Telugu News

“మట్టా” పయనమెటో….?

ఒకే ఒక్క ఛాన్స్ నినాదం మట్టాను  గట్టేక్కిచేనా*

0
“మట్టా” పయనమెటో….?
== మనసున్న మారాజుగా నియోజవర్గంలో గుర్తింపు*
== సౌమ్యుడు,వివాద రహితుడిగా ముద్ర
== వైద్య రంగంలో  ఆ కుటుంబ సేవలపై అభిమానం
== ఒకే ఒక్క ఛాన్స్ నినాదం మట్టాను  గట్టేక్కిచేనా*
(సత్తుపల్లి- విజయం న్యూస్)
రాజకీయాలు ఆ కుటుంబానికి కొత్తకాదు,సేవ చేయటం ఆ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య,ఆఫద అంటే అర నిముషం ఆలోచించని మనస్సు వారిది,అమ్మ,నాన్నల నుండి దయానంద్ రాజకీయ వారసత్వాన్ని అందుకుని, సత్తుపల్లి రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు.2014 ఎన్నికల్లో వైయస్సార్సీపి పార్టీ నుంచి పోటీ చేసి స్వల్ప  ఓట్ల తేడాతో ఓటమి చెందారు ,ఆనాటి నుండి ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల కష్ట,సుఖాలలో పాలుపంచుకుంటూ ప్రతి ఇంటిలో తన ముద్రను వేసుకుంటున్నారు. దాదాపు  పది సంవత్సరాల నుండి పదవులున్నా,లేకున్నా అందే అకుంఠిత దీక్షతో, తనని నమ్మిన నాయకులు,కార్యకర్తల కోసం,తాను నమ్మిన పార్టీ కోసం అహర్నిషలు శ్రమించారు. బి ఆర్ ఎస్ పార్టీలో అడుగడుగా అవమానాలు ఎదురైనా ఏదో ఒక మూలన ఉన్న  చిన్న ఆశతో అనునిత్యం పార్టీ కోసం పనిచేశాడు, కష్టపడ్డాడు.
కానీ పార్టీలో ఎటువంటి గుర్తింపు లేకపోవడం, పదవులు రాకపోవడంతో  అసంతృప్తిగా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తనకు జరుగుతున్న అవమానాలను తాను భరిస్తున్నా తనను నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలు ,ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావటంతో  ఏమి చేయాలో పాలు పోనీ పరిస్థితులలో  డాక్టర్ మట్టా దయానంద్ రాజకీయ భవిష్యత్తును ప్రస్తుతం అంధకారంలో ఉంచారు. ఈ సందర్భంలో ప్రజలు గత కొన్ని రోజులుగా డాక్టర్ మట్టా దయానంద దారెటూ అంటూ ప్రశ్నించుకుంటున్నారు. మరికొందరైతే దయానంద్ ఈ పార్టీలోకి పోతే గెలుపు పక్క అంటూ లెక్కలు వేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో  ఆయన,లేదా ఆయన  సతీమణి డా.మట్టా రాగమయిలు ప్రజాక్షేత్రంలో ఉంటూ పట్టు సాధించి, గెలుపొందాలనే లక్ష్యంతో, ప్రజల్లో నిరంతరం తిరుగుతూ ప్రజల కష్ట,సుఖాలలో పాలు పంచుకుంటున్నారు. ఒకే  ఒక్క ఛాన్స్ అంటూ డాక్టర్ దయానంద్ ఈసారి ప్రజల్లోకి వెళ్లి తన గెలుపును పక్కా చేసుకోవాలని తాను గెలిస్తే పేద ప్రజలకు ఏమి చేస్తాడో చెప్పి మరి చేస్తాడని ఆయన అనుచరులు గంటాపదంగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే పలు రాజకీయ పార్టీల అదినేతలు ఆహ్వానించినప్పటికీ, ఇప్పుడున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆయన ఆచి, తూచి అడుగులు వేస్తున్నారు.
మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరుడుగా వ్యవహరిస్తున్న డాక్టర్ దయానంద్, ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాల అనుసరించి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, వైయస్సార్ టీపి , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అడుగుజాడల్లో నడిచి సత్తుపల్లి నియోజకవర్గంలో తమ సత్తా చాటుకునేందుకు విశేష కృషి చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం, సత్తుపల్లి నియోజకవర్గంలో తమ సామాజిక వర్గంతో పాటు ఆయన సతీమణి సామాజిక వర్గం ఓట్లతోపాటు ముస్లిం మైనార్టీ, పేద ప్రజల్లో ఎక్కువ ఆదరణ గల నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నేతగా చెప్పుకోవచ్చు, రాబోయే ఎన్నికల్లో మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీలో చేరి సత్తుపల్లి అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం, సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి  లో వరుసగా మూడు ఓటమిల చవి చూడటంతో, నాలుగో సారి  బలమైన అభ్యర్థిని రంగంలో దించి ఖమ్మం జిల్లాలో కంచుకోటగా ఉన్న సత్తుపల్లి నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆలోచనలో ఉన్నట్లు వ సమాచారం, రాబోయే ఎన్నికల్లో డాక్టర్ దయానంద కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే, ప్రస్తుత ఎమ్మెల్యేకి గట్టి పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రతి మండలంలో నాలుగైదు సార్లు పర్యటించి, గడప,గడపను తాకారు దయానంద్, రాబోయే ఎన్నికల్లో సత్తుపల్లిలో దయానంద్ సత్తా చాటాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు, ఈసారి సత్తుపల్లి నియోజకవర్గంలో డాక్టర్ మట్టా దయానంద్ తన ఉనికిని కాపాడుకుంటూ, తన తల్లిదండ్రులు తనకిచ్చిన రాజకీయ వారసత్వాన్ని జెండా ఎత్తి నిలబెడతారని అటు ప్రజలు ఇటు ఆయన అభిమానులు గట్టిగానే చెప్పటం విశేషం.