అక్కడే ఉన్నాడు. ఒకానోకదశలో కొత్తగూడెం నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం మాత్రమే ఉంది.  ఇంకా ఎక్కడ కూడా అవకాశం లేదు. అయినప్పటికి నేను, నాతో పాటు నాయకులందరు పోటీ చేస్తారని ప్రకటించడమేంటని ఆయన వర్గీయులు తలలు బాదుకుంటున్నారు. ఆయనకే పోటీకి ఖాళీ లేని పరిస్థితుల్లో ఆయన తో తిరిగే నాయకులు ఎలా పోటీ చేస్తారో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరించలేదు.. కానీ ఒక ఇంటూ మాత్రం అభిమానులకు, పార్టీ నాయకులకు, ఆయన వర్గీయులుకు, రాజకీయ విశ్లేషకులకు ఇచ్చారనే చెప్పాలి.

== పొంగులేటి వ్యాఖ్యలు వెనక అంతర్యమేంటి..?

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన రాజకీయ వ్యాఖ్యలు చాలా హాట్ టాఫిక్ గా మారిపోయాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక అంతర్యమేంటో..? ఎవరికి అర్థం కావడం లేదు.  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతున్నడా..? పార్టీ మారకుండా వేచి చూసే దోరణిలో ఉన్నారు. దీంతో కార్యకర్తలు చేజారిపోకుండా, ఇతర పార్టీలో చేరకుండా కట్టుదిట్టం చేసేందుకు ఈ సెంటిమెంట్ ను పులిహోరా కలిపినట్లు కలుపుతున్నారని కొంత మంది ఆశావాహులు చెబుతున్నారు. అయితే ఆయన వ్యాఖ్యలు వెనక  ఓ రహస్యమే దాగి ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో స్థానం దొరకడం కష్టంగా ఉన్న సందర్భంలో ఆయన వర్గీయులకు టిక్కెట్లు వచ్చే అవకాశం బీఆర్ఎస్ పార్టీలో లేనే లేదు. అందుకే ఆయన ఫ్లాన్ బీ ని అమలు చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆయన ఇప్పటికే ఆ పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. అందుకు గాను ఆయనకు అత్యంత దగ్గరుండే సన్నిహితులను కలిసి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇక ఆయనకు రాజకీయ గురువైన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఆయన కొన్ని సలహాలు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.అంతే కాకుండా ఆయనకు అత్యంత సన్నిహితులు, జర్నలిస్టులతో కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. చూద్దాం ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో..? రాబోయే రోజుల్లో ఏ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నారో..? వేచి చూడాల్సిందే..?

(ప్లాన్ –బీ  ఎంటో..? రేపటి సంచికలో చూద్దాం)