పాలేరు అభ్యర్థి ఎవరు..?
== ఆమెనా..? అతడా..?
== ప్రకటిస్తారా..? మద్దతిస్తారా..?
== అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన పొంగులేటి
== అసక్తిగా ఎదురుచూస్తున్న జనం
== నేడు తిరుమలాయపాలెంలో పాలేరు నియోజకవర్గ ఆత్మీయ సమ్మెళనం
== భారీ జన సమీకరణకు ప్లాన్ చేస్తున్న నాయకత్వం
అందరి చూపు ఆయన వైపు మల్లింది.. ఆయనేం చేస్తారా..? ఏ పార్టీలోకి వెళ్తారా..? ఎవర్ని అభ్యర్థిగా ప్రకటిస్తారా..? అనే ఉత్కంఠ జనాల్లో కనిపిస్తోంది.. ప్రతి అడుగును ప్రజలు, ప్రభుత్వం, నాయకులు నిశ్చితంగా గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.. ఆయన మైకు పట్టుకుంటే ఏం ప్రకటన వస్తుందోననే ఆశతో ఆత్రుత్తగా ఎదురుచూస్తున్న పరిస్థితి యావత్తు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది.. నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన పొంగులేటి పాలేరులో జరగబోయే ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమంలో అభ్యర్థిని ప్రకటిస్తారా..? లేదా..? అనే సందేహాలు మొదలైయ్యాయి..
ఇదికూడా చదవండి: నడిరోడ్డుపై మంత్రి ఏం చేశారంటే..?
ఇప్పటికే పాలేరు నియోజకవర్గం నుంచి ఇద్దరు అభ్యర్థులను రంగంలోకి తీసుకొచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందులో ఎవర్ని అభ్యర్థిత్వాన్ని ఖారారు చేస్తారా..? లేదంటే ఆమెకు మద్దతు ప్రకటిస్తారా..? అనే విషయంపై సర్వత్ర సందేహాలు నెలకొన్నాయి. ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాలుగు నియోజకవర్గాల్లో ప్రకటించిన విధంగానే పాలేరులో ప్రకటిస్తారా..? పరిస్థితుల కోసం ఎదురు చూస్తారా..? అనే అంశంపై విజయం ప్రతినిధి అందించే ప్రత్యేక కథనం..
(కూసుమంచి-విజయంన్యూస్)
రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఏకైక పేరు.. ‘పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి’.. ఆయన పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతోంది..బీజేపీ పార్టీ ఆగ్రనాయకత్వం కూడా పొంగులేటి జపం చేస్తుంటే.. బీఆర్ఎస్ పార్టీ ఆయనపై బాణం ఎక్కుపెట్టి కుర్చుంది.. ఒక వైపు బీఆర్ఎస్, బీజేపీ పార్టీల పోరు కొనసాగుతుంటే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ పొంగులేటిగా మారిపోయింది.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి స్వంత కుంపటిని పెట్టుకున్న పొంగులేటి ఆయా నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేసి తమ బలాన్ని నిరూపించుకుంటూ, ప్రతాపాన్ని చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.. అవకాశం దొరికనప్పుడళ్లా సీఎం కేసీఆర్ పై మండిపడుతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తారనేది ఇప్పటి వరకు స్పష్టత రాలేదు..
ఇదికూడా చదవండి: బీజేపా..? కాంగ్రెసా..? పొంగులేటి ఎటువైపు..?
అయితే ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమంలో జనంలోకి వెళ్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఇల్లెందు, పినపాక, మధిర, వైరా నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మెళన కార్యక్రమాలను నిర్వహించి కార్యకర్తలకు భరోసా కల్పిస్తున్నారు.నేను మీ వెంట ఉంటాను, మీకు అండగా ఉంటానంటూ కార్యకర్తలకు, నాయకులకు భరోసానిస్తున్నారు. మీ శీనన్న కన్నీటీని కూడా చూసి తట్టుకోలేడని, ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరని, రాబోయే రోజుల్లో మనమేంటో చూపిస్తామని సభల్లో ప్రకటిస్తుంటే ఆయన వర్గీయులకు మరింత జోష్ నింపినట్లైతుంది. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. అంతే కాదు ప్రజలు పొంగులేటి వైపు చూస్తున్నారు.. పార్టీ ఎదైనా కానీ పొంగులేటితో ఉంటే మనకు దైర్యం ఉంటుందనే విధంగా పొంగులేటి ప్రజలను తన వైపు తిప్పుకుంటున్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన నాయకత్వం మొత్తం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైపు వెళ్తున్నారు. ఇప్పటికే అనేక మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన పరిస్థితి కనిపిస్తోంది.
