Telugu News

రైతులంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎందుకు చిన్నచూపు: పొంగులేటి

ఎంఎస్‌పీ ధరతో కొనుగోలు చేస్తే ఏ "బంధు" అవసరం లేదు

0

రైతులంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎందుకు చిన్నచూపు: పొంగులేటి

== నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి

== అమ్మకు అన్నం పెట్టనోడు… పిన్నమ్మకు గాజులు చేయిస్తాడా

== మోడల్ రైతులంటూ పక్క రాష్ట్రాల్లో చూపించి మోసం చేస్తున్నారు

== ఎంఎస్‌పీ ధరతో కొనుగోలు చేస్తే ఏ “బంధు” అవసరం లేదు

== మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

== ఖమ్మంలో భారీగా రైతు భరోసా యాత్ర

==  కలెక్టరేట్ ఎదుట పొంగులేటి అనుచరులకు , పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదం‌..

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఒక వైపు అకాల వర్షాలు వచ్చి చేతికందిన పంటలు నీళ్ల పాలు అవుతుంటే, ఆ పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిన సీఎం కేసీఆర్ మన రాష్ట్రాన్ని వదిలేసి పక్కరాష్ట్రంలో సంబరాలు చేస్తున్నారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. తక్షణమే కొనుగోలు చేస్తామని గొప్పలు చెబుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తక్షణమే అంటే ఎన్ని రోజులని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై శనివారం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతు భరోసా యాత్రకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులను మోడల్ రైతులు అంటూ, బీఆర్ఎస్ పార్టీ పెట్టి మహారాష్ట్రలో కేసీఆర్ చూపిస్తున్నారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.

ఇది కూడా చదవండి: తక్షణమే అంటే.. ఎన్ని రోజులు: పొంగులేటి

తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై శనివారం ఖమ్మంలో శ్రీనన్న రైతు భరోసా యాత్రను శ్రీకారం చుట్టారు. తొలుత పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన నివాసం నుంచి భారీగా ర్యాలీలో గోపాలపురం లో ఉన్న కలెక్టరేట్ సమీకృత కార్యాలయం వరకు ట్రాక్టర్, ఎడ్ల బండి తో వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలతో మొక్కజొన్న, వరి పంట నష్టపోతే ఇప్పటి వరకు ప్రభుత్వం రైతులకు ఎలాంటి తక్షణం సహాయం అందించలేదన్నారు. అమ్మకు అన్నం పెట్టనోడు… పిన్నమ్మకు గాజులు చేస్తాడా అంటూ.. ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన చేసి ఎన్ని రోజులైంది..? తక్షణమే అంటే.. ఎన్ని రోజులు అంటూ..? కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నష్టపోయిన రైతులకు రూ.10 వేలు ఇస్తామని ఎన్ని రోజులు అయిందో ప్రభుత్వమే చెప్పాలన్నారు.  రైతుల పంటను ఎంఎస్ పీ ధరకు కొనుగోలు చేసే, ఏ బంధు అవసరం లేదన్నారు. అకాల వర్షాలకు పంట పొలాల్లో తడిసిన ధాన్యాన్ని రాజకీయ వివక్ష లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఎకరాకు రూ. 30 వేల రూపాయలు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇది కూడా చదవండి: ఖమ్మంలో రైతు భరోసా యాత్రలో ఉద్రిక్తత

ముఖ్యమంత్రి హామీ రుణ మాఫీ వెంటనే అందించి రైతులను ఆదుకోవాలన్నారు. అనంతం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్లకు అందజేశారు.

== అధిక సంఖ్యలో పాల్గొన్న రైతులు..

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉదయం 11.00 తన నివాసం నుంచి పెద్ద ఎత్తున జన సమూహంతో కలిసి యాత్ర ప్రారంభించారు. కాలినడక ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలతో దెబ్బతిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ముందుకు సాగారు. శ్రీ శ్రీ విగ్రహం నుంచి కాలినడక ద్వారా నూతన కలెక్టరేట్స్ వరకు యాత్ర కొనసాగించారు. యాత్ర మధ్యలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించి ఎన్ని రోజులు గడుస్తున్నాయి..? తక్షణమే అంటే ఎన్ని నెలల..? అంటూ ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. ఈ రైతు భరోసా యాత్రకు వివిధ మండలాల నుంచి భారీగా రైతులు తరలివచ్చారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్, ఎడ్ల బండి నడుపుతూ కూడా తన నిరసన వ్యక్తం చేశారు.

==  రైతు భరోసా యాత్రలో ఉద్రిక్తత…

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతు భరోసా యాత్రలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత ఏర్పడింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ కలెక్టరేట్ లోపల వెళుతున్న నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారు.

ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్ పై పోటీకి నేను సిద్దం: పొంగులేటి 

లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయటంతో ఒక్కసారిగా పొంగులేటి అనుచరులు లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కొంతమందినే లోపలకు అనుమతించారంటూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఎదుట రైతులు చేతుల్లో మొక్కజొన్న వరి ధాన్యాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ రైతు భరోసా యాత్రలో మాజీ ఎంపీ పొంగులేటి తో పాటు మద్దినేని బేబీ స్వర్ణ కుమారి, మువ్వా విజయ బాబు, తుళ్ళూరి బ్రహ్మయ్య, బొర్రా రాజశేఖర్, విజయ భాయి ,కోటా రాంబాబు, పాయం వెంకటేశ్వర్లు, జారె ఆది నారాయణ, ఊకంటి గోపాలరావు తదితరులు ఉన్నారు.