Telugu News

మంత్రి తుమ్మల పై దాడికి కుట్ర..?

కుట్ర చేసిందెవరు..? పన్నాగం లో పాత్ర ఎవరిది.?

0
మంత్రి తుమ్మల పై దాడికి కుట్ర..?
== కుట్ర చేసిందెవరు..? పన్నాగం లో పాత్ర ఎవరిది.?
== ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వద్ద రెక్కీ..? 
== అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాడికి కుట్ర.
== పోన్ ట్యాపింగ్ వార్ రూం ఏర్పాటు
==  మామిడి తోటలోనే దాడికి పథకం
== మాజీ మంత్రి, పోలీస్ మాజీ ఉన్నతాధికారి పాత్ర పై సర్వత్రా చర్చ..
== మాజీ మంత్రి పై అనుమానాలు వ్యక్తం చేస్తున్న తుమ్మల అనుచరులు
== నేలకొండపల్లి మండలం ముఠాపురం మామిడితోటలో పోన్ ట్యాపింగ్ వార్ రూం అంటూ ప్రచారం
==  భగ్గుమంటున్న తుమ్మల అనుచరులు.*మ
== దాడి కుట్ర పాత్ర ధారులు సూత్ర ధారులను శిక్షించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్.
(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై హత్య కుట్ర అనే ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. మామిడి తోటలో పోన్ ట్యాపింగ్ ఏర్పాటు కేంద్రంగా ఆయనపై కుట్ర పన్నినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.. రాజకీయ పదవుల కోసం దాడి కుట్రలు చేసుకోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీపై మండిపడుతున్నారు. కుట్రకు పాత్రధారులు, కుట్రదారులను పట్టుకోవాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి తుమ్మల ను టార్గెట్ చేసింది ఎవ్వరు..?.దాడికి ఎక్కడ పథకం పన్నారు? ఎలా రెక్కీ చేసారు? సూత్రధారలు ఎవ్వరు? పాత్రధారులు ఎవ్వరు ? రాజకీయాల్లో సంచలనంగా మారిన  తుమ్మల నాగేశ్వరరావు పై జరిగిన దాడి కుట్ర పై “విజయం” పత్రిక ప్రత్యేక కథనం..
అభివృద్ధి ప్రదాత పేరుగాంచి,  తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో తనదంటూ బ్రాండ్ ఏర్పాటు చేసుకున్న డైనమిక్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు.. ప్రతి ప్రభుత్వంలో మంత్రిగా,  అందరు ముఖ్యమంత్రుల మంత్రివర్గంలో కీలక మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు దేశ వ్యాప్తంగా పేరున్న లీడర్.. పరిచయం అక్కర్లేని నేత ఆయన. నాలుగు దశాబ్థాల రాజకీయ జీవితం ఆరు సార్లు ఎమ్మేల్యేగా ఐదు సార్లు మంత్రిగా పని చేస్తూ రికార్డ్ సృష్టించాడు.  ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్, ప్రస్తుతం రేవంత్ రెడ్డి క్యాబినేట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసారు. రాజకీయాల్లో అజాత శత్రువుగా, అందరివాడిగా, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ తుమ్మల నాగేశ్వరరావు
హత్యలతో స్మారక స్థూపాలు వద్దు.. అభివృద్ధి శిలాఫలకాలు ఉండాలని ఆదర్శ రాజకీయాలకు బాటలు వేసారు తుమ్మల…కానీ అలాంటి తుమ్మలపై హత్య కుట్ర అనే ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. తుమ్మల పై రాజకీయంగా గెలవలేక ప్రజానేతగా ఉన్న తుమ్మల ను ఎన్నికల రంగంలోంచి తప్పించాలనే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు.నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం ఆయనది. నాడు  ఎన్టీఆర్ రాజకీయ జన్మనిస్తే తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఎదిగారు.1985, 1994, 1999 లో సత్తుపల్లి ఎమ్మేల్యేగా గెలిచి ఎన్టీఆర్ చంద్రబాబు క్యాబినేట్ లో మంత్రిగా పని చేసిన తుమ్మల ఆ తర్వాత పునర్విభజన  తరువాత కేసీఆర్ తొలి క్యాబినేట్ లో ఎమ్మెల్యే గా గెలవక పోయినా మంత్రిగా నియామకం అయ్యి సంచలనంగా గా మారారు.2014 సెఫ్టెంబర్ 5 న కేసీఆర్ ఆహ్వానం తో టీఆర్.