‘అమాత్యుల’ వ్యాఖ్యలు ఎవరికి గుణపాలు.?
== ‘పాలేరు’ లో కందాళ వైపు ‘కారు’ నేతలు
== మరోసారి పోటీ చేస్తారని స్పష్టం చేస్తున్న మంత్రులు
== కందాళ గెలుపును ఆపేదేవ్వరు..? అంటూ మంత్రి వేముల సంచలన వ్యాఖ్యలు
== స్థానిక ఎమ్మెల్యేలకే నా సపొర్ట్ అంటూ ప్రకటించిన మంత్రి పువ్వాడ
== తుమ్మల ఊసేత్తని ప్రజాప్రతినిధులు
== నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు
(కూసుమంచి-విజయంన్యూస్)
గి ఏడాది జరగబోతున్న ఓట్లపండుగకు పాలేరు నియోజకవర్గంలా గులాల(గులాబీ)పార్టీలో ఎవ్వలు పోటీ చేస్తరు..? వాళ్లే పోటీ చేస్తరా..లేదంటే ఎర్రజెండోళ్లు పోటీ చేస్తరా..? గులాల పార్టీలో టిక్కెట్ ఎవలికి ఇస్తరో..? ఒక్కాయనేమో పోయిన సారి ఓడిపోయినాయన నాయకుడు గిప్పుడు మస్తుగా ప్రయత్నం చేస్తండూ.. మరోక్కాయనేమో గెలిచిని నాయకుడు..గిప్పుడు నాదే సీటంటున్నడు.. గీ సందులో సడేమియా అన్నట్లు పోయిన సారి టిక్కట్ రానాయిన మస్తుగా ప్రయత్నం చేస్తున్నడంటా..? గీ ముగ్గురిలో ఎవలికి టిక్కెట్ అస్తది..? ఎవలు పోటీ చేత్తరు..? కేసీఆర్ ఎవలికి సీటిస్తడు..? దునియా అంతట గిదే చర్చ.. ఎక్కడ చూసిన, ఏ రచ్చబండల చూసిన గిదే మాట.. పాలేరులో ఎవలు పోటీ చేస్తరు..? రాజశేఖర బిడ్డ వత్తదంటగా..? ఇగో ఆమె పోటీ చేస్తే ఇక పాలేరులో మస్తు పైసలే.. ఏమి గిరాకి ఉంటది పాలేరోళ్లకు అంటూ చర్చ జరుగుతుంది.. గి సంగతి ఓడిసిపోని కానీ.. అసలు గిప్పుటి పంచాయతీ అంతా ‘గులాల’ పార్టీవోళ్లదే కదా..? గదేందో చూద్దాం..
ఇది కూడా చదవండి: పొంగులేటికి బిగ్ షాక్
పాలేరు నియోజకవర్గంలో గులాబీ పార్టీ నుంచి మస్తు మంది పోటీ బడుతున్నరు. ఒక్కేళ్లేమో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మరోక్కేళ్లి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, ఇంకోక్కేళ్లి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటిపడుతున్నరు. ఇక గోడమీద ఎమ్మెల్సీలు తాతామధు, పల్లా రాజేశ్వరరెడ్డి ఉన్నట్లు మస్తు ప్రచారం అయితాంది. ఇగ అట్టనే ఓ కాంట్రాక్టర్ కూడా టిక్కెట్ కోసం మస్తు ప్రయత్నం చేస్తున్నడంటా..? వాళ్లసంగతేమో కానీ.. తుమ్మల నాగేశ్వరరావు, కందాళ ఉపేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎవలికి వాళ్లు మస్తు ప్రయత్నాలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం అయితాంది. ఈ క్రమంలో ఆ ముగ్గురు నేతలు వేరోచోటవేరోచోట అందరు కలుసుకునుడు అనే కార్యక్రమం పెట్టిండ్రి. కొత్త ఏడాది అంటూ ఆత్మీయ సమ్మెళన కార్యక్రమం పెట్టుకున్న ఆ ముగ్గురు వాళ్లం జనబలం ఎంతో చూపించుకుండ్రూ. రాజకీయ విందులు..పల్లెపల్లెన పర్యటనలు చేస్తున్నరు. ఎవలికి తోచినంత పైసలను ప్రజలకు పంచుతున్నరు. చావులకు, బతుకులకు, దవకానలకు, గుడ్లకు, బడ్లకు మస్తు పైసలిస్తున్నరు. జనంను కాకపట్టే పనులన్ని మస్తు చేస్తున్నరు. గిదంతా ఎన్నికలకు ఏడాది ఉండగానే పల్లెల్లో ఎన్నికల సందడి షూరు అయ్యింది. దీంతో పాలేరు నియోజకవర్గం రాష్ట్రంలోనే హాట్ టాఫిక్ అయ్యింది.. అయితే ఇంత జరుగుతున్న సందర్భంలో అమాత్యులు అందరు అశ్ఛర్యపోయే ప్రకటనలు చేస్తున్నరు. ఇగో మేమేట్ల ఇంకోక్కలకు సపోర్ట్ చేస్తం.. బరాబర్ సిట్టింగ్ లకే చేస్తం..
ఇది కూడా చదవండి: ఫ్లాన్-బీ దిశగా పొంగులేటి
వాళ్లతోనే మేముంటం అంటూ ప్రకటనలు చేస్తున్నరు. వాళ్లు చేసిన మాటలు ఇప్పుడు గులాబీ పార్టీల మస్తులొల్లి చేయిస్తున్నయ్.. గిట్లేట్ల అంటరు.. టిక్కెట్ వాళ్లకేట్ట ఇస్తరు.. ఇష్టముంటే ఉంచుకోర్రీ.. లేకుంటే ఎళ్లగొట్టుర్రి.. మా సార్ కు టిక్కెట్ ఇస్తరా..ఇయ్యరా..? అంటూ ఆ నేతల మనుషులు మస్తుగరం గరం అయితుండ్రూ. ఒక్క సారి ఆ సార్లు ఏమన్నరో చూదాం.
== ఎమ్మెల్యేలకే మా సపోర్ట్: మంత్రిపువ్వాడ
గత రెండు రోజుల క్రితం కొత్తగూడెం నియోజకవర్గంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటన జరిగింది. అక్కడ ఆయన మస్తు పైసలతో అభివద్ది పనులకు భూమిపూజలు చేసిండ్రు. ఆ తరువాత ఆయన మాట్లాడుతూ మేమంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సపోర్టు చేస్తం. మీ నియోజకవర్గంల అన్ని గ్రామాలకు మస్తు పైసలిస్తం. ఊళ్లు ఊళ్లన్ని బాగు చేస్తం. మస్తు అభివద్ది చేస్తం. మీ ఎమ్మెల్యేను మేము అక్కున చేర్చుకుంటం. మస్తు పనులిస్తం. మీ ఊళ్లకు రోడ్లేయిస్తం.. ప్రజలందరు సర్కార్ పథకాలను ఇస్తం. అయితే మీరు చేయాల్సిందళ్లా మీ ఎమ్మెల్యేలకు రాబోయే అన్నికళ్లా సపోర్టు జేసుడే.
