Telugu News

ఖమ్మం రేసులో నిలిచేదేవ్వరు..?

కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక పై ఉత్కంఠ..

0

ఖమ్మం రేసులో నిలిచేదేవ్వరు..?

== కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక పై ఉత్కంఠ..

== ఎంపిక విషయంలో తలపట్టుకుంటున్న ఏఐసీసీ పెద్దలు

== ముంచుకోస్తున్న నామినేషన్ ఆఖరి గడువు

== నేతల గుండెల్లో పరుగెడుతున్న రైళ్లు

== మా నేత కే టిక్కెట్ అంటూ నేతల ప్రకటనలు

== ప్రకటన ఎప్పుడూ వస్తుందా..? అని ఎదురుచూస్తున్న నేతలు, కార్యకర్తలు

నెలలు గడిచింది.. గడువు ముంచుకోస్తుంది.. గంటల సమయమే ఖాళీగా ఉంది.. ప్రతి పక్షం పరుగులు పెడుతోంది..ప్రచారం ముమ్మరం చేసింది.. నామినేషన్ వేసింది.. నమ్మిన నేతలకు భరోసా ఇస్తూ ముందుకు సాగుతోంది.. అయినప్పటికీ హస్తం నేతల్లో ఆరాటం లేదు.. అర్బాటం లేదు.. అద్భుతమైన ఫలితం వస్తుందనే ధైర్యమో..? నేతల ఒత్తిడో తెలియదు కానీ హస్తం పార్టీ అభ్యర్థి ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. అభ్యర్థి ప్రకటన రావడం లేదు.. కళ్ళకు ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న ఫలితం లేకుండా పోయింది.. ఎప్పుడూ ప్రకటిస్తారో తెలియని పరిస్థితి.. మా నేత కే సీటు అంటూ ఎవరికి వారు ప్రకటనలు చేస్తున్నారు.. సోషల్ మీడియా లో గంటకో నేత పేరు చెక్కర్లు కొడుతున్నాయి.. ఇదిగో ప్రకటన వచ్చేస్తుంది.. అదిగో వచ్చేస్తుంది అంటూ విపరీతంగా ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఎలాంటి ప్రకటన లేదు.. దీంతో నేతల్లో క్షణం..క్షణం ఉత్కంఠను రేపుతోంది..
నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అయోమయంలో కార్యకర్తలు అయోమయంలో పడిపోతున్నారు…. వీరు ఇంతే అంటూ ఏఐసీసీ పెద్దలపై నేతల చీదరింపు కొనసాగుతుంది. ఇంకా ఎన్నాళ్ళు రా బాబు అంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఎంటీ..? అని అనుకుంటున్నారా.. అయితే ఈ కింది వార్తను పూర్తిగా చదవండి..

ఇది కూడా చదవండి:- మంత్రి తుమ్మల పై దాడికి కుట్ర..?

దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి.. ఇప్పటికే తొలి విడత పోలింగ్ పూర్తయ్యింది.. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో నాల్గొవ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం ఈనెల 18న పార్లమెంట్ ఎన్నికలకు 17 స్థానాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది.. దీంతో ముమ్మరంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ కూడా 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఖమ్మం, కరీంనగర్ తో పాటు హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ అభ్యర్థులను ప్రకటించలేదు. నామినేషన్ గడువు ముగిసే సమయం అసన్నమవుతుండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా చర్చలు జరుపుతూనే ఉంది..

== హాట్ టాపిక్ గా ఖమ్మం సీటు

కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఖమ్మం జిల్లా.. పార్లమెంట్ ఎన్నికలు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక సార్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీనే. అంతటి హాట్ సీటు ఖమ్మం.. అలాంటి సీటు కు అభ్యర్థిని ఎంపిక చేయడమంటే ఆ పార్టీ అధిష్టానానికి కత్తి మీద సాము లాంటిదే. నిజంగా అదే జరుగుతుంది ఇప్పుడు. ఖమ్మం ఎంపీ సీటుపై పదుల సంఖ్యలో ఆశావాహులు కన్నేశారు. కచ్చితంగా గెలిసే సీటు కావడంతో ఖమ్మం జిల్లా వారే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు కన్నేశారు. టిక్కెట్ దక్కించుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతే కాదు ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ఖమ్మం టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. టిక్కెట్ ఇస్తే గోడ దూకేస్తామని మంచి ఆఫర్లు ఇస్తున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానంకు ఖమ్మం టిక్కెట్ తలనొప్పిగా మారింది..

== టిక్కెట్ ఎవరికి..?

