Telugu News

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు పంటకు గిట్టుబాటు ధర: సంభాని

ఇంటి నిర్మాణానికి 5 లక్షల: సంభాని️ 

0

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు పంటకు గిట్టుబాటు ధర: సంభాని

== ఇంటి నిర్మాణానికి 5 లక్షల: సంభాని️ 

️ == రైతుకు పెట్టుబడికి ఎకరాకు 15000 ఆర్థిక సహాయం

️ == కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగానే 500 లకే గ్యాస్ సిలిండర్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

20వ రోజు సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలంలో కొనసాగుతున్న  హాథ్ సే హాథ్ జోడోయాత్ర లో భాగంగా ఏఐసీసీ సభ్యులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్ లచ్చన్నగూడెం, చిన్న మల్లేల  గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై చేయి చేయి కలుపుతూ ప్రతి గడపను తట్టుతూ అడుగు ముందుకేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీమంత్రి సంభాని గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.బీఆర్ఎస్ పార్టీ మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారాన్ని దక్కించుకొని ప్రజల సంక్షేమాన్ని తుంగలో తొక్కారు అని బిఆర్ఎస్ పై మాజీమంత్రి సంభాని విరుచుకుపడ్డారు.

ఇది కూడా చదవండి: ఏకకాలంలో 2 లక్షలు రైతు రుణమాఫీ: రాయల 

దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని… డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని , రైతు రుణమాఫీ చేస్తామని మోసం చేశారు, అలాగే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా, ప్రభుత్వ అక్రమాలుతో నోటిఫికేషన్లు రద్దు చేస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఇకపై మోసపోవద్దని కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని, ప్రతి సంక్షేమ పథకాన్ని కాంగ్రెస్ నిర్వర్తిస్తుందని తెలియజేస్తూ, ప్రజాసమస్యలను తెలుసుకుంటూ వారి కష్టాలకు భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో రాబోయేది రైతురాజ్యమని, ఉత్సాహం నింపారు, బానిసలుగా బతుకుతున్న ప్రజల బతుకులు మారే రోజులు ఆసన్నమైందని ప్రజలతో తేల్చి చెప్పారు. నియంత్రత్వ, అవినీతి పాలన అంతమొందించే సమయం ఆసన్నమైందని ఇక కొద్ది రోజులు సమయం మాత్రమే ఉందని వచ్చేది కాంగ్రెస్ రాజ్యమేనని భరోసానిచ్చారు. బిఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు కష్టాల్లో ఉన్నారని ప్రభుత్వ నిర్లక్ష్యంతో సంక్షేమ పథకాలు అమలు కాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సంభాని చంద్రశేఖర్ గారు ప్రతి గడప గడపకు తిరుగుతూ భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలో వస్తుంది అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరుతుందని తెలియజేశారు. టిఆర్ఎస్ పాలనతో విసుగు చెందిన ప్రజల కష్టాలను తెలుసుకుంటూ యాత్రలో ముందుకు సాగుతుండగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

ఇది కూడా చదవండి: ఖమ్మం మార్కెట్ లో మిర్చికి రికార్డ్ ధర

ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు బైరెడ్డి మనోహర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పుచ్చకాయల సోమిరెడ్డి, వేంసూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి, కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి రావుల పుల్లారావు, సర్పంచ్ ప్రేమలత సర్పంచ్, యూత్ కాంగ్రెస్ ఇజ్జగాని మధు, కోట సత్యనారాయణ,లాజర్, తుమ్మూరు లక్ష్మారెడ్డి, ప్రతాప్ రెడ్డి, సత్యనారాయణ, తోండపు నరసింహా రావు కందిమళ్ళ వెంకటేశ్వరరావు, పుచ్చకాయల రాజేశ్వరరావు, మామునురి రామకృష్ణ, వెలిగినేని రాజేశ్వరరావు, నాగేశ్వరరావు, అశోక్, గజ్జెల్లి శ్రీను, శివ, పోతురాజు నరేంద్ర ఇతర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.