Telugu News

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..?

ఎంపిక విషయంలో తలపట్టుకుంటున్న ఏఐసీసీ పెద్దలు

0

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..?

== ఎంపిక పై ఉత్కంఠ..

== ఎంపిక విషయంలో తలపట్టుకుంటున్న ఏఐసీసీ పెద్దలు

== ముంచుకోస్తున్న నామినేషన్ ఆఖరి గడువు

== నేతల గుండెల్లో పరుగెడుతున్న రైళ్లు

== మా నేత కే టిక్కెట్ అంటూ నేతల ప్రకటనలు

== ప్రకటన ఎప్పుడూ వస్తుందా..? అని ఎదురుచూస్తున్న నేతలు, కార్యకర్తలు

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)

 

నెలలు గడిచింది.. గడువు ముంచుకోస్తుంది.. గంటల సమయమే ఖాళీగా ఉంది.. ప్రతి పక్షం పరుగులు పెడుతోంది..ప్రచారం ముమ్మరం చేసింది.. నామినేషన్ వేసింది.. నమ్మిన నేతలకు భరోసా ఇస్తూ ముందుకు సాగుతోంది.. అయినప్పటికీ హస్తం నేతల్లో ఆరాటం లేదు.. అర్బాటం లేదు.. అద్భుతమైన ఫలితం వస్తుందనే ధైర్యమో..? నేతల ఒత్తిడో తెలియదు కానీ హస్తం పార్టీ అభ్యర్థి ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. అభ్యర్థి ప్రకటన రావడం లేదు.. కళ్ళకు ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న ఫలితం లేకుండా పోయింది.. ఎప్పుడూ ప్రకటిస్తారో తెలియని పరిస్థితి.. మా నేత కే సీటు అంటూ ఎవరికి వారు ప్రకటనలు చేస్తున్నారు.. సోషల్ మీడియా లో గంటకో నేత పేరు చెక్కర్లు కొడుతున్నాయి.. ఇదిగో ప్రకటన వచ్చేస్తుంది.. అదిగో వచ్చేస్తుంది అంటూ విపరీతంగా ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఎలాంటి ప్రకటన లేదు.. దీంతో నేతల్లో క్షణం..క్షణం ఉత్కంఠను రేపుతోంది..
నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అయోమయంలో కార్యకర్తలు అయోమయంలో పడిపోతున్నారు…. వీరు ఇంతే అంటూ ఏఐసీసీ పెద్దలపై నేతల చీదరింపు కొనసాగుతుంది. ఇంకా ఎన్నాళ్ళు రా బాబు అంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఎంటీ..? అని అనుకుంటున్నారా.. అయితే

ఈ కింది లింక్ ను క్లిక్ చేసి చదవండీ..

ఈ లింక్ ను క్లిక్ చేయండి – ఖమ్మం రేసులో నిలిచేదేవ్వరు..?