Telugu News

తెలంగాణ పై మీ హక్కు ఎంటీ..?: తాతామధు

 అరుణ్ కుమార్ కి, సజ్జల రామకృష్ణ రెడ్డికి ఏం తెలుసుకు ఉద్యమం గురించి

0

తెలంగాణ పై మీ హక్కు ఎంటీ..?: తాతామధు

== తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టోద్దు..?

== అరుణ్ కుమార్ కి, సజ్జల రామకృష్ణ రెడ్డికి ఏం తెలుసుకు ఉద్యమం గురించి

== తెలంగాణ బలిదానాల ఉసురు తగలడం ఖాయం

== తెలంగాణ ఆత్మగౌరంతో చెలగాటం ఆడేందుకు ప్రయత్నిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు..

==  బీజేపీ నాయకులు ఆడే ఆటలో ఆంధ్ర నాయకులు పావులుగా మారకండి

== విలేకర్ల సమావేశంలో ఏపీ నాయకులపై మండిపడిన ఎమ్మెల్సీ  తాతామధు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 8ఏళ్లు గడిచింది.. వందలాధి బలిదానాల అనంతరం మాత్యాగాల ఫలితంగా, మా సీఎం కేసీఆర్ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది..  మా ప్రభుత్వం అద్భుతంగా పాలిస్తోంది.. ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు.. మా పరిపాలనను చూసి ఓర్వలేని ఏపీ నాయకులు మళ్లి సమైఖ్యరాష్ట్రం కావాలని పాట పాడటం విడ్డూరంగా ఉందని, తెలంగాణపై వాళ్ల పెత్తనమేందని ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాతామధుసూదన్ అన్నారు. ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ & ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్రాలను కలపాలంటూ దుర్మార్గపు వ్యాఖ్యలు చేసిన ఉండవెల్లి అరుణ్ కుమార్, సజ్జల రామకృష్ణ రెడ్డిల తీరుపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. కేంద్రంలోని బీజేపీ నాయకులు ఆడిస్తున్న ఆటలో ఆంధ్రప్రదేశ్ నాయకులు కీలుబొమ్మగా మారవద్దని హితవు పలికారు.

ఇది కూడా చదవండి: ‘టీఆర్ఎస్’ కాదు.. ఇక ‘బీఆర్ఎస్’

విడిపోయి ప్రశాంతంగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ములుగా ముందుకు సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం పై కుట్రలు చేస్తున్న కేంద్ర బీజేపీ నాయకుల కుట్రలో భాగంగా కొందరు నాయకులు రాష్ట్ర ప్రజల్లో ఆందోళన కలిగించే విధంగా తప్పుడు సంకేతాలు రేకెత్తించే విధంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని తెలిపారు. విభజన చట్టంలో ఉన్న హామీల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి లాభం చేకూర్చే విధంగా దోహద పడండి అంటూ హితవు పలికారు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీల కోసం కేంద్ర పై పోరాటానికి తెలంగాణ బిడ్డలు సైతం అండగా నిలుస్తుందని తెలిపారు. నిత్యం తెలంగాణపై కుట్రలు చేస్తున్న బీజేపీ నాయకులు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించలేరని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంపై ఏ మాత్రం ప్రేమ ఉంటే కేంద్రంలోని బీజేపీ వారి చిత్తశుద్ధి చాటుకోవాలని రాముడి పేరుతో రాజకీయం చేసే బీజేపీ నాయకులు భద్రాద్రి రాముడి గుడి అభివృద్ధి కొరకు 1000 కోట్లు కేటాయించి తెలంగాణ పై ఉన్న ప్రేమను చాటుకునే దమ్ము ఉందా ?అని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ దే : మంత్రి పువ్వాడ అజయ్

అన్యాయంగా ఆంద్రప్రదేశ్ లో కలిపిన ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో విద్యుత్ 24 గంటలు అందించట్లేదని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్న బండి సంజయ్ గుజరాతి వ్యామోహంలో ఉన్నారని, నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతున్న కరెంటు తీగలను పట్టుకునే ధైర్యం బండి సంజయ్ కి ఉంటే తెలంగాణలో విద్యుత్ సరఫరా ఉందో లేదో తెలుసుకోవచ్చని తెలిపారు .ఈ కార్యక్రమంలో వారి వెంట డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం గారు, జిల్లా రైతు సమన్వయ అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వర్లు గారు, మాజీ జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఖమర్ గారు, తెలంగాణ ఉద్యమకారులు శేషు గారు మరియు తదితరులు పాల్గొన్నారు.