ఎస్ లో చేరారు.అదే ఏడాది డిసెంబర్ 16 న మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసారు..తెలుగుదేశం లో తిరుగులేని నేతగా ఉన్న తుమ్మల కేసీఆర్ వద్ద మొదటి టర్మ్ లో కూడా అదే పరపతి తో ఉన్నారు.2016 మే లో పాలేరు ఉప ఎన్నిక సందర్బంగా నాడు కాంగ్రెస్ ఎమ్మేల్యే గా ఉన్న పువ్వాడ అజయ్ వైఎస్.అర్.సీపీ ఎంపీ గా ఉన్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి టీఆర్.ఎస్ లో చేరారు.ఎమ్మేల్యే గా ఉన్న పువ్వాడ అజయ్ కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ తో సాన్నిహిత్యం తో తుమ్మల కు చెక్ పెట్టాలనే కుట్రకు పునాదులు పడినట్లు ప్రచారం జరిగింది. ఎలాగైనా తుమ్మల ని ఓడిస్తేనే కమ్మ సామాజిక వర్గ కోటాలో మంత్రి అవ్వొచ్చని పువ్వాడ ప్లాన్ చేసి  2018 ఎన్నికల్లో తుమ్మల ఓటమి కి కారణమయ్యారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.  నాయకులకు డబ్బు సంచులు ఇచ్చి క్రాస్ ఓటింగ్ తో తుమ్మల ను ఓడించారని, రాజకీయ వర్గాల్లో ఓపెన్ సీక్రెట్ గా మారింది. ఎన్నికల ఫలితాల తరువాత సాక్షాత్తు కేసీఆర్ మా కత్తితో మేం పొడుచుకున్నామని కీలక ప్రకనట చేసారు. ఓటమి తరువాత తుమ్మల కు కేసీఆర్ కు గ్యాప్ పెరిగి నాడు మంత్రి గా ఉన్న పువ్వాడ రాజకీయాలను తన గుప్పిట్లో ఉండేలా తుమ్మల ను అడ్డు తప్పించాలని కేటీఆర్ అండదండలతో తుమ్మల ను పార్టీ వీడేలా అనేక ఇబ్బందులు పెట్టినట్లు ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా ప్రకటించారు. దీంతో గౌరవం  లేని చోట ఇమడలేక తుమ్మల 2023 సెప్టెంబర్ 16 న కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్దిగా తుమ్మల రంగంలో దిగడంతో జిల్లాలో కాంగ్రెస్ కు యమ క్రేజ్ పెరిగింది. కాంగ్రెస్ గెలిసే పరిస్థితి ఉందని బీఆర్ఎస్ అగ్రనేతలు భావించారు. సర్వే రిపోర్ట్ కూడా అదే తేల్చింది.. దీంతో బీఆర్ఎస్ నేతలు కుట్రకు తెర లేపినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు గాను హైదరాబాద్ నుంచి రిమోట్ కంట్రోల్ తో ఖమ్మం జిల్లాలో దాడికి కుట్రకు ఫ్లాన్ చేసినట్లు దాడి కుట్ర ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
== మామిడి తోట కేంద్రంగా..
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ అంశం ఖమ్మం జిల్లాకు పాకింది..  దేశవ్యాప్తంగా సంచల రేపుతున్న వ్యవహారం ఇప్పుడు ఖమ్మం జిల్లాలో తాకటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముఠాపురం గ్రామంలో మాజీ మంత్రి అత్యంత సన్నితుడైన డాక్టర్ చెందిన మామిడి తోటలు కేంద్రంగా ఫోన్ టాపిక్ వ్యవహారం నడిచినట్లుగా చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే కేంద్రంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పై దాడికి కుట్ర పన్నినట్టుగా ఇటు సోషల్ మీడియాలో గాని అటు మీడియాలో వరుస కథనాలు వస్తుండడంతో ఖమ్మం జిల్లా రాజకీయ ముఖచిత్రం హాట్ హాట్ గా మారిపోయింది. నేలకొండపల్లిలోని మోటాపురం లో ఉన్నాం మామిడి తోటను కేంద్రంగా మలుచుకున్న కుట్ర దారులు అక్కడ ఫోన్ టాపింగ్ ద్వారా ఖమ్మం మార్కెట్ కేంద్రంగా చేసుకొని తుమ్మల నాగేశ్వరావు దాడి చేసేందుకు ప్రయత్నాలు చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. అసలు తుమ్మల నాగేశ్వరరావును టార్గెట్ గా చేసుకొని ఎందుకు కుట్రపడ్డారు అనే విషయం మీద ఒకవైపు ప్రజలు మరోవైపు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది.
== పాత్రధారులు ఎవ్వరు..?
