Telugu News

RRR ఎవరు..?

రామసహాయం రఘురామ్ రెడ్డి పేరు తెరపైకి ఎలా వచ్చింది..?

0

RRR ఎవరు..?

== రామసహాయం రఘురామ్ రెడ్డి పేరు తెరపైకి ఎలా వచ్చింది..?

== ఆయనకు సీటు కోసం పట్టుబడుతున్నదేవరు..?

(పెండ్ర అంజయ్య, సీనియర్ జర్నలిస్ట్)

 

ఆర్ఆర్ఆర్ అంటే ఎవరు..? ఆయన ఒక్కసారిగా ఎందుకు పాపులర్ అయ్యారు..ఆయనకు కాంగ్రెస్ కు సంబంధమేంటి..? కాంగ్రెస్ టిక్కెట్ కేటాయింపులో ఆయన పేరు ఎందుకు ప్రాముఖ్యం గా వినిపిస్తోంది.. మంత్రికి వియ్యంకుడు కావడం వలన ఆయనకు క్రేజ్ పెరిగిందా..? బాగా డబ్బులు ఉన్నాడా..? ఏనాడైనా జనంలో తిలమరిగారా..? మారేందుకు ఆయనకు అంత క్రేజ్.. ఆయనంటే క్రేజ్ ఎందుకో.. మరింత సమాచారం చదవండి

ఇది కూడా చదవండి:- ఖమ్మం రేసులో RRR..?

మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల సరిహద్దు మన మరిపెడ గ్రామానికి చెందిన రామసహాయం సురేందర్ రెడ్డి కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అత్యంత సన్నిహితుడు. వరంగల్ ఎంపీగా నాలుగు సార్లు, డోర్నకల్ ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎన్నికయ్యారు. అందులో ఒకసారి చిల్లంచెర్ల నియోజకవర్గం నుండి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు, 1996లో వరంగల్ ఎంపీగా ఓడిపోయిన తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు.

1976-77లో హైదరాబాద్ రేస్ క్లబ్ ప్రెసిడెంట్‌గా మొదటి సారిగా పని చేశారు. ఆ తర్వాత 1983లో రెండోసారి ప్రెసిడెంట్ అయ్యి ఇప్పటికీ కొనసాగుతున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, గోల్ఫ్ క్లబ్‌లకు కూడా ప్రెసిడెంట్‌గా చేశారు. ఇంత రాజకీయ, పాలన అనుభవం ఉన్న రామసహాయం సురేందర్ రెడ్డి కుటుంబంలో మరో రాజకీయ నాయకుడు రాలేదు.

ఇది కూడా చదవండి:-ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాం రెడ్డి..?

కానీ ఇప్పుడు ఆయన కొడుకు రామసహాయం రఘురామ్ రెడ్డి ఖమ్మం పార్లమెంట్ బరిలో దిగడానికి రంగం సిద్ధం అయినట్లే కనపడుతోంది.

రామసహాయం రఘురామ్ రెడ్డి సికింద్రాబాద్ క్లబ్ ప్రెసిడెంట్‌గా, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బోర్డ్ ఆఫ్ గవర్నర్‌గా ఉన్నారు.
రఘురాం రెడ్డి పెద్ద కొడుకు వినాయక్ రెడ్డి ప్రముఖ సినీ నటుడు వెంకటేశ్ పెద్ద కూతురు అశ్రితను పెళ్లి చేసుకున్నాడు.
రఘురాం రెడ్డి చిన్న కొడుకు అర్జున్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు స్వప్ని రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు.

ఢిల్లీ లెవెల్‌లో చక్రం తిప్పిన పొంగులేటి.. తమ్ముడికి కాకపోయినా వియ్యంకుడికి టికెట్ ఇప్పించుకోవడంలో దాదాపు సఫలం అయ్యారు.

రఘురాం రెడ్డి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ నేడో రేపో ప్రకటించే అవకాశం ఉంది.
ఇదే తరుణంలో రామసహాయం రఘురాం రెడ్డి గారి తరుపున ఖమ్మం పార్లమెంట్ లో నామినేషన్ వారి దగ్గరి బంధువు నూకల నరేష్ రెడ్డి గారు వెయ్యడం విశేషం.