జోస్యం చెప్పిన నామ..ఏమన్నరంటే..?
విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ, ఎంపీ నామ నాగేశ్వరరావు
జోస్యం చెప్పిన నామ..ఏమన్నరంటే..?
== వచ్చేది ఆ ప్రభుత్వమే: నామ
➡️ విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ, ఎంపీ నామ నాగేశ్వరరావు
తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 27(విజయం న్యూస్):
మండలంలోని పిండిప్రోలు గ్రామంలో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , ఎమ్మెల్సీ మధు తో తో కలసి ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రాంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నామ మాట్లాడుతూ గతంలో తిరుమలాయపాలెం మండలంలోని కరవు పరిస్థితులను ఎంతో దగ్గరగా చూశానన్నారు.
ఇది కూడా చదవండి:- కొండా లక్ష్మణ్ బాపూజీ కి నామ ఘన నివాళి
నామ ముత్తయ్య ట్రస్ట్ ద్వారా ట్యాoకర్లతో గ్రామాల్లో మంచినీటిని అందించి, కష్ట కాలం లో ప్రజలకు అండగా ఉన్నామని తెలిపారు. చెప్పారు .సీఎం కేసీఆర్ పాలనలో ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి తెలంగాణా లో జరిగిందన్నారు. తొమ్మిదేళ్లలో ఎవరూ ఊహించనంత అభివృద్ధిని కేసీఆర్ చేసి, చూపించారని పేర్కొన్నారు. గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని కేసీఆర్ సాకారం చేశారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంచినీళ్లు, సాగు నీరు, కరెంట్ కోసం నిత్యం సబ్ స్టేషన్ల వద్ద , ఊళ్ళల్లో ధర్నాలు జరిగేవన్నారు. నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. కాళేశ్వరం, భక్త రామదాస్,పాలమూరు -, రంగారెడ్డి, తదితర ప్రాజెక్టులతో రాష్ట్రం సస్యశ్యామలమైందన్నారు.
ఇది కూడా చదవండి:- గణేష్ ఉత్సవ కమిటీకి ఎంతో చరిత్ర ఉంది : నామ
అతి త్వరలో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా సంపూర్ణoగా సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. వచ్చేది బీఆర్ ఎస్ ప్రభుత్వమేనని, అందులో డౌటే లేదని నామ అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, ఎమ్మెల్సీ తాతా మధు, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఎంపీపీ బో డ మంగీలాల్, గ్రామ సర్పంచ్ నామ ప్రసాద్, ఎంపీటీసీ పి. వెంకటేశ్వర్లు, సొసైటీ చైర్మన్ చావా వేణుగోపాల్, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిలక్కాయలపాడు రోడ్డుకు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
🔶 పలు కుటుంబాలకు ఎంపీ నామ, మధు పరామర్శ
👉 బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు బుధవారం ఖమ్మం నగరం, పాలేరు నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటించి, పలు కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో ఇటీవల చనిపోయిన కమ్మకోమటి మన్మధరావు కుటుంబాన్ని ఎమ్మెల్సీ మధు తో కలసి పరామర్శించారు.
ఇది కూడా చదవండి:- పాలేరులో బీఆర్ఎస్ గెలుపు తథ్యం: మంత్రి పువ్వాడ
పాపాయిగూడెం లో సర్పంచ్ నామ ప్రసాద్ తల్లి వెంకటరావమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి, శ్రద్ధాంజలి ఘటించి, నివాళి అర్పించారు .జూపెడలో సర్పంచ్ లంజపల్లి మోహినమ్మ కుటుంబాన్ని ,తాళ్లచెరువు లో మాజీ ఎంపీటీసీ వాలూరి దామోదర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పాపాయిగూడెం లో సర్పంచ్ నామ ప్రసాద్ ఇంటికెళ్లి,వృద్దాప్యంలో ఉన్న నామ తులశమ్మను , తాళ్లచెరువు లో ఇటీవల చనిపోయిన నారాయణ ఇంటికెళ్లి , కౌశల్యమ్మ ను పరామర్శించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ తాతా మధు, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, పార్టీ మండల అధ్యక్షులు భాషబోయిన వీరన్న,పార్టీ వైరా మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, చిత్తారు సింహాద్రి యాదవ్, మోరంపూడి ప్రసాద్, నామ సేవా సమితి సభ్యులు చీకటి రాంబాబు, కృష్ణ ప్రసాద్, శింగవరపు నరేష్, చాపలమడుగు సన్నీ, వీసం మురళి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.