రోడ్డుపై చెత్త ఏంటి..? మంత్రి పువ్వాడ ఆగ్రహం..
== చెత్త ఎందుకు ఉంది..తక్షణమే చర్యలు తీసుకోవాలి
== ఖమ్మం నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచాలని సూచన.
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
వేల కోట్ల రూపాయలతో ఒక పక్క ఖమ్మం నగరాన్ని అభివృద్ది, సుందరరీకరణ చేస్తుంటే మీరు ఓ పక్క రోడ్లను చెత్త మయంగా మార్చడం ఏంటని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లను విస్తరించి ప్రజా రవాణాను మెరుగు చేస్తుంటే ఇలా రోడ్లపై చెత్త కుప్పలు పేర్చి మీ వ్యాపారం చేసుకుని వెళ్లిపోతే దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఖమ్మం నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మర్చామని ఆ సంస్కృతికి మనం కలిసి కట్టుగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మున్సిపల్ కార్మికులు ప్రతి రోజు రోడ్లను ఎంటి కష్టించి శుభ్రం చేస్తున్నారని, మీరు ఇలా చేయడం సరికాదన్నారు. ఇది మన ఊరు, మన ప్రాంతం పరిశుభ్రత పై మనకు బాధ్యత ఉండాలి అలానే ప్రజలు, చిరు వ్యాపారులు కూడా తమ వంతు సహకారం అందించాల్సింది పోయి ఇలా రోడ్డుపై ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదని, మీకోసం ప్రత్యేకంగా వ్యాపార సముదాయాలు ఎర్పాటు చేయడం జరిగిందని, వాటిని వినియోగించుకోవాలని సూచించారు.
allso read- ఖమ్మంలో నాడు దుర్వాసన..నేడు సువాసన: మంత్రి పువ్వాడ