Telugu News

నా బిడ్డ ఏం అన్యాయం చేసింది : విజయమ్మ

ఉదయించే సూర్యుడు షర్మిళ

0

నా బిడ్డ ఏం అన్యాయం చేసింది : విజయమ్మ

== ఉదయించే సూర్యుడు షర్మిళ

(ఖమ్మం-విజయంన్యూస్)

వైఎస్ షర్మిళ తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తుంటే అడుగడుగున అడ్డంకులు సృష్టించిన ప్రభుత్వం కార్యకర్తలను, నాయకులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని విజయమ్మ ఆరోపించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం, కరుణగిరి సమీపంలో వైఎస్ షర్మిళ నివాస గ్రుహంతో పాటు క్యాంఫ్ కార్యాలయం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, వైఎస్ షర్మిళ, వైఎస్ విజయమ్మ ప్రత్యేక ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం జిల్లాకు వచ్చిన షర్మిళమ్మ, వైఎస్ విజయమ్మకు పాలేరు వద్ద పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఖమ్మంరూరల్ మండలం కరుణగిరి వద్దకు చేరుకున్న షర్మిళ, విజయమ్మలకు పార్టీ నాయకులు అపూర్వ స్వాగతం పలికారు.

ఇదికూడా చదవండి: షర్మిల టీమ్ కు ఏమైంది

అనంతరం నేరుగా పూజ కార్యక్రమానికి వచ్చిన షర్మిళ, విజయమ్మలు పూజలో పాల్గొన్నారు. అనంతరం సర్వమతప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో షర్మిళ మాట్లాడుతూ ఎన్నో సార్లు నా బిడ్డలపై అక్రమ కేసులు పెట్టారు,  లాఠీచార్జీ చేశారు, అడ్డుకున్నారు, నెట్టేశారు, జైలుకు పంపించాలని బయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డ ఏం పాపం చేసిందని ప్రభుత్వం అడుగడుగున అడ్డంకులు పడుతున్నారని అన్నారు.  కేసులు, జైలు మాకు కొత్తేమి కాదని,  ప్రజల కోసం ఎన్ని రోజులైన కేసులకు వెళ్తామని అన్నారు. కేసులు పెట్టించి జైళ్లకు పోయిన పార్టీలు ఇప్పుడు ఎక్కడున్నాయో ప్రజలందరికి తెలుసని అన్నారు. ఉదయించే సూర్యుడు షర్మిళమ్మ అని, అరచేతిని అడ్డంపెట్టి సూర్యుడ్నిఆపాలనుకోవడం మూర్ఖత్వమని అన్నారు. షర్మిళ కు కష్టపడి పనిచేసే తత్వం ఉందని,  రాజశేఖర్ రెడ్డి రక్తంతో పుట్టిన బిడ్డ ఆమె.. మాట ఇవ్వడమే కానీ తప్పడం లేదని అన్నారు. షర్మిళను ప్రజలందరు దీవించాలని కోరారు. ప్రజల కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తుందని, ప్రజల సంక్షేమమే ఆమెకు ప్రాణామని అన్నారు.  ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్ చార్జ్ పిట్టా రాంరెడ్డి, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ గడిపల్లి కవిత, జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుదీర్, నాయకులు కెకెడి, క్రిష్ణమోహన్ తదితరులు హాజరైయ్యారు.

ఇక నుంచి  ‘ఇది నా అడ్డా..’:షర్మిళ