Telugu News

రైతుల హామీలను తుంగలో తొక్కిందేవరు..? :పువ్వాళ్ళ

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గప్రసాద్

0

రైతుల హామీలను తుంగలో తొక్కిందేవరు..? :పువ్వాళ్ళ

== రూ.లక్ష రుణమాఫీ ఎటుపోయింది..?

== ఉచిత ఎరువులేక్కడ..?

== ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గప్రసాద్

(చింతకాని/ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామిలను తుంగలో తొక్కి రైతుల  ఆశలను నీటిపాలు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఏం సాధించారని రైతు విజయోత్సవాలు చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ప్రశ్నించారు. టీపీసీసీ, సీఎల్పీ పిలుపు మేరకు చింతకాని మండలం లోని పాతర్లపాడు గ్రామంలో చింతకాని మండల కాంగ్రెస్ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వేరావు ఆధ్వర్యంలో మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు కొప్పుల గోవిందరావు మరియు రైతులతో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ఈ సందర్బంగా  మాట్లాడుతూ

ఇది కూడా చదవండి: తెలంగాణ యువ శక్తిని మేల్కొల్పడమే లక్ష్యం: పువ్వాళ్ళ 

దశాబ్ది ఉత్సవాల పేరుతో ఈరోజు రైతు వేదికల వద్ద నిర్వహిస్తున్న కార్యక్రమం,  మీరు రైతులకు ఇచ్చిన హామీలను తుంగలోత్రోక్కి ,రైతులకు ఇచ్చిన  హామీ మేనిఫెస్టో లో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి శనివారం వరకు కూడా రుణమాఫీ చేయకుండా కాలయాపన చేస్తూ రైతులను నానా ఇబ్బందులకు గురించేస్తున్నారని,పంటల భీమాను అటకెక్కెంచి రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించక రైతులను మోసం చేస్తున్నారని దుయ్యాబట్టారు. ప్రభుత్వం రైతులను చిన్న చూపు చూస్తుందని అందుకు నిరసిస్తూ గ్రామ రైతులతో కలిసి వారి బ్యాంకుల్లో ఋణమున్న రైతులు బ్యాంక్ వివరాలు తెలిపి గ్రామంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ నందు కె సి ఆర్ కి పోస్ట్ కార్డు ద్వారా పోస్ట్ చేయనైనది.  ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ రైతులకు రుణామాఫీ చేస్తానని హామినివ్వడంతో పాటు దళితులకు మూడేకరాలు ఇస్తానని హామినిచ్చారని, ఆ పథకాలు ఎటుబోయాయని ప్రశ్నించారు. ఉచిత ఎరువులు ఇస్తానని హామినిచ్చిన సీఎం కేసీఆర్, ఎంత మందికి ఉచితంగా ఎరువులు ఇచ్చారని ప్రశ్నించారు. రైతులు పండించిన పంటలను గిట్టుబాటు ధరకు ఎవరు ఇబ్బంది పడకుండా కొనుగోలు చేస్తామని మాటిచ్చిన ప్రభుత్వం, రోజుల తరుబడి కల్లాలో రైతులు కండ్లలో ఒత్తులేసుకుని చూస్తున్న ఎందుకు కొనుగోలు చేయడంలేదని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ని విమర్శిండం సిగ్గు చేటు: పువ్వాళ్ల

ఏం సాధించిందని ప్రభుత్వం రైతు సంబరాలు చేస్తున్నారని ఆరోపించారు.  ఈ కార్యక్రమంలో  వీరితో పాటు జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్,జిల్లా కాంగ్రెస్ నాయకులు మద్ది వీరారెడ్డి, పాతర్లపాడు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు బొర్రా శేషగిరి, గ్రామ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మద్దిని నాగేశ్వరావు,గోవిందరావు రైతులు భారీ ఎత్తున పాల్గొన్నారు.