ఇది కూడా చదవండి: విద్వేషాలు పెంచే రాజకీయాలు తగవు: తమ్మినేని
అంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన గిట్లమాట్లాడుటతో ఓడిపోయినోళ్లంతా మస్తు గరమైయ్యిండ్రు.. గిదేంది పెద్ద సారు గిట్టన్నడు అని అనుకున్నరు. అదంతా ఓడిసిపోక ముందే మరో మంత్రి సారూ అదిరిపోయే ప్రకటన చేసిండూ.. పాతోళ్లందరికి ఇక ఉత్తిదే.. ఇప్పుడున్నోళ్లదే రాజ్యమన్నట్లు చేప్పిండు.. ఆయనేమన్నడో ఒక సారి చూద్దం
== కందాళ గెలుపును ఎవరైనా అపగలరా..?: మంత్రి ప్రశాంత్ రెడ్డి
పాలేరు నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించిన అమాత్యుడు వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన మాటలు అన్నడు. పాలేరు నియోజకవర్గంలో మందిబలమున్న నాయకులు ముగ్గురు రేసులో ఉండగా పుటుక్కున ఆయన పెద్ద మాటఅనేసిండు. కందాళ గెలుపను ఎవరైనా ఆపగలరా..? మోదీ కోవర్టులు, ఆయన మద్దతుతో వస్తున్న వేరే పార్టీవోళ్లు కందాళను ఏం పీకలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేసిండూ. గి మాటలు ఆయనకు తెలిసి అన్నడో..? తెలియక అన్నడో ఏమో తెలియదు కానీ.. గా మాటలు గిప్పడు దునియా అంతట రింగురింగున పిట్టగూటిలో పోడుగు గూటిలో, సెళ్లిపోన్ల తిరుగుతున్నది. ఈ మాటల ఫలితంగా ఖమ్మం జిల్లాలోనే అత్యంత జనబలం ఉన్న నాయకులు ఆలోచనలో పడే అవకాశలు మస్తుగా కనిపిస్తున్నయ్.
ఇది కూడా చదవండి: పొంగులేటి నిర్ణయమేంటి..? ఆయన మాటలో అంతర్యమేంటి..?
గిదేంది గిట్లన్నడు.. పెద్దసారూ ఎమైనా వీళ్లకు చెప్పిండా..? వాళ్లకు టిక్కెట్ ఇస్తున్నరా..? ఇస్తే మనసంగతేంటీ..? అనే విధంగా మిగిలిన ఇద్దరు ప్రధాన నాయకులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.. ఇక గిదట్లుంచితే ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎంపీలు కూడా సిట్టింగులకే సపోర్టు చేస్తన్నట్లు కనిపిస్తోంది.. వీళ్లంతా ఐకంగా ఉంటూ అందరు ఏ కార్యక్రమం చేసిన కలిసి ఒక వేదికపైకి వస్తుండటంతో వాళ్ల బలం కూడా ఎమ్మెల్యేలకే ఉన్నట్లుగా కనిపిస్తాంది. గయతే గత నెల రోజులుగా జరుగుతున్న మంత్రుల కార్యక్రమంలో ఎక్కడ కూడా మాజీల యాస గాని.. మాజీల ద్యాసగాని, వాళ్ల గురించి పల్లేత్తు మాట కూడా మాట్లాడకపోవడం గమనర్హం. శుక్రవారం కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలంలో జరిగిన పనులు భూమిపూజ కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఊసే ఎత్తకపోవడం పట్ల కొంత విస్మయం కు గురిచేసినప్పటికి వాళ్ల మౌనం ఆలోచించదగ్గ విషయంగానే పరిగణించాల్సిన అవసరం ఉంది. గిదే జరిగితే మాజీలు చాప సదురుకోవాల్సిన అవస్యకత వస్తుందనే కొంత మంది పెద్ద నాయకులు, విశ్లేషకులు చెబుతున్నరు. మొత్తానికి పాలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు టిక్కెట్ అత్తదా..? రాదా..? తర్వాత సంగతి కానీ.. మంత్రులు ప్రకటనలు మాత్రం పాలేరు నియోజకవర్గ ప్రజలను మస్తు గందరగోళానికి గురి చేస్తుంది.. నాయకులకైతే తలబొప్పిగట్టే పరిస్థితి వస్తుందనిపిస్తోంది. చూద్దాం.. రాబోయే రోజుళ్లా అమాత్యుల సపోర్టు ఎవలికి ఉంటది.. సీఎం కేసీఆర్ ఆశీర్వదం ఎవలికి ఇస్తడో వేచి చూడాల్సిందే.