చైతన్యవంతమైన జిల్లా, ఉద్యమాల ఖిల్లా, అలాంటి ఖమ్మంజిల్లాలో మంత్రిగా పని చేసిన అజయ్ కుమార్ అరాచకాలు చేస్తున్నారంటూ అనేక ఆరోపణలు ఉన్నాయి. .ఎన్నడు లేని విధంగా భూ కబ్జాలు సెటిల్ మెంట్స్ ఎక్కువయ్యాయని ప్రచారం జరిగింది. డీసీపీ స్థాయిలో ఉన్న ఓ పోలీస్ అధికారి,  నాటి మంత్రి అజయ్ అండదండలతో ప్రైవేట్ సైన్యం నడిపారని అనేక ఆరోపణలు ఉన్నాయి. ఖమ్మం తమ గుప్పిట్లో ఉండాలనుకున్న అజయ్ పై పోటీకి కాంగ్రెస్ తరపున రంగంలో ఉండే సరికి ఎన్నికల్లో గెలవాలంటే తుమ్మల ను ఎలాగైనా ప్రచారం నుంచి తప్పించాలని దాడికి కుట్ర చేసినట్లు, అందుకు ఓ మాజీ  పోలీస్ అధికారి సహాకరించినట్లు ప్రచారం జరుగుతోంది.
   పోలీస్ అదుపులో ఉన్న డిఎస్పీ  ప్రణీత్ రావు తో మాజీ మంత్రి నిత్యం టచ్ లో ఉండి ట్యాపింగ్ తో పాటు తుమ్మల పై దాడి చేసే కుట్ర పన్నినట్లు సమాచారం..స్వామి భక్తితో మాజీ డిసీపీ పోలీస్ డిపార్డ్ మెంట్ కు చెందిన హోంగార్డ్ లకు తో దాడి కి ప్లాన్ చేసినట్లు సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతోంది. ఖమ్మ వ్యవసాయ మార్కెట్ వద్ద కు వచ్చినపుడు తుమ్మల పై దాడి చేయాలని కుట్ర చేసినట్లుగా తెలుస్తోంది. అయితే  పరిస్థితి అనుకూలంగా లేక రెండు మూడు సార్లు రెక్కీ తప్ప దాడి చేయలేక పోయారనేది, ప్రణీత్ రావు విచారణలో తుమ్మల పై దాడి విషయం వెలుగలోకి వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో సంచలనం గా మారింది.*
== అజాత శత్రువు తుమ్మల పై కుట్రలా*
తుమ్మల అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో అజాత శత్రువుగా చూస్తారు.కమ్యునిస్ట్ నాయకులు సైతం తుమ్మల అంటే ఎంతో గౌరవంగా చూస్తారు.కమ్యునిస్ట్ పార్టీల ప్రభావం ఎక్కువ ఉన్న రోజుల్లో పల్లెల్లో కత్తులతో కొట్లాట లు రక్తపుటేర్లు పారకుండా
కాల్వల్లో సాగు నీళ్లు పారించి కక్ష్యలు కార్పణ్యాలు లేకుండా పల్లెల్లో ప్రశాంత వాతావరణం ఉండాలంటే సాగు నీళ్లు వస్తే పల్లెలు పచ్చగా మారతాయని, నిత్యం నీళ్ల కోసం తపించిన నాయకుడుగా తుమ్మల గుర్తింపు పొందారు.  బయట స్మారక స్తూపాలు కాదు అభివ్రుద్ది శిలాఫలకాలు ఉండాలని, రహదారులతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ని ప్రగతి బాట పట్టించిన విజనరీ నాయకుడుగా తుమ్మల చెరగని ముద్ర వేసారు.అలాంటి తుమ్మల పై దాడి కుట్ర వార్త ఎంతో ఆందోళన గా మారింది.ఆదర్శ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఉన్న ప్రజా నాయకుడు తుమ్మల పై గెలవాలంటే నోట్ల కట్టలు చాలవు ఏదో ఒక కుట్ర చేసి గెలవాలనే పన్నాగం తో కొంతమంది దాడికి కుట్ర చేసాడని తుమ్మల అనుచరులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.తీవ్ర దాడి చేసి ఎన్నికల ప్రచారంలో తిరగకుండా హాస్పిటల్ లో ఉండేలా దాడికి ప్లాన్ చేసినట్టు అనుమానాలు రేకేత్తిస్తున్నాయి.   తుమ్మల ఎన్నికల ప్రచారంలో భూ కబ్జాలు అక్రమ కేసులు లేని ఖమ్మం కోసం ఆత్మగౌరవంతో జీవించేలా ఉండే ప్రశాంతమైన ఖమ్మం కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే పిలుపుతో అజయ్ పై ఎంత విసిగి పోయారో ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ సాక్ష్యంగా నిలిచింది. తుమ్మల పై దాడి కుట్ర ను విచారణ చేసి చట్ట ప్రకారం శిక్షించాలని తుమ్మల అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో ఈ పోన్ ట్యాపింగ్ అంశం, తుమ్మల నాగేశ్వరరావు పై దాడి కుట్ర అంశం ఎంత దూరం వెళ్తుందో.. వేచి చూడాల్సిందే.