== అనువాయితీ కొనసాగిస్తారా..?
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్లలేదు.. కనీసం పార్టీని స్థాపించలేదు.. అయినప్పటికి తన వర్గీయులను రాబోయే ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. జనవరి 1 నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లెందు, పినపాక, ఆశ్వరరావుపేట, వైరా, మధిర నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమాలను నిర్వహించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్కడ అభ్యర్థులను అదే రోజున ప్రకటించారు.
ఇదికూడా చదవండి: కమాన్ గుసగుస.. ?!
ఇల్లెందు నుంచి ప్రస్తుత జడ్పీచైర్మన్ కోరం కనకయ్య, పినపాక నుంచి మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వరరావుపేట నుంచి అధినారాయణ, వైరా నుంచి విజయబాయి పేర్లను ప్రకటించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అదే అనువాయితీని కొనసాగిస్తారా..? ఆపేస్తారా..? అనేది అర్థం కావడం లేదు. ఈనెల 5న పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలంలో శ్రీనన్న ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమ్మెళనం కార్యక్రమంలో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందా..? ఐదు నియోజకవర్గాలో కొనసాగిన అనువాయితీని పాలేరు నియోజకవర్గంలో కొనసాగిస్తారా..?
== అతడా..? ఆమెనా..?
పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గీయులుగా ఇద్దరు ఆగ్ర నాయకులు పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులుగా పనిచేసిన రామసహాయం నరేష్ రెడ్డి, నామా నాగేశ్వరరావు వర్గీయురాలుగా పనిచేసిన మద్దినేని స్వర్ణకుమారి ఇద్దరు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గీయులుగా మారిపోయారు.
ఇదికూడా చదవండి: “మట్టా” పయనమెటో….?
గతేడాది నుంచి వీరు పొంగులేటి గూటిలో చేరి వారి పక్కన పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే పాలేరు నియోజకవర్గానికి వీరి ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మెళనం రోజున అభ్యర్థిని ప్రకటించాల్సి వస్తే ఎవర్ని ప్రకటిస్తారనే ఉత్కంఠ నెలకొంది. కార్యకర్తలు, నాయకులు కూడా ఉత్కంఠగా చూస్తున్నారు. అయితే ఇందులో కొంత సమస్య వచ్చి పడే అవకాశం లేకపోలేదు. అదేంటంటే..?
== షర్మిళకు మద్దతీస్తారా..?
పాలేరు నియోజకవర్గంలో బలమైన నాయకత్వం ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన వర్గీయులను అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం లేదనే చెప్పాలి. పాలేరు నియోజకవర్గం నుంచి వైఎస్ షర్మిళ వైఎస్ఆర్ టీపీ పార్టీ నుంచి పోటీ చేస్తానని బహిరంగంగానే ప్రకటించారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇదికూడా చదవండి: నేను తలుచుకుంటే..? అడుగుపెట్టగలవా రేవంత్ :రేగా
ఈ క్రమంలో వైఎస్ జగన్ కుటుంబంకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆమెకు వ్యతిరేకంగా అభ్యర్థిని పెట్టే పరిస్థితి లేకపోవచ్చని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానం షర్మిళతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొత్తులకు వెళ్లడం ఒక ఎత్తు అయితే, షర్మిళకు తెరవెనక లేదంటే తెరముందు మద్దతు తెలపడం జరిగే అవకాశం ఉంది. తెరవెనక ఉండాల్సి వస్తే కచ్చితంగా తమ వర్గం నుంచి డమ్మి అభ్యర్థిని నిలిపే అవకాశం రావోచ్చు. లేదంటే బహిరంగంగానే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉండోచ్చు. అయితే నిజమైన పోటీ చేయాల్సి వస్తే రామసహాయం నరేష్ రెడ్డిని పోటీలో ఉంచాలనే ఆలోచనలో పొంగులేటి ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ మహిళకు కేటాయించాల్సి వస్తే స్వర్ణకుమారికి ఇవ్వాల్సి ఉంటుంది.. ఇంత కన్ప్యూజన్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు లేకపోలేదు.. ఒక వేళ అభ్యర్థిని ప్రకటిస్తే కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లుగానే భావించాల్సి వస్తోంది.