ఖమ్మం పార్లమెంట్ సీటు కోసం పదుల సంఖ్యలో ఆశావాహులు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులకు సంబంధించిన కుటుంబ సభ్యులకు సీటు ఇవ్వాలని అధిష్టానం పై ఒత్తిడి చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సతీమణి మల్లు నందిని టికెట్ ఇవ్వాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరావు తన కుమారుడు తుమ్మల యుగంధర్ టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న ముగ్గురు నేతలు తమ వారికే టికెట్ కేటాయించాలని అధిష్టానం పై ఒత్తిడి తీసుకురావడంతో ఖమ్మం టికెట్ హాట్ సీట్ గా మారింది. దీంతో ఏఐసీసీ ఒక కీలక ప్రకటన చేసినట్టుగా తెలుస్తుంది. మంత్రులుగా పనిచేసిన వారి కుటుంబాల్లో టికెట్ ఇచ్చేది లేదని స్పష్టంగా చెప్పినట్లుగా సమాచారం. దీంతో ముగ్గురు మంత్రులు తమ వర్గానికి చెందిన నాయకులకు టికెట్లు కేటాయించాలని పార్టీ అధిష్టానం పై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే డిప్యూటీ సీఎం విక్రమార్క తన వర్గీయుడైన రాయల నాగేశ్వరావుకు కేటాయించాలని కోరుతుండగా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన వియ్యంకుడైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ రామసహయం రఘురాం రెడ్డికి టికెట్ ఇవ్వాలని,మరో మంత్రి తుమ్మల నాగేశ్వరావు తన స్నేహితుడైన మండవ వెంకటేశ్వరరావు లేదంటే వివిసి రాజాకు టికెట్ కేటాయించి కేటాయించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవలే బీసీ నినాదం తెరపైకి వచ్చింది. ఖమ్మం టిక్కెట్ బీసీ నేతలకు కేటాయించాలని డిమాండ్ రావడంతో ఏఐసీసీ బీసీ నేతల పేర్లను పరిశీలించినట్లు సమాచారం. సీనియర్ నేత వి.హనుమంతురావు, ఓయూ నేత లోకేష్ యాదవ్ పేర్లను ఏఐసీసీ పరిశీలించినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ పెద్దలకు ఖమ్మం సీటు తలనొప్పిగా మారిందనే చెప్పాలి. అభ్యర్థి ఎంపిక కత్తిమీద సాము గా మారింది. దీంతో ఏఐసీసీ తమపై పడిన భారాన్ని వదిలించుకున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం, కరీంనగర్ సీటు ఎంపిక మీరు చూసుకోండి అని బంతిని తెలంగాణ కాంగ్రెస్ గూటిలో పడేసినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దిప్ దాస్ గుప్తా, రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. దీంతో అభ్యర్థి ప్రకటన విషయంలో కాంగ్రెస్ నేతలు తలమునకలవుతున్నారు.

== ఎవరికి వారే ప్రకటనలు

ఖమ్మం సీటు మా నేత కే దక్కిందని, రాహుల్ గాంధీ డిసైడ్ చేశారని, సాయంత్రం లోపు ప్రకటన వచ్చేస్తుందని సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పెస్తున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ మొదలైంది. టిక్కెట్ ఎవరికి వస్తుందో అర్థం గాకా ఆయోమయానికి గురవుతున్నారు. చాలా మంది కాంగ్రెస్ నేతలు టెన్షన్ కు గురవుతున్నారు. మా నేతకు వేస్తే మాకు ప్రియార్టీ ఉంటుందని, అందుకే మా నేతకు టిక్కెట్ రావాలని ఎవరి వర్గం నేతలు వారు ఆలోచనలో పడ్డారు. అందుకే సోషల్ మీడియా వేదికగా పోస్టులు వేస్తున్నారు. ఇంకో వైపు ఆశావాహుల్లో మాత్రం గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయనే చెప్పాలి. నామినేషన్ కు గడువు దగ్గర పడుతుండటంతో టిక్కెట్ ఎవరికి వస్తుందో అర్థం గాకా తలలు పట్టుకుంటున్నారు. నామినేషన్ కు సిద్దం కావాలా, వద్దా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వారికి భరోసా ఇచ్చే నాయకుడు కూడా లేరనే చర్చ జరుగుతోంది. దీంతో ఆశావాహులు ఎదురుచూపులు తప్ప మరోటి లేకుండా పోయింది. చూద్దాం కాంగ్రెస్ అధిష్టానం టిక్కెట్ ఎవరికి కేటాయిస్తుందో..? మరీ..

 

టిక్కెట్ ఇతనికేనా..? మరింత విశ్లేషణాత్మక కథనం మరికొద్ది గంటల్లో..